Wednesday, June 9, 2010

ఉరకలై గోదావరి...ఉరికె నా వడిలోనికి....


సర్కార్ ఎక్సుప్రెస్ రాజమండ్రి స్టేషన్ లో ఆగింది...
అప్పటిదాకా హడావిడిగా స్టేషన్ లో అటూ ఇటూ పరుగులెడుతున్న ప్రయాణికులు...
ఆకాశంలో ఎగురుతున్న పక్షులు..
అప్పుడే  ఇంకో ప్లాటుఫారంకి రాబోతున్న ట్రైన్...
అన్నీ...సమస్తమూ...ఆక్షణమే...అక్కడే...తుపాకితో హాండ్సప్ అన్నప్పుడు ఫ్రీజ్ అయినట్లు ఆగిపోయాయి..కాలం స్థంబించింది...అంటే దేవుడు పాజ్ బట్టన్ నోక్కాడన్నమాట...

అప్పుడే..సర్కార్ ఎక్సుప్రెస్ స్లీపర్ బోగీ నుండి రాజమండ్రి  స్టేషన్ లో బూటు మోపాడు బ్యాగ్గుతో మన హీరో...ఒక్కసారిగా వీచిన గాలికి అతని క్రాఫ్ లయబద్ధంగా కదులుతుండగా..కూలింగ్ గ్లాస్ తీసి పెట్టుకున్నాడు ...అంతే.. మళ్లీ దేవుడు ప్లే బట్టన్ నొక్కాడు ....హీరో ఎంట్రన్స్ ని స్పెషల్ గా చూపించడానికి దేవుడు చూపిన దర్సకత్వ ప్రతిభ అన్నమాట అది...

                                                             ***
"ఎక్కడికి ?"
"గోదావరి ఇంజనీరింగ్ కాలేజీ...ఎంత? "
"కాలేజీనా  ??!!.."
"కాదు ఆటోకి..."
"లక్షన్నర అయింది దాదాపు...టాక్సుతో కలిపి....."
"తింగరి తింగరిగా ఉందా...ఇప్పుడే నెల్లూరు నుంచి దిగా...నాతో పెట్టుకోకు ...కాలేజీ దాకా రావడానికి ఆటోకి ఎంత?"
"నలభై అయిదు..."
"ఏంటి ఊరికి కొత్తని నీ ఇష్టం వచ్చినంత చెప్తే ఓ.కే అంటాననుకున్నావా? ....నలభై రెండు రూపాయలకి పైసా కూడా ఎక్కువివ్వను..."
"సరే...ఎక్కండి..మీరు మరీ అంత గీసి గీసి బేరం ఆడితే నాలాటి ఆటోగాళ్ళు ఎట్టా బతకాలి సారూ ..."
హీరో ఎక్కాడు... ఎక్కేప్పుడు చుట్టూ చూసి కాలరెగరేసి కూర్చున్నాడు ...
"మీది నెల్లూరా సారూ ..."
"అవును..."
"అచ్చా... ఇంత దూరం ఇంజనీరింగ్ కాలేజీ సూడ్డానికి వచ్చారా.."
"ఏంటి తిక్క తిక్కగా ఉందా...చదువుకోడానికి వచ్చాను ..." 
ఆటో కోటిపల్లి బస్సుస్టాండ్ దాటి...చర్చిగాటు దాటి అలా వెళ్తూ..వెళ్తూ...ఒక భవనం ముందు ఆగింది ...
హీరో ఆటో వాడి వైపు చూశాడు...ఏంటి ఆపావు అన్నట్లు..."ఇదే కాలేజీ ..." అని ఓ బిల్డింగ్ వైపు చూపించాడు ...
హీరో ఆటోలోంచి బైటకి తొంగి చూశాడు ... "శ్రీనివాసా హార్డువేర్ సప్లయర్స్" దాని పక్కన "వాసవీ కిరానా & జనరల్ స్టోర్స్" ఆ తర్వాత "పంకజం మ్యారేజ్ బ్యూరో"...

