Sunday, May 30, 2010

నా సూట్ కేస్ పోయింది....

1999
ఇంటర్మీడియట్ హోమ్ సిక్ సెలవలని ఇంటికి బైల్దేరాను రైల్లో...
రైలు విశాఖపట్నం దాటి గోపాలపట్నం స్టేషన్ దెగ్గర క్రాసింగ్ కోసం ఆగింది...
అక్కడ ఒకతను ఎక్కి నా ముందు సీట్లో కూర్చున్నాడు...యాభై దాకా ఉంటాయి అతనికి..
"ఏ ఊరెళ్ళాలి బాబు?.." అడిగాడు అతను నన్ను..
"రాజాం.."
"రాజాంలో రైల్వే స్టేషన్ లేదే..."
అతని వైపు ఒక్కసారి సీరియస్ గా చూసి "తెలుసు...అందుకే చీపురుపల్లిలో దిగి, అక్కడనుంచి బస్సుకి వెళ్తాను.."
"అలాగా...పెళ్ళైందా ??"
'ఒర్నీ...పాలబుగ్గల పసివాడని పట్టుకొని పెళ్ళైందా అని అడుగుతావా??..చిత్తూరులో చిత్తు కాగితాలు ఏరుకొనే మొహమూ నువ్వూనూ' ..."నేను......ఇంటర్మీడియట్" అని కోపంగా చెప్పి కళ్ళు మూసుకున్నాను, ఇంక నాకు మాట్లాడటం ఇష్టం లేదని సింబాలిక్ గా చెప్పడానికి...
"మీ నాన్నగారు ఏం చేస్తుంటారు ?" అడిగాడు మహానుభావుడు...
'కళ్ళు మూసుకొని ఉంటే కనిపించట్లేదారా....కాఫీలో కారప్పొడి కలుపుకొని తాగే గుడ్డి వెధవా..' అనుకొని సైలెంట్ గా ఉన్నాను...
"ఇదిగో బాబూ నిన్నే.." అని తట్టి మరీ లేపాడు, అక్కడికి ఆడికి నేను ఆన్సర్ ఇవ్వకపోతే చస్తాడేమో అన్నట్లు...
"నాకు నిద్రోస్తుందండీ .." విసుగ్గా చెప్పి మళ్లీ కళ్ళుమూసుకున్నా...ఈ సారీ ఏమనుకున్నాడో, ఇంక మాట్లాడలేదు...
కాసేపు చిన్న కునుకు తీసాక మళ్లీ కళ్ళు తెరిచాను...ఎదురుగా కూర్చున్న వ్యక్తి లేడు..కింద నా సూట్ కేసు కూడా లేదు...
"నా సూట్ కేస్ పోయింది...." అరిచాను అప్రయత్నంగా...
"అతను తీసుకెళ్ళిన సూట్ కేస్ నీదా?" నోరెళ్ళబెట్టింది మిడిల్ బెర్త్ సిలిండర్ ఆంటీ...
"అతను ఇప్పుడే అటువైపుగా వెళ్లాడు...తొందరగా వెళ్ళు దొరకొచ్చు..." అరిచాడు అప్పర్ బెర్త్ ఉప్పర సోది అంకుల్...

నాలో నిద్రపోతున్న బాలకృష్ణ లేచాడు..ఒక ఉదుటున దూకి పరిగెత్తాను...కంపార్టుమెంటులు దాటుకుంటూ పరిగెత్తుతూ ఉన్నాను...ఒక కంపార్టుమెంటులో నా సూట్ కేస్ పట్టుకొని తాపీగా నడుస్తూ కనిపించాడు ఆ ద్రోహి...నాలోని సమరసింహారెడ్డి సై అనడంతో వెళ్లి వాడిని వెనుకగుండా నడ్డి మీద తన్నాను..వాడు ముందుకు బోళ్ళా పడ్డాడు...అక్కడ ఉన్నవాళ్ళు క్రిందపడిన వాడి మీద సానుభూతి(?) చూపించి, నా వైపు ఎర్రగా చూసారు...నేను నా సూట్ కేస్ చూపించి.."ఇది నాది...కొట్టేసాడు వీడు..." అని రెండే ముక్కలు చెప్పి వెనక్కి మళ్ళాను - ఇక్కడ మీరు బ్యాక్ గ్రౌండ్ లో "బాషా ...బాషా..." అని కానీ "ఇంద్రా ...ఇంద్రా..." అని కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోడానికి ఏమాత్రం మొహమాట పడవద్దు....

