Friday, June 4, 2010

సాఫ్టువేర్ సింహా...


"సింహా ఎక్కడ?"
"ఇంకా ఆఫీసుకి రాలేదు సార్.."
"ఇడియట్...వచ్చాక నా కాబిన్ కి రమ్మను..." అంటూ వెళ్లాడు ప్రాజేక్ట్ మేనేజర్ (PM)...

****సీన్ పార్కింగ్ బేస్మెంట్ కి మారుతుంది****

ఒక బ్లాక్ స్కార్పియో ఆఫీసు గేటు పైనుండి ఎగ్గిరి దూకి సరాసరి పార్కింగ్ లాట్ లో ల్యాండ్ అవ్వగా... అక్కడ ఉన్న ఒక సెక్యురిటీ గార్డ్ బిత్తరపోయి తత్తరపడతాడు..
అందులో ఉన్న వ్యక్తి, కాదు ఒక శక్తి, మామూలుగా డోర్ తీసుకొని కాకుండా డోర్ బద్దలుకొట్టుకొని బయటకి వచ్చాడు, ఆ దెబ్బకి కార్ డోర్ ఎగ్గిరి సెక్యురిటీ గార్డ్ తల మీద పడింది...వాడు దెబ్బకి అక్కడే బబ్బున్నాడు..
"నేను ఆఫీసు నుంచి సాయంత్రం వచ్చేసరికి కొత్త డోర్ ఉండాలి.. లేకపోతే రేపు డోర్ బదులు నిన్ని విసిరేస్తా.." అంటూ వెనుక కూర్చున్న ఒకతనికి చెప్పి ఆఫీసు లోకి యంటర్ అవుతాడు సింహా..

"సింహా...పి.యం గారు మిమ్మల్ని తన కాబిన్ కి రమ్మన్నారు !!"...చెప్పాడతను
"కుయ్యా గాడికి మూడింది ..." అంటూ సింహా నడిచి వెళుతుంటే ఒక బండ పిల్ల అతన్ని చూస్తూ చొంగతో సహా పైట కూడా జార్చుకొని "వావ్...మగాడంటే ఇతనే.. సింహం నడుస్తున్నట్లుంది.." అంటూ కార్చుకున్న చొంగతో ఆమె కీ బోర్డు తడిచిపోయింది..

సింహా డైరెక్ట్ గా పి.యం కాబిన్ కి వెళ్లి కుర్చోలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని " ఊ..." అంటాడు...
"మిష్టర్ సింహా నీకు ఈ మధ్య కోడింగ్ ఎక్కువైంది, తగ్గించు... ఇంకోసారి ఇన్ని బగ్గులు వస్తే ..." అతని మాట పూర్తికాకుండానే..
"ఇష్ ష్ ష్ ష్....నేను ఎవరికైనా రెండు ఆప్షన్స్ ఇస్తాను..ఆప్షన్ ఏ, కోడింగ్ రాసి బగ్గులు లేకుండా టెస్టింగ్ చెయ్యమనడం...ఆప్షన్ బీ, బగ్గు చూపించిన వాడి బుర్రని బండకేసి బాదడం.."
"ఏం పిచ్చి పిచ్చిగా ఉందా...నా సంగతి తెలీదేమో..."
"నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచెయ్యాలి...అలా కాదని మోకాలులో ఉన్న నీ బుర్ర పనిచేసిందో, నీకు జీవితంలో నెక్స్ట్ అప్రైజల్ ఉండదు..."
పి.యం కరెంటు షాక్ కొట్టిన కాకిపిల్లలా అలాగే బిగుసుకుపోయాడు ..

