Sunday, June 27, 2010

అసలు సంగతేమిటంటే !!

ఇప్పుడే ఆంధ్రామెస్సులో లంచ్ చేసి వచ్చాను...అంటే ఇప్పుడు నేనేదో సుష్ఠుగా తినేసి వచ్చాను అనుకుంటే మీరు పప్పులో పెరుగు కలిపినట్లే ...పప్పులో పెరుగు కలపడం ఏమిటా అనుకుంటున్నారా...మీకే అర్థమవుతుంది లెండి.... అసలు ఆదివారం రోజున మా పీ.యం నన్ను ఆఫీసుకి వెళ్లి వర్క్ చెయ్యమననేల ...అన్నాడు పో...నేను బ్రేక్-ఫాస్ట్ సైతం చెయ్యకుండా ఆఫీసుకి లగెత్తనేల ...లగెత్తితి పో...ఒంటిగంట కల్లా కడుపుమండి ఆఫీసు పక్కనున్న ఆంధ్రామెస్సులో అడుగెట్టనేల .. అడుగెట్టితి పో...ఆ అరవజాతి చీకేసిన టెంకె మొహంగాడు నా ముందు కూర్చోననేల ...కూర్చున్నాడు పో....వాడు అవ్విధముగా చేయనేల...కటకటా ఏమి నాకీ వింత పరీక్ష...


ఆదివారం ఆఫీసుకి రమ్మంటే నాకు మండే మంటని ఆపడానికి ఫైర్ ఇంజిన్ కాదు కదా శ్రీశైలం డ్యాములో నీళ్ళుమొత్తం కుమ్మరించినా ఆగదు..కానీ ఈ మధ్య ఆఫీసులో ఉన్న పని తీవ్రతని అర్థం చేసుకొని, తప్పక నేనే ఆ మంటలను ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊది ఆర్పేసుకొని ఆఫీసుకి వెళ్ళడానికి మెంటల్ గా ప్రిపేర్ అయ్యాను .. ఆదివారం ఉదయం పదిదాటినా అది నాకు అర్థరాత్రి లాగే అనిపిస్తుంది ఎప్పుడూ.. ఈ రోజు ఉదయం పది కల్లా ఆఫీసులో ఉండాలి కాబట్టి తొమ్మిదిన్నరకు అలారం పెట్టుకొని పడుకున్నాను రాత్రి .. తొమ్మిదిన్నరకు మోగిన అలారాన్ని స్నూజ్ చేస్తూ చేస్తూ తొమ్మిదీ యాభైకి లేచాను.. పది నుముషాల్లో రెడీ అయ్యి ఆఫీసుకి వెళ్ళాలి...అది నా టార్గెట్ ఆ క్షణాన.. 9 52 కల్లా బ్రష్ చేసి, 9 54 కల్లా స్నానం చేసి, 9 57 కల్లా డ్రెస్ వేసుకొని,షూస్ తొడుక్కొని, రోజూ లాగే ఎక్కడెక్కడో విసిరేసిన ఐ.డీ ట్యాగ్, రూమ్ తాళాలు, పర్సు, దువ్వెన అన్నీ వెతుక్కొని బైటపడ్డాను... ఇక మూడే మూడు నిముషాలలో ఆఫీస్ చేరుకోవాలి.. ఒక పరుగులాంటి నడకతో ఊపందుకొని దూసుకుపోతున్నా రోడ్డులో.. అందరినీ దాటుకుంటూ వెళ్తుంటే నావైపు అదేదోలాగా చూస్తున్నారు.. ఆహా అబ్బాయి ఏమి ఫాస్టు అనుకుంటున్నారేమో అనుకోని ఇంకా రెచ్చిపోయాను.. కానీ వారి చూపుల వెనుక మర్మమేమిటో నన్ను నేను అలా నడుచుకుంటూ రోడ్డు పక్కన ఉన్న సెలూన్ మిర్రర్ లో చూసుకుంటే అర్థమయింది.. వెంటనే ఆ తప్పుని సరిచేసుకొని... (ఏ తప్పని అడగకండే.. అది మీ క్రియేటివిటీకే వదిలేస్తున్నా ... రెచ్చిపోండి :-) ).. మొత్తానికి ఓ మూడు నిముషాలు ఆలస్యంగా ఆఫీసుకి చేరుకొని పంచ్-ఇన్ చేసాక తీరిగ్గా సీటులో కూలబడ్డాను...