హీరో లక్ష సెంటీగ్రేడుల తీక్షణతతో ఆటోగాడి వైపు చూసి "ఏరోయ్... నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నా...మాది నెల్లూరని తెలిసీ నువ్వు తెగ కిండలు పడతాండావే..నాకు గానీ తిక్కరేగిందనుకో..." అన్నాడు..
"నేనేటి చేశాను బాబూ...ఇదే గోదావరి ఇంజనీరింగ్ కాలేజీ ..."
"మ....ళ్ళీ...అదే మాట... షాపింగ్ కాంప్లెక్స్ పట్టుకొని కాలేజీ అంటావెంట్రా బాబూ... సిల్కుస్మితని చూపించి సౌందర్య అని నొక్కివోక్కాణించినా నమ్ముతానేమో గాని...ఇది కాలేజీ అంటే నమ్మను "
"ఓ పాలి కనుక్కోండి...నేను ఓ పాలి వొచ్చినప్పుడు ఇక్కడే ఉంది కాలేజీ..."
హీరోకి చిర్రెత్తి చేసేదేమీలేక, మిగతా రెండు షాపులు మూసేసి ఉండటం చేత...పంకజం మ్యారేజ్ బ్యూరోకి వెళ్లాడు విషయం కనుక్కుందామని..

"ఎక్సుక్యుజ్ మీ..." అన్నాడు రిసెప్షనిస్ట్ దెగ్గర
"చెప్పండి..." అంది... అబ్బో రిసెప్షనిస్ట్ సూపర్ ఉంది...
"అదీ...ఇక్కడ..." అంటూ హీరో చెప్పబోతుండగా..
"ఈ ఫారం ఫిల్ చెయ్యండి ..." అంటూ ఓ ఫారం హీరోకిచ్చింది
అందులో - పేరు, ఊరు, రాశి, గోత్రం, నక్షత్రం, గ్రహం, గ్రహణం,మీ ఎత్తు, మీ బరువు, మీ పక్కంటి ఆవిడ బరువు, మీ ఎదురింటి అంకుల్ వయసు, మీ ఆవిడ తాగితే మీరు సంతోషిస్తారా? మీకు వంటలు బాగా వచ్చా?...- ఇక చూడలేక పోయాడు హీరో...'ఏంటి నీ ఉద్దేశం' అన్నట్లు ఓ లుక్కిచ్చాడు రిసెప్షనిస్టుకి.. 

"ఆ ఫారం ఫిల్ చేసి మీరు మాకిస్తే ఒక వారంలో మీకు తగ్గ జోడుని మేము గేలం వేసి పట్టుకుంటాం..." అందామె అరవై నలుగు పళ్ళూ బయట పెడుతూ...
"నేను నీ కళ్ళకి పెళ్లీడు వచ్చిన అంకుల్లా కనబడుతున్నానా... యంసెట్ లో రాంక్ కొట్టి, ఇంజనీరింగ్ సీటు పట్టి, రాజమండ్రిలో అడుగుపెట్టా...గోదావరి కాలేజీ ఎక్కడికెళ్ళింది?"
"దాని పుట్టింటికెళ్ళింది..."
హీరో కి మండింది...దీనికి కూడా తింగరితనం తక్కువేం లేదు ...
"ఎక్కడ దాని పుట్టిల్లు ?"
"ఎప్పటినుంచో రాజానగరంలో కడుతున్నారు బిల్డింగు...పూర్తయ్యి ఉంటది...ఇక్కడి జండా పీకి అక్కడ పాతారు ..." 
"ఎక్కడ ఆ రాజానగరం ..."
"ఓ పది కిలోమీటర్లు ఉంటుంది...తుని, ఏలేశ్వరం బస్సులు చాలానే ఉంటాయి అటేపు వెళ్ళేవి "
"థాంక్స్...." అంటూ వెళ్ళబోయిన హీరో, ఆమె వైపు తిరిగి "ఆ ఫారంలో ప్రశ్నలు తయారు చేసిందెవరు ?" అన్నాడు 
"మా మేడం ..."
"అంటే..లేడినే కదా..."
                                                        ***
"నన్ను బస్సుస్టాండులో దింపు..." అన్నాడు హీరో ఆటోలో బ్యాగ్ విసిరేస్తూ
"ఏటైంది బాబు..."