నేను మళ్లీ నా సూట్ కేస్ తో వచ్చి నా సీట్ లో కూర్చున్నాను...
"కుర్రాడు అసాధ్యుడే...సూట్ కేస్ తెచ్చేసుకున్నాడు..." ఆరాధనాపూర్వకంగా చూసింది సిలిండర్ ఆంటీ..
'అయితే ఏంటి...కొంపదీసి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేస్తారా ?'అనుకున్నా మనసులో....చిన్నగా నవ్వాను ఆమెను చూసి...
"మమ్మీ...టాయిలెట్ లో వాటర్ రావట్లా..." కుయ్యి మంటూ వచ్చింది సిలిండర్ అంటీ కూతురు...మిస్ మినీసిలిండర్..
"ఏమండోయ్ విన్నారా ఈ చోద్యం...టాయిలెట్ లో వాటర్ రావట్లేదట..." కేకపెట్టింది సిలిండర్ ఆంటీ అప్పర్ బెర్త్ ఉప్పర సోది అంకుల్ కి వినబడేలా ..
"ఏం చేయ్యమంటావే...నీదొక గోల..ఇప్పుడు టాయిలెట్ కి వెళ్ళకపోతే కొంపలేమీ మునగవు.." అని విసుక్కుంటూ .."ఆ... ఏం మాట్లాడుకుంటున్నాం మాష్టారూ...ఆ ఈ ఏడు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి ఏవిటో.." అంటూ ప్రక్కనే ఉన్న బక్కపలుచని బట్టతల అంకుల్ తో ఉప్పర సోది కొనసాగించాడు...
"మమ్మీ ...అర్జెంట్..." మళ్లీ కుయ్యి కుయ్యి మంది ఆ పిల్ల...
"రాత్రి నుంచి అడ్డమైన గడ్డి తినొద్దంటే విన్నావా??..వచ్చిన ప్రతి స్టేషన్ లో శత్రు సైన్యాల మీద దండెత్తినట్టు,ఆ వెండార్ల మీద దండయాత్రలు చేసి...ఇప్పుడేమో టాయిలెట్ చుట్టూ ప్రదక్షిణాలు...నిన్నెవడు చేసుకుంటాడో కానీ అష్ట దరిద్రాలు చుట్టుకొని ముష్టి వెధవ అవ్వడం ఖాయం .." అందామె విసుక్కుంటూ 
'అబ్బో...తల్లి పోలికలే అచ్చం...ఎంత గొప్పగా పెంచుతున్నారో ..' అనుకున్నాను ...ఇంతలో సిలిండర్ ఆంటీ "బాబూ ...." అంటూ నా వైపు చూసింది 
ఏమిటన్నట్లు ఆమె వైపు చూసాను...ఆమె నేను ఇందాక వైజాగ్ లో కొన్న బిస్లరీ మినరల్ వాటర్ బాటిల్ వైపు చూస్తుంది ...నా ఎడమ కన్ను అదిరింది ...మనసేదో కీడు శంకిస్తుంది..
అది నిజం చేస్త్తూ ఆమె .."ఏం లేదు బాబూ...పాపకి స్టమక్ అప్సెట్ ..పాపం టాయిలెట్ కి వెళ్ళాలట..అక్కడ నీళ్ళు రావట్లేదు..మా దెగ్గర బాటిల్ లో నీళ్ళు అయిపోయాయి...కొంచెం ఆ బాటిల్ పాపకి ఇవ్వగలవా .." అందామె ..
నా దిమ్మ తిరిగి...మైండ్ బ్లాక్ అయ్యి..రీస్టార్ట్ అయ్యి...కొయ్యబారి ఆమె వైపే పిచ్చోడిలా చూసాను ..' ఛీ ఇంత బతుకూ బతికి...ఈ పిల్ల సిలిండర్ టాయిలెట్ కోసం నేను కొన్న మినరల్ బాటిల్ ఇవ్వాలా...ఛీ నా బతుకు ...' అని నన్ను నేను పరమ దరిద్రంగా తిట్టుకుంటూ ...ఆ పిల్ల సిలిండర్ కి నా బిస్లరీ ని త్యాగం చేసాను ...పాపం బిస్లరీ బాటిల్ ని చూస్తే జాలేసింది...'బాసూ నా గొంతు కొస్తావా ఇలా..' అని పాపం బిస్లరీ వెక్కి వెక్కి ఏడుస్తుంది....బిస్లరీ బాటిల్ ఈ విధంగా కూడా ఉపయోగ పడుతుందని తెలిస్తే ఆ సంస్థ ఓనర్ ఆత్మాహత్యా చేసుకుంటాడేమో