సిస్టం ఆన్ చేసి.. అప్లికేషను ఓపెన్ చేసి..మెయిల్స్ చెక్ చేసి.. ఓ అరగంట అలాగే డెస్క్ మీద పడుకొని..లేచి మళ్ళీ వర్క్ చెయ్యడం ప్రారంభించా.. అకస్మాత్తుగా నేనున్నానంటూ గుర్తు చెయ్యడం ప్రారంభించింది ఆకలి.. మార్నింగ్ టిఫిన్ చెయ్యలేదు కదా.. ఆ అలారం పెట్టుకునేది ఏదో ఒక గంట ముందు పెట్టుకొని, ఎవరో వెనుకనుంచి బెత్తంతో తరుముతున్నట్లు కాకుండా, నింపాదిగా రెడీ అయ్యి చక్కగా టిఫిన్ చేసి రావచ్చుగా ఆఫీసుకి అని అనుకుంటున్నారు కదా... కానీ తొక్కలో టిఫిన్ కోసం, అద్దం ముందు సోకుల కోసం, బంగారం లాంటి ఓ గంట నిద్రని త్యాగం చేసేంత మూర్ఖుడిని కాదు యువరానర్.. కానీ అప్పటికే నా కడుపులో కాకులు కావ్ కావ్ అంటుండటం చేత లంచ్ కి ఫుల్లుగా కుమ్మెయ్యాలని డిసైడ్ అయ్యి... పన్నెండున్నరకే లగేత్తాను ఆఫీసు పక్కన ఉన్నఆంధ్రామెస్సుకి...


వాడు నాకు ఆకులో అన్నం, పప్పు, అదేదో కుర,అదేదో ఫ్రై, అరిటిపండు పెట్టాడు.. నేను చక్కగా వేడి అన్నంలో పప్పు కలుపుకొని లైట్ గా నెయ్యి తగిలించి.. ఒకొక్క ముద్దా ఆస్వాదిస్తూ ఓ మూడు ముద్దలు తిన్నానో లేదో, నా ముందు ఒక అరవోడు వచ్చి కూర్చున్నాడు.. అంతే నేను నాలుగో ముద్ద పెట్టుకొనే లోపే వాడు చేస్తున్న చేష్టలు చూసి నిశ్చేష్టుడినయ్యాను.. వాడు అన్నం మొత్తం ఒక కుప్పగా దెగ్గరికి తీసుకువచ్చి...మొదటగా ఆ కుప్పలో నెయ్యి వేసి కలిపాడు..ఆ వెంటనే పప్పు,కూర,ఫ్రై మూడింటిని అలా నెయ్యి కలిపిన్న అన్నం లో వేసి అన్నిటినీ బాగా మిక్స్ చేసాడు..వెంటనే ఆ మిశ్రమంలో సాంబారు, పెరుగు, పెరుగు చట్నీ, కంది పొడి వేసి బాగా కలిపాడు..వెంటనే అరిటిపండు వలిచి ఆ మిశ్రమంలో వేసి బాగా పిసకడం మొదలెట్టాడు.. ఆ మిశ్రమానికి కొద్దిగా ఆవకాయ పచ్చడి కూడా తగిలించి, అప్పడంతో నంజుకొని వాడు తింటుంటే నాకు వెంటనే కడుపులో దేవేసి, ఏ క్షణంలోనైనా లోపల ఉన్న మూడు ముద్దలు బైటకి ఎగదన్నేస్తాయి అని కంగారు పడి.. హుటాహుటిగా లేచి వెళ్లి చెయ్యి కడుక్కొని.. బైటకి వెళ్ళబోతూ..ఓ సారి వాడి వైపు చూసాను..వాడికి ఆ మిశ్రమంలో పదార్ధాలు సరిపోయినట్లు లేవు..ఇంకా ఏదో కావాలని కేకేస్తున్నాడు.. "అన్నే ...కారా కొలంబు, మోరు కొలంబు ఎడ్తుకు వా శీఘ్రం..." అంటున్నాడు ఆ మిశ్రమాన్ని జుర్రుకుంటూ.. "ఓర్నీ నువ్వు మనిషివా అరవోడివా (వాడు నిజంగానే అరవోడు)... ఆ తిండి ఏంట్రా.. ఎన్ని ఉంటె అన్నిటినీ కలిపి తినేస్తావేంట్రా నువ్వు ... నెయ్యి కలిపిన అన్నంలో పెరుగు,పప్పు,సాంబారు,అరిటిపండు, నీ శార్ధం, పిండాకూడు, మన్ను మాశానం అన్నీ ఒకేసారి కలపడమేంట్రా అష్టదరిద్రపు నికృష్టపు బేవార్సు A1 ఏబ్రాసి ఎలుకలు కొట్టేసిన కోతులు చీకేసిన తాటికాయ టెంకె మొహం నువ్వూను ...నా కడుపు మంట ఏనాడో నీ గుండె మంట అవ్వక మానదు..." అంటూ వాడిని తనివి తీరా తిట్టేసుకొని బైటకి నడిచాను.. ఆకలిగా ఉన్నా ఆ మిశ్రమాన్ని చూసిన కళ్ళతో ఇప్పుడు నేను ఏమి తిన్నా ఆ భయంకర మిశ్రమమే గుర్తుకువచ్చే సూచనలు ఉన్నాయి కనుక...అలా ఆకలి తీరకుండానే ఇలా మళ్ళీ ఆఫీసుకి వచ్చేశాను... నా ఈ కడుపు మంట మీతో కూడా కొంచెం పంచుకొని ఆ మంటను కొంచెం అయినా ఆర్పే పనిలో ఉన్నాను అనమాట... ఇక రాత్రి డిన్నర్ కి ఏ విఘ్నాలు కలగకుండా ఉంటె హాయిగా తినేసి పడుకుంటాను...సో అదీ అసలు సంగతి !!

