1988... May 22
బయట జోరున వాన.....
సీతారామపురం రామాలయం వీధి చివర ఉన్న స్ట్రీట్ లైట్ వెలుతురులో తళుక్కుమంటున్న వాన నీటి ధారలో ఆ ఇల్లు మసక మసకగా కనిపిస్తుంది....
అపుడే దూరదర్శన్ లో శాంతి స్వరూప్ గారి వార్తలు ముగిసి చిత్రలహరి మొదలయింది ... సరిగ్గా ఏడున్నర ...
"అమ్మా .... నాన్న ఇంకా రాలేదేంటి .... " ఏడుపు మొహం పెట్టింది బుజ్జులు..
"వచ్చేస్తాడమ్మా .... ఆఫీస్ లో ఎదో పని పడి ఉంటుంది.... " అంది సరళ తన వళ్ళో పడుకున్న బుజ్జులు జుట్టు నిమురుతూ ...
"అమ్మా ... చిరంజీవి పాట " చూపించింది బుజ్జులు టీవీ కేసి ... "నాన్న చిరంజీవి సినిమాకి కూడా తీసుకెళ్తా అన్నాడు తెలుసా ... అమ్మకి చెప్పొద్దు .. అది రాకాసి అన్నడు" అంది నవ్వుతూ ... చిత్రలహరి లో కొత్తగా రిలీజ్ అయిన యముడికి మొగుడు సినిమాలోని "అందం హిందోళం ..." పాట వస్తుంది... బుజ్జులు కాసేపు అన్ని మరిచిపోయి చిరంజీవి పాట చూస్తూ తాను కూడా నోటికి వచ్చింది పాడుతుంది....
బుజ్జులు ఆలా సరళ వడిలోనే నిద్రలోకి జారుకుంది.... చిత్రలహరి ముగిసి జాతీయ కార్యక్రమాలు ఏవో వస్తున్నాయి... సరళకి అసహనం పెరిగిపోతుంది .. 'బుజ్జులు పుట్టినరోజు కూడా మర్చిపోయేంత పనులేంటి ఈయనకి .... పాపం చంటిది నాన్న వస్తేనే కేక్ కట్ చేస్తా అని చూసి చూసి పడుకుంది.. '
టేబుల్ మీద ఉన్నకేక్ పై సగం తెరిచిన కిటికీ నుండి పడిన స్ట్రీట్ లైట్ వెలుతురులో మెరుస్తున్నాయి ఆ అక్షరాలు ... 'బుజ్జులు.... నాన్న బంగారం" అని.. ఆ కేక్ చుట్టూ ఆరు కొవ్వొత్తులు ....
"ఏంటమ్మాయ్ ... కృష్ణ బాబు ఇంకా రాలేదా?... " అంటూ లోపలికి వచ్చింది పక్కింటి రాజ్యలక్ష్మి ...
"ఇంకా లేదు పిన్ని.... పాపం బుజ్జులు ఆయన వస్తే కేక్ కట్ చెయ్యాలని ఆలా చూసి చూసి పడుకుంది ... పాపం ఎంత బెంగ పెట్టుకుందో .... ఈ మగాళ్ళకి ఇంటి ధ్యాసే పట్టదు బైటకెళ్తే ... "
"కంగారు పడకు సరళ ... వచ్చేస్తాడులే ... రాజముండ్రి నుంచి బైక్ మీద రావాలిగా .... పైగా వర్షం కూడా ... లేట్ అయ్యుంటుందేమో .." అంది సర్ది చెప్తూ ...
"ఏమోలెండి .... ఉండండి పిన్ని పాయసం తెస్తాను... "
"వద్దమ్మా ఇప్పుడు ... ఈ షుగర్ జబ్బు వచ్చినప్పటినుండి తీపి ముడితే ఒట్టు .... సరేలే మీ అంకుల్ గారు వచినట్లున్నారు నేను వెళ్తాను... " అంటూ బయల్దేరింది వాళ్ళింటి గేటు చప్పుడు కాగానే ...
రాజ్యలక్ష్మి గారు బయటకి వెళ్లి చూడగా వచ్చింది వాళ్ళ ఆయన కాదు ..
కళ్ళజోడు సవరించుకొని చూస్తూ "ఎవరూ .... ??" అంది
"కృష్ణ ప్రసాద్ గారి ఇల్లు ....??"
"ఆ ఈ పక్కిల్లే ... ఏమిటి పని?" అంది గొడుగు తెరుస్తూ వర్షం మెండు కావడంతో ...
"ఇంట్లో ఎవరన్నా ఉన్నారా ... "
"ఇంట్లో మా అమ్మాయి ఉంది... కృష్ణ బాబు ఇంకా రాలేదు... పనేమిటో నాకు చెప్పండి .."