"కాలేజీని ఇక్కడ నుంచి రాజానగరం అనే ఊరికి షిఫ్ట్ చేశారట..."
"అట్టాగా...అయితే నే చెప్పినట్లు కాలేజీ ఇంతకముందు ఇక్కడే ఉండేది అని ఒప్పుకుంటారా?"
"ఒప్పుకుంటాను మహాప్రభు...నన్ను బస్సు స్టాండులో దింపి పుణ్యంకట్టుకో...." 
ఆటో వాడు బస్సుస్టాండ్ లో దింపి యాభై రూపాయలు ఇవ్వకపోతే వచ్చే బస్సు క్రింద తలపెట్టేస్తా అని భయపెట్టడంతో...వాడిని బ్రతిమిలాడి..గీసి గీసి...నలభై తొమ్మిది రూపాయల యాభై పైసలు ఇచ్చాడు హీరో...ఆటోవాడికి వాడి మీద వాడికే విరక్తి వచ్చి ఎర్రోడిలా ముఖం పెట్టి... ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు ...

బస్సు ఎక్కి కూర్చున్నాడు హీరో...
"టికెట్..." అంటూ హీరో దెగ్గరికి వచ్చాడు కండక్టర్ ..
హీరోకి సడన్ గా ఆ ఊరి పేరు గుర్తురాలేదు...  సిరిసిల్ల, జగిత్యాల, చిన్నమెట్టపల్లి, లత్తునూరు, ముత్తునూరు, తంగిటపురము...అంటూ ఆర్.నారాయణ మూర్తి పాటలా ఎక్కడెక్కడో ఊరి పేర్లన్నీగుర్తొస్తున్నాయి...కానీ కాలేజీ ఉన్న ఊరి పేరు మాత్రం గుర్తురావట్లేదు...పిడికిలి బిగించి నుదిటి మీద గుద్దుకుంటున్నాడు..అబ్బే లాభం లేదు...అసలు ఇంజనీరింగ్ కాలేజీ అని చెప్పినా కండక్టరుకి అర్థం అవుద్దేమో...కానీ అంత తెలివి ఉంటే వాడు మన సూపర్ మెగా హీరో ఎందుకు అవుతాడు...

"ఏం బాబూ ఎక్కడికి టికెట్ " రెట్టించాడు కండక్టర్
"అదీ...అదీ...ఆ ఊరు...." థూ ఎదవ జీవితం సరిగ్గా కండక్టరు ముందు దొరికిపోయానేంటిరా దేవుడా..అని హీరో మధనపడుతుండగా...
"టీ-చొక్కా ..జీన్సు పాంటు...పైగా చలికాలం కూలింగు గ్లాసు...టికెట్టుకి మాత్రం డబ్బులు ఉండవు.." అన్నాడు కండక్టరు...లాగి లెంపకాయ ఇస్తే వచ్చే రియాక్షన్ వచ్చింది హీరోలో... భర్త అర్థం చేసుకోకుండా అనుమానిస్తే భార్య ముఖంలో కనిపించే రోషం కనిపించింది హీరోలో...వెంటనే పర్స్ తీసి అందులో ఉన్న వెయ్యి నూట పదహార్లు చూపించాడు కండక్టరుకి..
"అంతడబ్బు మాకవసరం లేదు ...టిక్కేట్టుకి సరిపడా ఇస్తే చాలు.."
"అదీ..కండక్టరు గారు." అంటూ హీరో లేచి కండక్టరు చెవి దెగ్గర "ఆ ఊరి పేరు మర్చిపోయానండి...గుర్తురావట్లా" అంటూ ఊదాడు...
"మా బాబే...ఊరి పేరు మర్చిపోయావా... కనీసం మీ ఊరి పేరైనా గుర్తుందా..." అంటూ ఆ బస్సే కాదు పక్కన ఉన్న పది బస్సులకి వినిపించేట్టు అరిచాడు ... హీరో సీట్ కి రెండు సీట్ల ముందు ఉన్న అమ్మాయిలు గలగలా నవ్వారు...హీరో కి గొప్ప అవమానం జరిగిపోయింది... ఛా ఇక నా ముఖం పెట్టుకొని ఈ బస్సులో ప్రయాణం చెయ్యలేను అని హీరో దిగబోయి ఆగాడు....అక్కడ కూర్చున్న అమ్మాయిలు స్టూడెంట్స్ లా ఉండటంతో .. కొంచెం అందంగా ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని "ఎక్సుక్యుస్ మీ...మీరు ఏ కాలేజీ.." అన్నాడు...పక్కనున్న అమ్మాయి "మమ్మీ ..." అని అరిచింది...ఈ పిల్ల "నా చర్మం వయసుని అసలు తెలియనివ్వదు.." అంది... హీరో పరమ దరిద్రంగా చూశాడు వాళ్ళ వైపు...వాళ్ళు అంత కంటే దరిద్రంగా ఫక్కున నవ్వారు... హీరోకి అవమానం మీద అవమానం..ప్రొద్దుటి నుంచి ఎవడు పడితే ఆడు ఆడేసుకుంటున్నాడు ఎదవ జీవితం ..అంటూ బస్సు దిగేశాడు...