*******************************************************************

2001 
బీ-టెక్ మొదటి సంవత్సరం...రాజమండ్రి ..
హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్ లో సీనియర్స్ జూనియర్స్ ని ర్యాగ్ చేస్తున్నారు...
జూనియర్స్ అందరిని వరసగా నిలుచోపెట్టారు....సెంట్రల్ జైల్లో ఖైదీల్లా..
మనోహర్ గాడు క్రూరంగా చూస్తున్నాడు అందరివైపు...
"బాగా బలిసిందిరా నాకొడకల్లారా మీ అందరికీ..." అన్నాడు మాణిక్ చంద్ నములుతూ..
"ఒరేయ్...నువ్విట్రారా.." పిలిచాడు నన్ను ..
నేను దెగ్గరికి వెళ్లి నిలుచున్నా వాడి ముందు చేతులు కట్టుకొని..
"నిన్ను పెద్దగా ర్యాగ్ చేసినట్లు నాకు గుర్తులేదురా....ఏ ఊర్రా మీది .." అడిగాడు 
"నెల్లూరు ..." చెప్పాను 
"నువ్వు నెల్లూరు అయితే నాకేంటి భే ..." అంటూ నా కాలర్ పట్టుకొని ముందుకి లాగాడు ....
సరిగ్గా అప్పుడే పోలీసు జీప్ వచ్చి మా హాస్టల్ ముందు ఆగింది...ఒక్కసారిగా సీనియర్ల ముఖాల్లో భయాందోళనలు...మనోహర్ గాడికి చెమటలతో షర్టు మొత్తం తడిచింది...వాడి వణికే చెయ్యి నా కాలర్ ని దానంతట అదే వదిలేసింది...వెళ్ళిపొండి వెళ్ళిపొండి అని సైగ చెయ్యడం మొదలెట్టారు మాకు ...ఈ లోపే పోలీసులు మా ఫ్లోర్ కి వచ్చారు...

"ఏం జరుగుతుందిక్కడ...ర్యాగింగా..." అడిగాడు ఒక కానిస్టేబుల్ ... సీనియర్లకు ఒక్కొక్కడికీ గండి కొట్టేసింది ఆ మాటతో ...
"రామకృష్ణా రెడ్డి .." పిలిచాడు ఒక కానిస్టేబుల్ ...
నేను వెళ్లాను ...ఒక కాగితం తీసి, ఇక్కడ సంతకం పెట్టమన్నాడు ఆ కానిస్టేబుల్ ...నేను పెట్టాను...వాళ్ళు వెళ్ళిపోయారు...సీనియర్లు కోయ్యబోమ్మల్లా అలాగే చూస్తుండిపోయారు నా వంక....