"అదీ .... కృష్ణ ప్రసాద్ గారు రాజముండ్రి నుండి వస్తుండగా ఆక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే చనిపోయారు... ఈ విషయం వారి భార్యకి తెలియజేయండి ... బాడీ ఉదయం ఐదింటి కల్లా పోస్ట్ మార్టం పూర్తి చేసి ఇంటికి పంపిస్తారు ... అడ్రస్సు కనుక్కోవడంలో కొంత జాప్యం జరిగింది ... ఫోన్ నంబరు లేకపోవడం వల్ల ట్రంకాలు చేయలేకపోయాము ..."
రాజ్యలక్ష్మికి ఒక్కసారిగా వణుకు వచ్చింది ... వళ్ళంతా చెమటలు .. తూలిపోయి పడబోతూ పక్కన గోడని పట్టుకొని మెల్లిగా సరళ ఇంటి వైపు వెళ్ళింది ...
"అమ్మా ... నాన్న వచ్చాడా?" బుజ్జులు లేచింది...
"నాన్న నీకోసం గుర్రం బొమ్మ తేవడానికి టౌన్ కి వెళ్లాడంట... పక్కింటి తుపాకీ తాత చెప్పాడు .... నువ్వు గుర్రం బొమ్మ అడిగావు కదా అందుకని వెళ్ళాడంటా .... "
"నాకు గుర్రం బొమ్మొద్దు ... నాన్నే కావాలి .... "
కిటికీ గుండా చూస్తున్న రాజ్యలక్ష్మి కళ్ళలో నీళ్లు వర్షపు జల్లుల్లో కలిసిపోయాయి ...
సరిగ్గా అప్పుడు టైం 11 45
******************* ******************* ********************

2017 May 22
పక్క సీట్లో ఎవరో గట్టి గట్టిగా మాట్లాడుకోవడం వినిపించి నిద్ర మత్తు వదిలి బద్దకంగా కళ్ళు తెరిచి చూసాడు సుధీర్... బస్ ఆగి ఉంది...
వెంటనే వాచ్ కేసి చూసుకున్నాడు... టైం పదకొండు కావస్తుంది...
బస్సు కిటికీ లోంచి బయటకి తొంగి చూసాడు.. డ్రైవర్ కండక్టర్ తో పాటు సగం మంది కిందే ఉన్నారు..
సుధీర్ కి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు...
"ఏమైంది?" అడిగాడు పక్క సీటు అతన్ని...
"బస్సు రిపేర్ అంట...ఆగి గంట దాటింది.." అన్నాడు, గంట నుంచి కుంబకర్ణుడిలా ఇంత హాయిగా ఎలా నిద్రపోయావు అనే అర్థం ధ్వనించే స్వరంతో...
మళ్ళీ కిటికీ బయటకి తొంగి చూసాడు..
కొంత మంది అక్కడ ఉన్న పెద్ద మర్రి చెట్టు క్రింద కూర్చొని ఏవో పిచ్చా పాటి మాట్లాడుకుంటున్నారు... మరి కొంత మంది రోడ్డు మీద అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు... అర్థరాత్రి అయినా పౌర్ణమి కావడంతో అంతా వెన్నెల పరుచుకొని ఎంతో ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం..
ఆఫీసు నుంచి హడావిడిగా వచ్చి ఉన్నపళంగా రడీ అయ్యి, బస్టాండ్ కి వచ్చి బస్సులో కూర్చున్నాక కొంచెం కుదుట పడ్డాడు సుదీర్... ఆఫీసులో బాగా అలసిపోవడంతో మత్తుగా నిద్ర పట్టేసింది... "పెళ్లి సంబంధం చూశాను.. పిల్ల చక్కగా ఉంది.. అమ్మాయి తరపు వాళ్ళకి సమ్మతమే ... నువ్వు కూడా వచ్చి చూసుకో.. నీకు కూడా నచ్చితే ఇక ముహూర్తాలు పెట్టించేస్తాను" అని గత నెల రోజులుగా సుదీర్ వాళ్ళమ్మ పోరు పెడుతూనే ఉంది ఇంటికి రమ్మని, కానీ తనకి ఇన్నాళ్ళకు కుదిరింది.. పెళ్లి సంబంధం విషయం గుర్తుకురాగానే కొంచెం ఆలోచనలో పడ్డాడు సుదీర్ .. ఆ అమ్మాయి తన అభిరుచులకి తగ్గట్టుగా ఉంటుందో లేదో ... ఒకవేళ తనకి నచ్చకపోతే అమ్మకి ఏమని కారణం చెప్పాలో.. ఒక వేళ అప్పటికి నచ్చి ఒప్పుకున్నాక, తరువాత ఎమన్నా తేడా జరిగితే ఎలాగా?.. ఇలా సాగుతున్నాయి సుదీర్ ఆలోచనలు...