సింహా తన డెస్క్ దెగ్గరికి రాగానే అందరూ చాలా టెన్షన్ గా ఉన్నారు..
"ఏమయింది "అడిగాడు సింహా..
"ఈ ప్రోగ్రాం ఎవ్వరికీ రావట్లా... ఇంకో గంటలో డెలివరీ.." అంటాడు ఒకతను..
"సరే...నేను పది నిముషాల్లో ఈ ప్రోగ్రాం రాస్తా... మీరంతా కాస్త దూరంగా పొండి..నేను ప్రోగ్రాం రాసేప్పుడు ఎవరూ చూడకూడదు.." అంటూ వాళ్ళని ఒక పదడుగులు దూరంగా పంపించి ప్రోగ్రాం రాస్తుండగా, పి.ఎం అటువైపుగా వచ్చి వీడు ఇంత సీరియస్ గా ఏం చేస్తున్నాడబ్బా అంటూ మిగతా వాళ్ళు వద్దు అని చెప్తున్నా వినిపించుకోకుండా సింహా కంప్యూటర్ లోకి తొంగి చూడబోతుండగా... సింహా సడన్ గా పి.యం వైపు తిరిగి ...."చూడు... ఒక స్క్రీన్ వైపే చూడు...దాని వెనకున్న గూగుల్ స్క్రీన్ చూడకు...తట్టుకోలేవ్...మా....డి...పోతావ్ .." అని గాండ్రించడంతో వీచిన గాలి మరియు సింహం జొల్లు వచ్చి పి.ఎం మొహాన పడటంతో, పి.యం ఎగ్గిరి సెక్యూరిటీ గార్డ్ కాళ్ళ మీద పడతాడు ... సెక్యురిటీ గార్డ్ "దీర్ఘ సుమంగళీ భవ" అని దీవించడంతో "థూ...దీనెమ్మ జీవితం ..." అంటూ తిట్టుకొని సింహా దెగ్గరికి వెళ్తాడు ..

"రేయ్ ఏంట్రా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావ్...ఈ ఆఫీసు ఏమన్నా నీదా?"
"ఒకసారి దేన్నైనా నాది అనుకున్నానంటే ఎంత దూరం వెళ్తానో నాకే తెలీదు ..." ఆ మాటతో జోళ్ళు కార్చుకున్న బండ పిల్ల సిగ్గుల కాలిఫ్లవర్ అయ్యి, స్మశానంలో డ్యూయాట్ వేసుకోడానికి అర్జెంటుగా స్కూటీ తాళాలు తీసుకొని బైల్దేరింది ..
"అయితే పి.ఎం అని కూడా చూడకుండా నానామాటలు అంటావా?" దెబ్బతిన్నట్లుగా మొహం పెట్టాడు పి.యం..
"సారీ...నేనిలా మాట్లాడకూడదు....కంప్యూటర్ కొడకా, గుడ్డలూడదీసి అమ్మాయిల కాబిన్ ముందు నిల్చోబెడతా..."
"రేయ్...నిన్నూ ..." పి.యం గాడి బీపీ 3,30,300/2,200 దాటింది ...
"మూస్కోరా కుయ్యా...నీ మేనేజర్ పోస్ట్ కి వంద రూల్స్ ఉండొచ్చు అవి నీ కాబిన్ లో , కానీ ఈ కాంపౌండ్ లో ఒకటే రూల్...నేను మాట్లాడాలి నువ్వినాలి ... వన్ వే ట్రాఫిక్ ...వినూ... నీ మీద జొల్లు పడితే నీకేక్కడో కాలుద్దేమో, నా కంప్యూటర్ లోకి తొంగి కోడింగ్ చూస్తే నాకిక్కడ కాలుద్ది (మోకాలిపై వేలు పెట్టి చూపిస్తూ ..)...ఇక్కడా గానీ కాలిందనుకో (కింది పెదవిని పంటితో బిగిస్తూ ..)..నేను వాగేటప్పుడే సొంత బ్రెయిన్ వాడుతా, కోడింగ్ చేసేటప్పుడు అస్సలు వాడను...ఎటు పక్కకి మొదలెట్టి ఎటు పక్కకి తీసుకెళ్తానొ...నాకే తెలిదు...దబిడి దిబిడే.... ప్రోగ్రామర్, మేనేజర్, సి.ఈ.ఓ , క్లయింట్ (తల్లీ తండ్రి గురువు దైవం టైపులో) అంటారు...మేనేజర్ గా నువ్వు ఫెయిల్, ప్రోగ్రామర్ గా నేను చేస్తున్నా...  నీకు నీ పి.యం పోస్టే కావాలో దాని జ్ఞాపకాలే కావాలో డిసైడ్ చేసుకొని నాకు చెప్పు.....ఫో ...." సింహం గర్జించడం ఆగింది ... అక్కడ కొంత సేపు నిశ్శబ్దం...తరువాత (షాక్ నుంచి తేరుకున్నాక ...) బల్ల మీద దరువేస్తూ సింహాన్ని అభినందించారు..