********మూడు రోజుల క్రితం ****************************

సెలవులు అయ్యాక ఇంటి నుండి కాలేజీ హాస్టల్ కి వచ్చిన నాకు, నోట్లో కాకినాడ కాజా పెట్టినంత తియ్యటి వార్త వినబడింది..
"నీ సూట్ కేస్ ఎవడో కొట్టేసాడు ..." అన్నాడు సీనియర్ నాగరాజు ..
వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి నేనుండే రూంలో చెక్ చేసుకున్నాను...నా సూట్ కేస్ లేదు...
వెళ్ళాడతీసుకొని కూర్చుంటే.."ప్రాబ్లెం ఏమీ లేదు..సూట్ కేస్ దొంగతనం చేసినవాడు దొరికాడు...మన హాస్టల్ ప్రక్కన ఉన్న సెంట్రల్ క్రైం స్టేషన్ లో ఉందట నీ సూట్ కేస్...మొన్నేవడో కానిస్టేబుల్ వచ్చి నీ వివరాలు అడిగాడు.." అన్నాడు నాగరాజు ..
"అవునా...అయితే వెళ్లి సూట్ కేస్ తెచ్చుకోవచ్చా .." అడిగాను ఆనందంగా..
"తెచ్చుకోవచ్చు..." అన్నాడు ...

నేను ఉన్నపళంగా క్రైం స్టేషన్ కి వెళ్లాను...అదే మొదటిసారి ఓ పోలీసు స్టేషన్ కి వెళ్ళడం ..
నన్నొక రెండు గంటలు వెయిట్ చేయించి లోపలి పిలిచాడు హెడ్ కానిస్టేబుల్ 
"నీ పేరు ..."
"రామ కృష్ణ ..."
"ఏ ఊరు...మీ పూర్తి అడ్రస్ చెప్పు "..
"xyz......lmnopqrstuvwxyz..."
"సరే...ఎఫ్.ఐ.ఆర్ రాశాను...ఇక్కడ సంతకం చెయ్యి ..."
నేను  సంతకం చేయ్యబోతుండగా..."ఒక్క నిముషం..." అన్నాడు 
నేను ఏమిటా అని తలెత్తి చూసాను ...
"ఎఫ్.ఐ.ఆర్ రాసి కేసు పెట్టి..అది కోర్టుకి కెళ్ళి..చివరికి నీ సూట్ కేస్ నీ చేతికి వచ్చేసరికి కొన్ని నెలలు పట్టొచ్చు...నీకు ఓ .కే నా ?" అడిగాడు 
"కొన్ని నెలలా??..కొన్ని రోజులు కూడా కష్టం సార్...అందులో నా పుస్తకాలు .. బట్టలు .. దిండు .. సబ్బు ..పౌడర్...మన్ను మశానం ...అన్నీ ఉన్నాయి సార్ .." అన్నాను శాడ్ ఫేస్ పెట్టి ...
"ఎఫ్.ఐ.ఆర్ రాస్తే తొందరగా రావడం కష్టం....ఇంకో పని చెయ్యొచ్చు ..."
"ఏమిటి సార్ ..."
"ఒక రెండు వేలు తెచ్చివ్వు....ఇప్పుడే పట్టుకుపోదువుగాని సూట్ కేస్ ..." అన్నాడు చిన్నగా
భారతీయుడు సినిమా చూసిన దెగ్గరి నుంచి ఇలా ఎవరు మాట్లాడినా నాకు తిక్క రేగుద్ది ...
"నా దెగ్గర అంత డబ్బు లేదు సార్ ...."
"పోనీ ఎంతుంది ?"
"అసలు డబ్బులెందుకు సార్ ..."
"ఓహ్ ...అలాగా...సరే ...ఇక్కడ సంతకం చెయ్యి ...నువ్వు బీ-టెక్ పూర్తిచేసేలోపు వస్తుందిలే నీ సూట్-కేస్.." అన్నాడు వ్యంగ్యంగా 