తన సెల్ ఫోన్ తీసి ఆ అమ్మాయి ఫోటో మరోసారి చూసాడు ... 'సమీరా ... చక్కని పేరు .. చక్కగా ఉంది ... ఫైనల్ చెయ్యడం బెటర్ ఏమో ... లేదు లేదు ... కలిసి అన్నీ మాట్లాడుకున్నాకే ఫైనల్ చేస్తా ..' అనుకుంటూ మరోసారి ఆ అమ్మాయి ఫోటో చూసి ఫోన్ లోపల పెట్టుకున్నాడు ...

ఇక సీటులో కూర్చోలేక బస్సు దిగి బయటకి వచ్చాడు..
ఒక్కసారిగా చల్లటి గాలి ముఖానికి తాకి హాయి కలిగించింది.. నడుస్తున్న ప్రతి అడుగులో ఏదో ఒక కొత్త పులకింత.. తెలియని ఆత్మీయత... కాసేపు అలాగే నిల్చుండిపోయాడు...
అంతలోనే తేరుకొని, కండక్టర్ దెగ్గరికి వెళ్లి "ఇంకెంతసేపు పడుతుంది?" అని అడిగాడు
"సరిగ్గా చెప్పలేం సార్.. ఇది సీతారామపురం అని మారుమూల పల్లెటూరు పొలిమేర.. ఈ ఊళ్ళో మనకి మెకానిక్కులు ఎవరూ దొరకరు.. రాజమండ్రి డిపోకి చేస్తే ఇంకెవరినో పంపిస్తా అన్నాడు.. వాడు అక్కడనుంచి రావాలి.. ఇది బాగు కావాలి.. తెల్లవారోచ్చేమో.." అన్నాడు..
ఆ మాట వినేసరికి ఒక్క సారిగా నీరసం వచ్చేసింది సుధీర్ కి.. ఏమి చెయ్యాలో పాలు పోలేదు .. వెళ్లి అలా ఆ పెద్ద మర్రి చెట్టు క్రింద తను కూడా సెటిల్ అయ్యాడు ... అక్కడ కూర్చున్న వాళ్ళు ఏవేవో మాట్లాడుకుంటున్నారు ..
కండక్టర్ దెగ్గరికి వెళ్లి "హైదరాబాద్ కి ఇంకేమైనా బస్సులు ఉన్నాయా ఈ రూట్ లో వచ్చేవి .." అని అడిగాడు ...
"ఇంకో అరగంటలో ఉంది వోల్వో బండి రాజముండ్రి నుండి... అరగంటలో రాజముండ్రి వెళ్ళలేరు కానీ... సీతారామపురం బస్సు స్టాండ్ లో నిల్చొని చెయ్యి ఊపి రిక్వెస్ట్ చెయ్యండి ... ఆపుతాడు ... "
"సరే .. థాంక్స్ .." అని చెప్పి అటుగా వెళ్లే మోటార్ సైకిల్ అతన్ని రిక్వెస్ట్ చేసి సీతారామపురం బస్సు స్టాండ్ లో దిగాడు...
ఒక్క పురుగు కూడా లేదు అక్కడ ... పల్లెటూరు కదా ... ఒక చిన్న షెడ్ లా ఉంది ఆ బస్సు స్టాండ్ ... 'ఎర్రంశెట్టి సూర్యకాంతమ్మ గారి జ్ఞాపకార్థం' అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది ఆ షెడ్ మీద ... 'హ్మ్మ్ ... గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు కట్టాలి... ఈ పల్లెటూళ్ళని అసలు పట్టించుకుంటారా ... ' అనుకున్నాడు..
తనకి చాలా అసహనంగా ఉంది ...
సడన్ గా బోరున వర్షం మొదలైంది .... చిటికెలోనే కుండపోతలా తయారయింది ....
ఆ షెడ్డు నుండి వాన నీరు కారుతుండటంతో ఒక పక్కకి జరిగి కూర్చున్నాడు...
"ఛా... ఈ బస్ ఎప్పుడు వస్తుందో ...." అసహనం మింగేస్తుంది తనని ....
టైం చూసాడు 11 45 అయ్యింది ....
ఇంతలోనే ... "ఏవండీ ... " అంటూ పెద్దగా కేక వేసుకుంటూ వస్తుంది ఆమె ...
తన వైపే వస్తుంది....
వర్షంలో ఆమె ముఖం సరిగ్గా పనిపించడం లేదు ....
ఆమె తనకి అతి దెగ్గరగా సమీపిస్తోంది ...