దిగి ప్లాట్ఫారం మీద కూర్చొని గోళ్ళు గిల్లుకుంటూ ఆ ఊరు పేరు ఏంటా అన్న ఆలోచనలో పడ్డాడు హీరో...ఇంతలో ఆ బస్సు కదిలింది...మెల్లిగా అది ప్లాట్ఫారం నుంచి బైల్దేరుతుండగా చూశాడు ఆ బస్సు ముందు పెట్టిన తుని బోర్డు ప్రక్కన చిన్న అక్షరాలతో రాసిన "వయా రాజానగరం, అన్నవరం" అక్షరాలని.. హీరో కి ఫ్లడ్ లైట్ వెలిగింది...రాజానగరం...ఎస్ అదే...ఇక లగేత్తాడు..."ఆపండ్రోయ్....ఆపండ్రోయ్...ఆపండ్రోయ్" అంటూ ....

                                                      ****
హీరో కాలేజీకి చేరాడు...ఆ భవన కట్టడం ఇంకా పూర్తి కానట్లు ఉంది...ఒక సైడ్ పూర్తి అవ్వడం వల్ల అక్కడ క్లాసెస్ మోదలేట్టినట్లు ఉన్నారు...కౌన్సిలింగుకి వెళ్ళినప్పుడు ఈ కాలేజీ ఏదో ఇంద్రభవనంలా చూపించారు ఒక పుస్తకంలో..పాపం నిజమే అనుకొని ఏరి కోరి ఆ కాలేజీలోనే జాయిన్ అయ్యాడు హీరో...కానీ అది అప్పుడు ఓ కాలేజీలా కాకుండా ఓ భూత్ బంగాళాలా ఉంది..

హీరో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కి వెళ్లి ఫార్మాలిటీస్ పూర్తి చేసి...హాస్టల్ ఫీజు కట్టి..
"హాస్టల్ ఎక్కడుంది " అడిగాడు ఆమెని
"దానవాయిపేటలో .."
"అదెక్కడుంది ..."
"రాజమండ్రిలో ..."
"సరే.. అడ్రెస్స్ ఇవ్వండి..వెళ్లి రెస్టు తీసుకొని..రేపు ఫ్రెషుగా వస్తా..." అన్నాడు హీరో
"ఒక్కసారి కాలేజీలోకి ఎంటర్ అయిన స్టూడెంట్ మళ్ళీ బైటకి వెళ్ళేది రాత్రి పదింటికి స్టడీ అవర్స్ అయ్యాకే...సో మీరెళ్ళి క్లాసెస్ అటెండ్ అవ్వండి ..." అందామె చిద్విలాసంగా 
హీరోకి ఒక్క సారిగా గుండెలో వంద సునామీలు....వెయ్యి అగ్నిపర్వతాలు...లక్ష భూకంపాలు వచ్చాయి...అప్పటిదాకా ఇంటర్మీడియట్ లో రోజుకి ముప్పై నాలుగు గంటలు స్టడీ అవర్స్ తో మగ్గి మగ్గి మోడైన హీరో జీవితం, ఇంజనీరింగ్ లో అయినా ఓ వెలుగు వెలిగిద్దాం అనుకున్న ఆశలన్నీ అట్లాంటిక్ ఓషన్ లో కలిసిపోయాయి... దెబ్బతిన్నట్లు చూశాడు ఆమె వైపు ...
"ఇంజనీరింగ్ లో కూడా స్టడీ అవర్సా" అన్నాడు కూడతెచ్చుకున్న ధైర్యంతో
"అదే ఈ కాలేజీ స్పెషాలిటీ...మా రాజు గారు, ఎన్నో ఇంటర్మీడియట్ కాలేజీలు నడిపిన నైపుణ్యంతో ఈ ఇంజనీరింగ్ కాలేజీని కుడా ఆ రేంజ్ కి తగ్గకుండా నడిపిస్తున్నారు " అంది ...
ఆమె వైపు ఓ సారీ పిచ్చేక్కినట్లు చూసి ...బైటకి నడిచాడు హీరో ....