నేను సంతకం చేసి...వెళ్ళబోతూ సెల్ లో ఉన్న ఒక దొంగని చూసాను...అతనే నా సూట్ కేస్ కొట్టేసిందని చెప్పాడు ఓ కానిస్టేబుల్...వాడిని చూస్తే నాకు కోపం కాదు, జాలేసింది...ఎముకల గూడులా ఉన్నాడు..పాపం తిని ఎన్ని రోజులయిందో...అయినా నా సూట్ కేస్ కొడితే నీకేం వస్తుందిగా...పుస్తకాలు, సబ్బులు, రగ్గులు, మట్టి మశానం తప్ప... మా హాస్టల్ కి దొంగతనానికి వచ్చి మరీ, ఎంతో మంది బలిసిన నాకొడుకుల సూట్ కేస్ లు ఉండగా నా సూట్ కేస్ నువ్ కొట్టేసావంటే నీ సుడి సూపర్...నీ వీరోచిత చర్య ఇలా వృధాగా పోయినందుకు నీ మీద జాలేస్తుందిరా...అని అనాలనిపించింది...

ఆ రోజు రాత్రి ఇంటికి కాల్ చేసి చెప్పాను ఇలా సూట్ కేస్ పోయిందని..మా నాన్న రాజమండ్రిలో తనకి తెలిసిన ఫ్రెండ్ నంబెర్ ఇచ్చి అతనికి కాల్ చెయ్యమని చెప్పాడు...
నేను అతనికి కాల్ చేస్తే, నాన్న ముందే విషయం చెప్పినట్లున్నాడు, అతను తనకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాగా తెలుసని చెప్పి, నాకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంబెర్ ఇచ్చి వెళ్లి ఆయనని పర్సనల్ గా కలవమన్నాడు..

నేను ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంటికి వెళ్లి విషయం మొత్తం చెప్పగా, ఆయన నా ముందే క్రైం స్టేషన్ కి ఫోన్ చేసి ...
"బుద్దుందా మీకు కొంచెం అయినా...చదువుకొనే కుర్రాడి దెగ్గర కూడా లంచాల అడుగుతారా..." అని కొన్ని సెన్సార్ పదాలు వాడి వెంటనే సూట్ కేస్ తీసుకొని తన ఇంటికి రమ్మని చెప్పాడు ఆ కానిస్టేబుల్ తో...
పది నిముషాల్లో సూట్ కేస్ తో ప్రత్యక్షమయ్యాడు హెడ్ కానిస్టేబుల్...
వాడు నా వైపు దీనంగా చూసాడు...పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వాడిని ఇంకో నాలుగు తిట్టి...నా సూట్ కేస్ నాకిచ్చి నన్ను హాస్టల్ లో దింపమని చెప్పాడు ఆ కానిస్టేబుల్ కి ....

వాడు బైటకి వస్తూనే .."ఏంటి బాబూ ఇంత పని చేసారు...మా ఉద్యోగాలే ఊడిపోయేవి తెలుసా.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మీకు తెలుసని ఒక్క ముక్క చెపితే ఆ రోజే మీకు సూట్ కేస్ ఇచ్చేవాడిని కాదా... ప్రాసిక్యూటర్ గారు మా ఎస్పీతో ఈ విషయం చెపితే మా ఉద్యోగాలు ఉండవు..." అన్నాడు 
నన్ను హాస్టల్ దెగ్గర విడిచి వెళ్తూ "ఎలాగు నేను ఎఫ్.ఐ.ఆర్ రాశాను కాబట్టి అప్పుడప్పుడు వచ్చి మీ దెగ్గర సంతకం తీసుకుంటుంటాను..." అని చెప్పి వెళ్ళిపోయాడు 
సూట్  కేస్ వచ్చినా నాకెందుకో అంత హ్యాపీగా అనిపించలేదు....ఇలా నాకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా మాట సాయం అందింది కాబట్టి, ఈ రోజు నా సూట్ కేస్ నాకు తిరిగొచ్చింది...అదే నాకు ఎవరూ తెలియకపోతే నా పరిస్థితి ఏంటి?..అంటే పనులు జరగాలంటే ఎవడో పలుకుబడి ఉన్నవాడు ఒకడు తెలియాలి, లేకపోతే డబ్బులు సమర్పించుకోవాలి అనమాట...పోలీసు డిపార్టుమెంట్ అంటేనే చిరాకు కలిగింది నాకా క్షణాన...