అపుడు కనిపించింది ఆమె ముఖం .... స్పష్టంగా ... ఆశ్చర్యపోయాడు ... నివ్వెరపోయాడు .... తను... ఇక్కడ ... ఈ వర్షంలో ... అసలు తాను కలగనడం లేదు కదా... అప్రయత్నంగా అంటున్నాడు "సమీరా... " అంటూ
"నా మొహం ... సమీరా ఎవరండీ .... బుజ్జులు పుట్టిన రోజుతో పాటు నా పేరు కూడా మర్చిపోయారా... అయినా చంటిది మీకోసం సాయంత్రం నుండి చూస్తుంది .. ఆ ధ్యాస ఏమైనా ఉందా మీకు ... ఈ టైం లో ఇక్కడ ఒక్కరే కూర్చున్నారేమిటి ... " అంటూ అతన్ని లేపి తనతో లాక్కెళుతుంది ...
అంతా అయోమయంగా ఉంది ... అయినా ఆమెని అలాగే అనుసరిస్తున్నాడు ... "ఎవరు మీరు?" గొంతులోనే ఆగిపోయింది అతని ప్రశ్న ... ఏమీ మాట్లాడలేని నిస్సహాయత ఎదో అతన్ని ఆవహించి వివశుడిని చేస్తుంది ... తన ఉనికినే కోల్పోతున్నాడా అనే భయం అలుముకుంటున్నా .. అంతకన్నా బలమైన శక్తి ఎదో అతన్ని ఆమె వైపు లాక్కెళుతుంది ...
చుట్టూ చూసాడు ... అంతా విచిత్రంగా కనిపిస్తుంది ... ఎప్పుడూ చూడని పరిసరాలు ... కానీ అక్కడి అడుగడుగు అతని మస్తిష్కంలో ముద్రించి ఉంది ... దారిపొడుగునా ఉండే చెట్లు కూడా అతన్ని పలకరిస్తున్నాయి ... వర్షపు జల్లు అతన్ని ఆత్మీయంగా అల్లుకుంటుంది ... అతని వాచ్ కేసి చూసుకున్నాడు ... HMT వాచ్ ... తాను ముచ్చటపడి కొనుక్కున్న ROLEX కాదు ... ప్యాంటు తడుముకున్నాడు ... సెల్ ఫోన్ లేదు ... బుజ్జులు కోసం కొన్న 5 స్టార్ చాకోలెట్లు ఉన్నాయి ... చొక్కా కేసి చూసుకున్నాడు ... pepejeans టీ షర్ట్ కాదు ... పాపారావు బట్టల కొట్టులో తన కోసం ఆమె ప్రేమగా కొని కుట్టించిన నీలి రంగు చొక్కా ... ప్యాంటు.. జీన్స్ కాదు ... బెల్ బాటమ్ ... పర్సు తీశాడు .. అందులో రెండు వేల రూపాయల నోటు లేదు ... రెండు వంద నోట్లు ... రాజముండ్రి పేపర్ మిల్స్ లో సూపర్ వైజర్ ఐ.డీ కార్డు దాని మీద 'కృష్ణ ప్రసాద్ .. సూపర్ వైజర్ ... పేపర్ మిల్ .. రాజముండ్రి 1988' అని ఉంది ... తానెవరు? తనని తాను ప్రశ్నించుకున్నాడు ... అతనిలో కొన్ని వేల అగ్ని గోళాలు పగులుతున్న శబ్దం ... అతి నిశ్శబ్దం ... ఇది కాదు అబద్దం ....
రాయాలయం వీధి వైపు తిరిగారు ఇద్దరూ ..ఆ మూల మలుపున అంటించిన సినిమా పోస్టర్ చూసాడు "యముడికి మొగుడు... విజయవంతమైన 4 వారం .."
అప్రయత్నంగా ఆమె వైఫు చోస్తూ .. "సరళా... ఈ రోజు బుజ్జులుని సినిమాకి కూడా తీసుకెళ్తా అని చెప్పాను ... పాపం బుజ్జులు బెంగ పెట్టుకుందా .... రేపు దానికోసం సెలవు పెడతానే ... రాజమండ్రిలో సినిమా చూపించి ... ఐస్ క్రీం తినిపించి.. గుర్రం బొమ్మ కొంటాను ... " అన్నాడు ....
"మీ గారాల పట్టిని మీరే తీసుకెళ్లండి ... నేను రాను ... రాజ్యం పిన్ని రేపు సంతకి వెళ్దాం అంది ... కొనాల్సినవి చాలా ఉన్నాయి... "
----- Exciting and thrilling final part very soon
----- Your Ramakrishna Reddy is back to blogging after 7 years.