అలా బ్యాగ్ తగిలించుకొని నడుస్తున్నాడు హీరో ....అతనికి ఎదురుగా నడుచుకుంటూ వస్తుంది ఆ అమ్మాయి ... యధాలాపంగా అటు చూసిన హీరో కళ్ళు మిల మిల మిల మెరుస్తున్నాయి ఆ అమ్మాయిని చూసి...వైట్ చూడిదార్ మీద పువ్వుల ఎంబ్రాయిడరీ..ఆరంజ్ కాలర్ దుపట్టా... గాలికి ముఖం మీద పడుతున్న కురులని తన సుకుమారమైన చేతులతో సున్నితంగా సవరిస్తూ..విడివడకుండానే నవ్వులు పూయిస్తూ కిలోలు కిలోలు ముత్యాలు రాల్చే లేత గులాబీ రంగు పెదవులు ...ఎవరీ అద్భుతమైన లావణ్యవతి... ఏం జరుగుతుంది..ఆమే హీరో ముందు వచ్చి ఆగింది ...
"ఇక్కడ హాస్టల్ ఫీజు ఎక్కడ కట్టాలి" అంది 
"ఆ...అలా వెళ్లి రైట్ కి తిరగండి ..." అన్నాడు
"థాంక్స్..." అంటూ వెళ్ళబోయిన ఆమెను "మీది ...ఏ ఊరు " అని అడిగాడు హీరో 
"అమలాపురం " అంది ...
అమలాపురంలో ఇంత అందమైన అమ్మాయిలు ఉంటారా?..వావ్ ఇదంతా గోదావరి మహిమ... ఈ అమ్మాయి పుట్టిన కోనసీమ జన్మ తరించింది పో.... సడన్ గా హీరో కి ఆ కాలేజీ అంటే అభిమానం మొదలైంది..

"ఉరకలై గోదావరి ...ఉరికె నా వడిలోనికి ..." అంటూ అతని గుండె పాడింది నడిచి వెళ్తున్న ఆమెని చూసి ...
"సొగసులై బృందావని విరిసే నా సిగలోనికి ..." అంటూ ఆమె అతనివైపు తిరిగి పాడినట్లు ఊహించుకున్నాడు... 
"జత వెతుకు హృదయానికి శ్రుతి తెలిపె మురళీ ...."

ఇంతలో  అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నుండి ప్యూన్ పరిగెత్తుకుంటూ హీరో దెగ్గరికి వచ్చి "మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు " అన్నాడు ....
హీరో పిచ్చ హ్యాపీ అయిపోయి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లోపలికి వెళ్లాడు...ఆ అమ్మాయి అక్కడే ఉంది..ఏదో ఫారం ఫిల్ చేస్తుంది...హీరో ఆ అమ్మాయి వైపే చూసుకుంటూ మేడం దెగ్గరికి వెళ్ళబోయి ప్యూన్ దెగ్గరికి వెళ్ళాడు ..ప్యూన్ గాడు "మేడం అక్కడ ..." అన్నాడు ..
మాకు తెలుసులే అన్నట్లు ఫేసు పెట్టి హీరో మేడం దెగ్గరికి వెళ్లాడు 
"మీరు ఇందాక సైన్ చెయ్యడం మరచిపోయాడు ...ఇక్కడ సైన్ చెయ్యండి ..." అంది ...
హీరో సైన్ చేసి వెళ్లబోతుండగా...మేడం ఆ సైన్ చూసి "మీ పేరు ?" అంది హీరో ని ...
"రామకృష్ణా రెడ్డి ...."అని హీరో ఆ అమ్మాయినే చూసుకుంటూ బైటకి వెళ్లాడు .....