విశేషం ఏమిటంటే, పైన చెప్పినట్లు ట్రైన్ల్ లో ఎవడో కొట్టేసిన సూట్ కేస్, బీ-టెక్ లో ఇంకెవడో కొట్టేసిన సూట్ కేస్ ఒకటే కావడం గమనార్హం...దట్స్ మై గ్రేట్ వి.ఐ.పీ సూట్ కేస్... మాంచి సుడి గల సూట్ కేస్.... ఇప్పటికీ ఉందా సూట్ కేస్ నా దెగ్గర :-)

********************* మూడు రోజుల తరువాత  ************

"నీకోసం పోలీసులు ఎందుకొచ్చారు...ఏదో సంతకం కూడా పెట్టించుకున్నారు??" కొంచెం బెదురు తగ్గాక అడిగాడు సీనియర్ మనోహర్...
"పోలీసులతో మాకు కొన్ని లింక్స్ ఉన్నాయి లెండి...ఆ భాగంగా ఈ సంతకాలూ వగైరా...మాది నెల్లూరు లెండి...మీకు అర్థం కాదు ... మీది నెల్లూరు అయితే నాకేంటి అన్నారుగా .." అన్నాను వెళ్ళిపోతూ....
ఆ తరువాతి రోజు నుంచి నాకు ర్యాగింగ్ లేదు ....


Best Regards ---------------------------- Kishen Reddy

30 comments:

Vinay Chakravarthi.Gogineni said...

baagund

సుభద్ర said...

కిషన్ ,
బ్లాగ్ చాలా బాగు౦ది..వాన మీద టపా మరీ బాగు౦ది...కాని అక్షరాలు కొన్ని చోట్ల పట్టి పట్టి చూడవల్సివస్తో౦ది..
1999 లో సూట్ కేస్ పోయిన ఎపిసోడ్ లో ఆ సిలె౦డర్ ఆ౦టీ నిజ౦గా కాబోయే అల్లుడ్ని అలా పొగిడి౦దా???లేక మీ కల్పన...చాలా సార్లు చదివా భలే రాశారు..

Rishi said...

అందుకే మరి వీ.ఐ.పీ "ధ్రుడమయినది" అనేది :)..సుభద్ర గారు ఏదో వాన టపా గురించి చెప్పారు,అదెక్కడుంది?ఇదే మీ మొదటి టపా కదా ఈ బ్లాగు లో?

చిన్ని said...

:-)

Raaga said...

Super & Hilarious. The way you narrated is pretty funny :)

Kishen Reddy said...

@ వినయ్ : థాంక్స్ మాస్టారూ :-)

@ సుభద్ర : థాంక్స్ అండి. మరే అచ్చ్ అలాగే పొగిడింది ఆమె కాబోయే అల్లుడిని.. ఎంత గొప్పగా పెంచుతుందో కూతురిని..కదా :-)

@ రిషి : నిజమే వి.ఐ.పి మన్నికైనది..ద్రుదమైనది..:-)...సుభద్ర గారు చెప్పింది వాన టపా గురుంచి కాదు, వాన మీద టపా...అంటే నా టెంప్లేట్ బ్యాక్ గ్రౌండ్ లో వాన పడుతున్నట్లు ఉంది కదా...అదనమాట

Kishen Reddy said...

@ చిన్ని : థాంక్స్ :-)

@ రాగ : మీ కామెంట్ నాకు చాలా సంతోషం కలిగించింది ..థాంక్స్ ఎ లాట్.. :-)

చిలమకూరు విజయమోహన్ said...

:)

నేస్తం said...

క్రొత్త బ్లాగ్ నా ?? టెంప్లెట్ భలే బాగుంది :) కామెంట్స్ లైట్ కలర్ లో వస్తున్నాయి కలర్ మార్చాడానికి వీలుందేమో చూడండి

3g said...

మీ పోస్ట్ తోపాటు టెంప్లేట్ కూడా బాగుంది.