ఆ అవమాన భారం భరించలేక పి.యం వెళ్లి సెక్యురిటీ గార్డ్ బూట్లు రెండు నిముషాలు అరువడిగి, వాటితో ఎడా పెడా చెంపల్ని వాయించుకొని...ఇంటికెళ్ళి టాం అండ్ జెర్రీ చూస్తూ తీవ్రంగా ఆలోచించగా ఒక ఆలోచన మెరిసింది .... తరువాత రోజు వెళ్లి సింహ గురుంచి CEO కి కంప్లైంట్ చేసాడు పి.యం...

తరువాత  కొద్దిసేపట్లో సింహ CEO ముందు కుర్చోని ఉన్నాడు ... కాలు మీద కాలేస్కోని కుడి అరచేతిని వేళ్ళతో నలుపుకుంటూ వేళ్ళ వైపు చూసుకుంటూ ఉన్నాడు ..
"ప్రోగ్రామర్ అయ్యుండి మీరిలా చేయ్యడమేంటి..." అడిగాడు CEO..
"ఒక ప్రోగ్రామర్ గా ప్రోగ్రామ్ లో బగ్గులు లేకుండా చూసిచూడనట్లు పొమ్మని టెస్టర్లకు చెబుతాను...అలాగే ఒక యంప్లాయిగా పి.ఎం లాంటి పదోన్మాదులను ఎండగడతాను.."
"అతనేమన్నా తప్పు చేస్తే మాకు చెప్పు... CEOగా నేనున్నానుగా .."
"CEO నా....ఉన్నారా?...ఎక్కడ ?" ...CEO నీళ్ళ బదులు టై నమిలాడు ....
"వంద మంది కలిసి వంద రోజులు శ్రమించి పాలిండ్రోమ్ ప్రోగ్రాం రాసి క్లైంట్ కిస్తే, ఆడు వాళ్ళందరిని ఆంగ్లంలో అమ్మనాబూతులు తిట్టినప్పుడు....No CEO .... రోజుకి ఎనిమిది పనిగంటల్లో పద్దెనిమిది నిముషాలు కష్టపడి పనిచేసిన వాళ్ళకి అయిదుకి రెండు రేటింగ్ ఇచ్చినప్పుడు...No CEO ....ఆర్కుట్, ఫేస్బుక్, యాహూ లాంటి సైట్లు బ్లాక్ చేసి ఏంతో మంది ప్రేమికుల కన్నీళ్లకు కారణమైనప్పుడు ....No CEO .... రెస్ట్ రూముల్లో తుడుచుకోడానికి సానిటరీ పేపర్లుండగా ఇంకా నీళ్ళెందుకని వాటర్ సరఫరా కాస్ట్ కట్టింగ్ అని కట్ చేసినప్పుడు....No CEO ..... వార్షిక స్టార్ అవార్డ్స్ లో గత రెండేళ్ళగా బెంచి మీద కూర్చొని రోజుకి ఎనిమిది గంటలు క్యారమ్స్,టేబుల్ టెన్నిస్ తదితర ఆటలు ఆడి తన ప్రతిభ చూపించిన నా స్నేహితుడుకి మొండి చెయ్యి చూపించినప్పుడు....నో....C.....E......O..... అలాంటిది ఇప్పుడొక కుయ్యా  పి.యం ని రెండు మాటలంటే నోరు లె..గు...స్తుం...దే  ..ఏం?? ....ఇప్పటిదాకా ఎలా అయితే NO CEOనో...ఇక మీదట కూడా No CEO  ... Program is made up of rules, but not Google..." సింహం కళ్ళల్లో మంటలు ... సింహం కంఠంలో ఉరుములు చూసిన CEO తను ఎందుకు ఇంకా బ్రతికి ఉన్నాడో... తనని షాజహాన్ మహాభారత యుద్ధంలో ఎందుకు ఓడించాలేదో...పశ్చిమ నైజీరియా పంటపొలాల్లో తను కట్టుకున్న గూటికి వెళ్లి నిదానంగా ఆలోచించుకోవాలి అని బైల్దేరాడు ....