అతని గుండెలో మళ్ళీ అదే సాంగ్ "ఉరకలై గోదావరి ...ఉరికె నా వడిలోనికి ..." అంటూ ....

                     ------------కుదిరితే మళ్ళీ కలుద్దాం -  రామకృష్ణా రెడ్డి

21 comments:

నేస్తం said...

సూపర్ రాసారు కిషన్..నేరేషన్ చాలా బాగుంది .. చూస్తూ ఉండండి.. మీకు మీ నెల్లూరి అమ్మాయిలతో వీపు విమాణం మోతే ఏదో రోజున.. :)

స్ఫురిత said...

:)

Anonymous said...

continue

కవిత said...

ఇంజనీరింగ్ లో కూడా స్టడీ అవర్సా???ఛి ఛి...ఎంతటి అవమానం ......
ఆంద్ర లో పుట్టి,కోన సీమ అమ్మాయిలను పొగడతరా?నేను దిన్ని ఘన్డిస్తున్నాను....నేస్తం గారు చెప్పింది తొందరలో ఆక్షన్ లో కి రాబోతుంది.

Anonymous said...

ఎంతో అదృష్టం ఉంటేనే కాని గోదారి నీళ్ళు తాగడం, రాజమండ్రిలో చదవడం, కోనసీమ అమ్మాయిలని కలవడం జరగవండి. మీరు చాలా అదృష్టవంతులు. :) చాలా బాగా రాశారు. ఇదంతా స్వీయానుభవమే??? :)

Anonymous said...

Superb,Brilliant, what not !!!!!!!

Anonymous said...

మీ రచనాశైలి అద్భుతం! రాజమండ్రీ లో ఎలాఉంది? కోనసీమ అమ్మాయిలు కలుస్తున్నారా? గొదావరి గాలి తగిలినతరువాత మీ బ్లాగ్గులు ఇంకా అందంగా ఉంటాయి.

Ramakrishna Reddy Kotla said...

నేస్తం : థాంక్స్ :-)...ఇక పోతే నెల్లూరి అమ్మాయిలతో నాకు ఎందుకు మోగుతుంది?? ఒక పౌరిడిగా నా Right to speech నేనేక్కడైన ఉపయోగించుకుంటాను...

స్పురిత : :) :)

Anonymous: దీనికి కొనసాగింపు ఏమీ లేదండి...ఏదో నా ఇంజనీరింగ్ కాలేజీ చేరడానికి రాజమండ్రి వచ్చినప్పుడు నా పరిస్థితి చెప్పాను ...చూస్తా ఇంకా ఏమన్నా కొనసాగించాలో లేదో అను...అందుకే కుదిరితే మళ్ళీ కలుద్దాం అన్నాను.

Anonymous said...

That was an excellent screenplay. Superrr

Ramakrishna Reddy Kotla said...

కవిత : అవును మాకు ఇంజనీరింగ్ లో కూడా స్టడీ అవర్స్ పెట్టారు... మీరో ఒక విషయం మరచిపోతున్నారు కోనసీమ కూడా ఆంధ్ర లోనిదే... సో మీరు ఇక్కడ ఖండించడానికి ఏమీ లేదు :-)

Anonymous: నిజమే, ఏదో నాకా అదృష్టం పట్టిందప్పుడు...అవును ఇందంతా స్వీయానుభావమే

Ramakrishna Reddy Kotla said...

హరే ఫల: థాంక్స్ అండి..అది నేను ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు జరిగిన సంగతులు రాసాను, ఇపుడు నేను ఇంజనీరింగ్ అయిపోయి చెన్నై లో జాబ్ చేస్తున్నా.

Anonymous: Thanks a lot

పానీపూరి123 said...

స్టడీ అవర్స్ బాగా ఎంజాయ్ చేరారన్న మాట :-)

శివరంజని said...