కవిత said...

ఇప్పుడు ఆ సుటుకేసు మీతో నే ఉందా??కొంచం మీ అడ్రెస్స్ ఇస్తారా...నిజం గ V .I .p నా ,కదా అని చెక్ చేస్తాను...సిలిండర్ ఆంటీ బలే పోగిదిందే మిమ్మల్ని ...ఇన ట్రైన్ లో ఆ పరద్యానం ఏంటి,పక్కన ఆంటీ కూతురిని పెట్టుకొని... x-(

BTW,Tempalte adhurs...

శ్రీనివాస్ said...

మీ టపా బాగుంది ..... చాల కామెడీ గా రాశారు. కానీ అక్కడక్కడా "ఎంతో మంది బలిసిన నాకొడుకుల సూట్ కేస్ లు" డబ్బున్న వాళ్ళ పిల్లలని ఇలా సంభోధించకుండా ఉంటే ఇంకా బాగుండేది.

శివరంజని said...

టెంప్లెట్ భలే బాగుంది :) బాలకృష్ణ అయితే అలా కంపార్టుమెంటులు దాటుకుంటూ పరిగెట్టడు , జస్ట్ కంటి చూపు లేక చిటికె చాలు . అస్సలు తెలియదు మీకు

sravan kumar said...

hahahahahahahahahahahahahahaha

na chepuladi kuda same story kane ne story anta bagundadu

Kishen Reddy said...

@ విజయమోహన్ : థాంక్స్ :-)

@ నేస్తం : థాంక్స్, కామెంట్స్ లైట్ కలర్ లో రావడం ఏంటి .. కామెంట్స్ మామూలుగానే వస్తున్నాయి కదా..వైట్ బ్యాక్ గ్రౌండ్ లో బ్లాక్ ఫాంట్ కాలర్ ఉంది కదా..మీకు అలా లైట్ కలర్ లో ఎలా కనిపించింది అర్థం కావట్లేదు..ఎలాగబ్బా ??

@ త్రీజీ : ధన్యవాదాలు

@ కవిత : సూటుకేసు నా దేగ్గరే ఉంది..నిజ్జంగా వి.ఐ.పీ దే...సిలిండర్ ఆంటీ పోగిడింది నన్ను కాదండి ఆమె మినీ సిలిండర్ కూతురికి కాబోయే మొగుడిని...సో నాకేం సంబంధం లేదనమాట...

Kishen Reddy said...

@ శ్రీనివాస్ : థాంక్స్ ..సరదాగా రాసినదే కాని, నా ఉద్దేశం మాత్రం కాదు..

@ రంజని : థాంక్స్...నిజమే నాకు బాలకృష్ణ గురుంచి తెలిసింది చాలా తక్కువని మొన్నీమధ్య మల్టీప్లేక్స్ లో సింహ చిత్రం చూసిన తర్వాతనే తెలిసింది :-)

@ శ్రవణ్ : థాంక్స్..ఈ సరి కుదిరినపుడు మీ చెప్పుల కథ నాకు చెప్పండి...సరేనా :-)

నేస్తం said...

కిషన్ కామెంట్స్ నిజంగానే చాలా లైట్ కలర్లో కనబడుతున్నాయి నాకు..మిగిలిన బ్లాగర్లే చెప్పాలి మరి ..విషయం ఏమిటో

Kishen Reddy said...

నేస్తం అవునా...ఇదేమిటబ్బా??..లైట్ కలర్ అంటే ఏ కలర్ లో??..నాకేమో ఆకాశవీధిలో బ్లాగ్ లో ఎలా కనపడుతున్నాయో కామెంట్స్ అలాగే కనబడుతున్నాయి ఇక్కడ కూడా... మిగతా వారు ఎవరికైనా నేస్తం గారిలా అనిపించిందేమో చెప్తే సరిచేయ్యగాలను...ప్లీజ్ ఎవరన్న చెప్పి పుణ్యం..పరమాన్నం కట్టుకోండి :-)

మంచు.పల్లకీ said...