CEO ని కలిసి డెస్క్ దెగ్గరికి వస్తున్న సింహాకి ఒక టెస్టర్ ఎదురయ్యాడు.. 
"నీ ప్రోగ్రాంలో నేను బగ్గులు పట్టాను...ఏం చేస్తావ్ భే...." అన్న టెస్టర్ వైపు చూసి "నీ లాంటి పిల్ల పాం-టాప్ గాళ్ళతో నేను మాట్లాడను .. వెళ్లి కంప్యూటర్ లో సోలిటైర్ ఆడుకో...ఫో ...." అంటూ చెయ్యి విదిలించాడు సింహం .... 
"ఛా...నువ్వేదో పెద్ద మెయిన్ ఫ్రేమ్ అన్నట్లు మాట్లాడుతున్నావ్ ... నా చేతులో నీ ప్రోగ్రాములన్నీ ఇకనుండి బలి .."
"గూగుల్ లో వెతికినా కనపడని సింటాక్స్ లతో ప్రోగ్రాం రాసి మొహాన కొట్టానంటే, దాన్ని అర్థం చేసుకొని డీ-బగ్ చెయ్యడానికి నీ తాతలు దిగి రావాలి .. అది ఒక ఆప్షన్ .. అలా కాదు అంటే, నీ ఆయువుపట్టు మీద ఒక్క పిడి గుద్దు గుద్దానంటే మెడికల్ టెస్టులు చేయించుకోడానికి నీ ఆస్తులు అమ్మినా సరిపోవు ....ఏ ఆప్షన్ కావలి ..చాయిస్ ఈజ్ యువర్స్ ..." అంటూ డెస్క్ లో కూర్చొని గాండ్రించింది సింహం ..సింహం అరుపులు తట్టుకోలేక అంతక ముందే రోజే జాయిన్ అయిన పిల్ల టెస్టర్ ఆలస్యం చెయ్యకుండా పేపర్లు పెట్టేసాడు .....

CEO పిచ్చి పట్టి పారిపోయాడని తెలిసి, పి.యం కూడా సైలెంట్ గా జంప్ అయ్యాడు... మెల్లిగా సింహం కంపెనీని హస్తగతం చేసుకొని "Simha Technology Services" గా పేరు మార్చి, అందులో చేరే ఔత్సాహిక ఇంజినీర్లకు రాత పరీక్ష నిర్వహించడం మొదలెట్టాడు ...అందులో కొన్ని ప్రశ్నలు :
-->  పి.యం ని ఎలా బెదరకొడతారు?
--> CEO కి పది నిముషాల్లో పిచ్చెక్కించడం ఎలా?
--> డవలప్పర్లు టెస్టర్లకు అసలైన "టెస్ట్" ఏంటో చూపించడం ఎలా?
--> అమ్మాయిలను కేవలం నీ నడకతో ఎలా చొంగ కార్పిస్తావు?
--> కేవలం కొన్ని నెలల్లో ఒక కంపెనీని ఎలా చేజిక్కించుకుంటావు?
--> ఎలాంటి ప్రోగ్రాం అయినా.. గూగుల్ లో చూసి పది నిముషాల్లో చేసి క్లయింట్ మొహాన పడేయ గలికే సత్తా ఉందా? ఉంటే, ఎలాగో నిరూపించుము?