నవ్వ లేక సచ్చాననుకోండి.చాలా చాలా బాగా రాసారు .multy talented person.
హీరో నా ? అబ్బా చా.... హీరో హీరో అని అన్ని కామెడీ ఏక్షన్సే చేసి బాలకృష్ణ పరువు తీసేసారు కదా రామకృష్ణా ..........
ఆ సినిమా లో ఇంకో పాట ఉంది ....నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ప్రెండ్..ఆ పాట కి డ్రీం వేసుకోకుండా ముగించేసారేమిటీ స్టొరీ
@నేస్తం&కవిత గారు: కిషెన్ గారికి నెల్లూరి అమ్మాయిలతో వీపు విమాణం మోత రోజున మనం కూడా ఆ అమ్మాయిలకి చేతనైనంతా సాయం చేద్దామే?ఏమంటావు?

శివరంజని said...

నవ్వ లేక సచ్చాననుకోండి.చాలా చాలా బాగా రాసారు .multy talented person.
హీరో నా ? అబ్బా చా.... హీరో హీరో అని అన్ని కామెడీ ఏక్షన్సే చేసి బాలకృష్ణ పరువు తీసేసారు కదా రామకృష్ణా ..........
ఆ సినిమా లో ఇంకో పాట ఉంది ....నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ప్రెండ్..ఆ పాట కి డ్రీం వేసుకోకుండా ముగించేసారేమిటీ స్టొరీ
@నేస్తం&కవిత గారు: కిషెన్ గారికి నెల్లూరి అమ్మాయిలతో వీపు విమాణం మోత రోజున మనం కూడా ఆ అమ్మాయిలకి చేతనైనంతా సాయం చేద్దామే?ఏమంటావు?

Ramakrishna Reddy Kotla said...

పానీపూరి123 : అబ్బో చాలా బాగా ఎంజాయ్ చేసానండీ స్టడీ అవర్స్... ఎంత బాగా అంటే వర్ణించలేను...

రంజని : ఆ డ్రీం వేసుకోడానికి లెండి తరువాత ... :-)... మీకు తెలీద హీరో అంటే నాలాగే ఉంటాడు, అందుకే హీరో అని మొదలెట్టా స్టోరీని... నేస్తం,కవిత సరిపోతారా?..పది మందిని తెచ్చుకోండి..పదికి పది పెంచుకుంటూ తెచ్చుకోండి...ఒక్కడినే వస్తా..ఆ తరువాత మీరందరూ వచ్చాకా పీ.టీ.ఉష ని గుర్తుతెచ్చుకుంటా ఏమనుకున్నారో ;)

Vinay Chakravarthi.Gogineni said...

madhylo konni chotla (max 2 or 3 times)tappa ....excellent narration......

sujatha gaari(firstlo vunnantha skills ippudu anipinchatamledu anuko)and jaji poolu and eti gattu blogs narration level ki vellipoyav boss.........

lastlo ending is not that much gud....

Ramakrishna Reddy Kotla said...

Vinay: Thanks a lot for your comment. And coming to Narration level, there is no specified level or bench-mark here and everyone has their own way of presenting the topic.

పరిమళం said...

మొత్తానికి మా గోదావరి అమ్మలూ ...అమ్మాయిలూ కూడా అందంగా ఉంటారని మీకు మొదటిరోజే అర్ధమైపోయిందన్న మాట :) మరి ఇప్పుడు చెన్నై ఎలాఉందో అది కూడా ఓటపా రాసెయ్యండి మరి !

Ramakrishna Reddy Kotla said...

పరిమళం గారు, చెన్నై లో ఎలా ఉందో ...చెన్నై లో నా మజిలీ ఎలా మొదలయ్యిందో..చెన్నై మీద నా అభిప్రాయాలు ఏమిటో మొత్తం ఎప్పుడో ఓ టపాగా వ్రాసాను నా "ఆకాశవీధిలో" బ్లాగ్ లో ... :)

వీరుభొట్ల వెంకట గణేష్ said...

Still are you in Chennai?

Ramakrishna Reddy Kotla said...

అవును గణేష్ గారు, నేను ఇంకా చెన్నైలోనే ఉన్నాను :(