నిజమే ... కామేంట్స్ లైట్ కలర్ లొ వుండి చదవటానికి కస్టంగా వుంది

Kishen Reddy said...

మంచి పల్లకీ : అవునా..ఏంటి మరి నాకు మామూలుగానే కనిపిస్తున్నాయే ..ఎంటబ్బా ఇది..ఇంకెవరికైనా ఈ ప్రాబ్లం ఉందా చెప్పండి ప్లీజ్..నాకు బ్లాక్ కలర్ ఫాంట్ లో బాగానే క్లియర్ గా కనిపిస్తున్నాయి మరి ...సరే చూస్తాను ఏమన్నా సరి చేయ్యగాలనేమో అని :(

కవిత said...

kishan garu,nijam ga ne chala lite color lo kanapaduthunnayi(assalu kana padatle)...white background lo ash color font comments very hard to go through them...kindly check it soon plzz..

Kishen Reddy said...

@ నేస్తం, మంచు & కవిత : ఈ లైట్ కలర్ కామెంట్స్ లోపాన్ని ముందు నా దృష్టికి తీసుకువచ్చిన నేస్తానికి, ఆ లోపాన్ని ధ్రువీకరించిన మంచు, కవితలకు నా అభినందనలు... నేను కామెంట్స్ కలర్ మార్చేసాను..డార్క్ కలర్ పెట్టాను..ఇప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే అనుకుంటున్నా..ఎలా మార్చాలో తెలియక కొంచెం తికమక పడ్డా చివరికి సాధించ...హి హి కిషెన్ కదా మరి (నీకు అంత సీన్ లేదని మీ మనసులో ఇప్పుడు నా గురుంచి అనుకుంటున్నారని తెలుసులే :-) )

నేస్తం said...

అంతకు ముందు టెంప్లెట్ మార్చినపుడు html కోడ్ నేనూ మార్చాను ..కాబట్టి అంత సీన్ లేదని అనేయలేను :P

Kishen Reddy said...

నేస్తం html కోడ్ జోకిలి నేను చచ్చినా పోను..ఆ గజిబిజి గందరగోళం చూస్తేనే మంట నాకు..అయిన ఇపుడు బ్లాగర్ ఎన్నో సౌలభ్యాలు ఇస్తుండగా ఇంకా html కోడ్ తో ఏం పని...బ్లాగ్గర్ లో డిజైన్ టాబ్ లో "Template Designer" అని ఉంది కదా...దాంట్లోనే ఎంచక్కా మనకి కావలిసినట్లు మన బ్లాగ్ ని డిజైన్ చేసుకోవచ్చు..దానిలో వెతికాకే కామెంట్స్ కలర్ మార్చగలిగా...అదీ కథ :-)

anita said...

బ్లాగ్ చాలా బాగుందండి ,

Kishen Reddy said...

@ Anitha : Thanks a lot :-)

Raj said...

Kishen Reddy

mi native ekkada.. Rajam, chipuri palli ivi maa area ki daggara lo vunna vurla perlu

actually orissa lo vunna telugu vallam memu....

సుభద్ర said...

రాజ్ గారోయ్,
నే చెపుతా నే చెపుతా!!!
కిషన్ బ్లాగు లోనే కుడి ప్రక్కన చూడ౦డి ....గులాబీ అక్షరాలతో మ౦చి స్టైల్ గా పోజ్ ఇచ్చారు...
పుట్టి౦ది రాయలసీమ,పెరిగి౦ది ఆ౦ధ్రసీమా,ఇప్పుడు ఉద్యోగ౦ అరవసీమా....

Raaga said...

Superb naration :-)

Ramakrishna Reddy Kotla said...

రాజ్ గారూ : మేము అప్పుడు రాజంలో ఉండేవాళ్ళం... మా నేటివ్ గుంటూరు జిల్లా :-)

సుభద్ర : మీరు బాగానే చెప్పారు కానీ...చిన్న కరెక్షన్....పుట్టింది రాయలసీమ కాదు...పల్నాడు.. :-)

రాగా : ధన్యవాదాలు