[సింహా చిత్రాన్ని ఆధారంగా చేసుకొని సరదాగా రాసింది మాత్రమె ...మీరు కూడా సరదాగానే తీసుకోండి ..సరేనా :)...సింహా చిత్రం చూసిన వాళ్ళు ఈ టపాతో బాగా కనెక్ట్ అవ్వగలరు ...మిగతావాళ్ళకి కొంచెం కాంఫ్యుజింగ్ గా ఉండొచ్చు ....- కిషన్ రెడ్డి ]

17 comments:

shankar said...

కేకో కేక. అయినా ఎంత మీరు బ్రహ్మి అయితే సింహ ని కూడా బ్రహ్మిని చేయడం ఏంటండి? ఇంకేదయినా ప్రొఫెషన్ పెట్టచ్చుగా. అలాకాదూ...

'వద్దు.. ప్రొఫెషన్ల గురించి మాట్లాడద్దు
ప్రొఫెషన్ అంటే మాది
కామెడి చెయ్యాలన్నా మేమే
ఖాళీగా కూర్చోవాలన్నా మేమే
మిగిలినవాళ్ళెంత బ్లడీ హార్డ్ వర్కర్స్' అంటారా సరే అలాక్కానీయండి!!!!

Anonymous said...

చాలా చాలా బాగుంది.

రాధిక said...

నేను బాగా కనక్ట్ అయ్యానండి.సినిమాలో కన్నా మీ డవిలాగులే మహ బాగున్నాయి.

కవిత said...

Cinema chusi matladatha meetho....

Shiva Bandaru said...

:) బాగుంది

శిశిర said...

:) బాగుంది.

నేస్తం said...

నేనూ చూడలేదు ఈ సినిమా... చూసే దైర్యమూ లేదు..అందుకే ఈ పోస్ట్ అర్ధం అయ్యే చాన్స్ లేదేమో నాకు :)

నిజం said...

బాగుంది

Ram Krish Reddy Kotla said...

శంకర్: మీరు మా ప్రొఫెషన్ ని తిట్టారా? పోగిడారా?...ఎదోకటిలెండి... పోస్ట్ మీకు నచ్చినందుకు థాంక్స్

అను: థాంక్స్

రాధిక: మీరు అంత బాగా కనెక్ట్ అయినందుకు ధన్యవాదాలు :-)

కవిత : అలాగేనండి

Ram Krish Reddy Kotla said...

శివ : థాంక్స్ సర్

శిశిర : ధన్యవాదాలు

నేస్తం: అదికూడా నిజమే :-)

నిజం : థాంక్స్ :-)

sivaprasad said...

సింహం కంఠంలో ఉరుములు చూసిన CEO తను ఎందుకు ఇంకా బ్రతికి ఉన్నాడో... తనని షాజహాన్ మహాభారత యుద్ధంలో ఎందుకు ఓడించాలేదో...పశ్చిమ నైజీరియా పంటపొలాల్లో తను కట్టుకున్న గూటికి వెళ్లి నిదానంగా ఆలోచించుకోవాలి అని బైల్దేరాడు ....

Sai Praveen said...

నేను సినిమా చూడకపోయినా బాలకృష్ణ సినిమాల స్టైల్ తెలుసు కాబట్టి ఎంతో కొంత అర్ధం అయిపొయింది :)
బాగుంది. కొన్ని డైలాగ్స్ చాలా బావున్నాయి.

Ram Krish Reddy Kotla said...

Thank you sai praveen :)

Rishi said...

How I missed it?Nice post

Ram Krish Reddy Kotla said...

Thank you Rishi :-)

Muralidhar Reddy said...

Too Good, first time mee blog chudatam, gr8 posts

Anonymous said...

very nice...full happy