40 comments:

కొత్త పాళీ said...

మీరు మా అరవోళ్ళ మనోభావాల్ని తీవ్రంగా గాయపరిచారన్న ఒక్క పాయింటుతప్ప మిగతాదంతా బ్రిలియంట్

Anonymous said...

ఇంకా నయం. ఆ మిశ్రమం ఫొటో పెట్టలేదు.
అయినా సాంబారులో కూరలు నంచుకుని తినే తమిళులని చూసా కాని ఇలా అరటిపండు కూడా కలుపుకుని తినే దిక్కుమాలినవాళ్ళని చూడలేదు.
చెన్నయి వెళ్ళినపుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. మనం ఆపకపోతే వాళ్ళు అన్నం పెట్టినవెంటనే దాని మీద సాంబారు పోసేస్తారు.

Rishi said...

దేవుడా...ఏమి ఈ పరీక్ష కిషన్ కి?అరవ వాళ్ళు పొంగల్ తింటూ దానిలోని మిరియాలు తీసి సుతారం గా చుట్టుపక్కల వెదజల్లుతూ(ఒకసారి నా కంచం లో కూడా పడ్డాయి) ఉంటారని తెలుసు కానీ ఈ కళ చూడలేదు నేను ఎప్పుడూ...ఓ ఫోటో తియ్యకపోయారూ.

చిన్ని said...

యాక్ ...నాకు తెముల్తుంది చదువుతుంటేనే ..చాల సరదాగా రాసారు ఆఫీసు డెస్క్ మీద నిద్రపోవడం తో సహా ....ఏమైనా సాఫ్ట్ ఉజ్జోగం బాగుంది :-)

సతీష్ said...

ఓ సారీ చెన్నై వచ్చినప్పుడు ఇటువంటి అనుభవం నాకూ అయ్యింది, ఈ అరవోల్లు చాలా మటుకు ఇంత రాక్షసంగా ఎలా తింటారో అనుకున్నాను, వాళ్ళది రాక్షస జాతే కదా, రావణుని వారసులు మరి.. మీరు ఫన్నీగా వ్రాసిన విధానం బాగుంది.

Ramakrishna Reddy Kotla said...

కొత్తపాళి గారు, మీ అరవోళ్ళ మనోభావాలు గాయపరచడం కాదుగానీ, ఆ సందర్భంలో నా కడుపుమంట అలా అనిపించింది... మీ కమెంటుకి థాంక్స్... ఇంతకీ మీరు అరవోళ్ళా???

బొనగిరి: ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళు కూడా ఉన్నారని నాకూ ఈరోజే తెలిసింది.. ఇప్పటిదాకా వెళ్ళు సాంబారుతప్ ఏదైనా కలిపేసి తినేయగల సమర్ధులు అని మాత్రమే అనుకున్నాను..కానీ దానికి కొనసాగింపు ఉందని ఈ రోజే తెలిసింది..

రిషి: ఈ కళ నాకు ఈరోజే కనిపించింది రిషి..ఏం చేస్తాం మన టైం అలా ఉంది.. ఆ ఫోటో తీసి పెడితే పాపం మన బ్లాగ్మిత్రులు అందరికి కడుపులో దేవేస్తుంది అని తలచి పెట్టలేదు.. :-)

Ramakrishna Reddy Kotla said...

చిన్ని: సాఫ్టు ఉద్యోగం బాగుందా.. మాకు తీరి పోతుంది ఇక్కడ.. ఏదో ఆదివారం కదా అని..అది కూడా చాలా యార్లీగా లేచాను కదా(9 50AM)..అందుకే కాసేపు డెస్కులో నిద్రించాను అనమాట.. థాంక్స్ అండీ మీ కమెంటుకి.. :-)

సతీష్: ఒహో మీకు అనుభవమ అయిందా.. శుభమస్తు :-).. థాంక్స్ మీ కమెంటుకి ...:-)

స్ఫురిత said...

కిషన్,

ఖర్మ కాలి, అన్నం తినబోతూ చూసాను మీ post....:(
వాడికి నా కడుపు మంట కూడా తగుల్తుంది లెండి.

Ramakrishna Reddy Kotla said...

స్పురిత గారు...హా హా హా.. సో మీకు ఇప్పుడు నా కడుపు మంట బాగా అర్థం అయ్యి ఉంటుంది :-)..

sowmya said...

మరీ అరవవాళ్లు అంత దారుణంగా ఉండరండీ...మీకెవడో అరవజాతిలో అంట్లవెధవ దొరికినట్టున్నాడు. అరవవాళ్ళు చాలా పద్ధతిగా తింటారు నాకు తెలిసినంతవరకూ...మీరు మరీను!


అరవ కనెక్షన్లు నాకూ కొంచం ఉన్నాయికాబట్టి నా మనోభాలు దెబ్బతిన్నాయి :D

Ramakrishna Reddy Kotla said...

సౌమ్యా అరవవాళ్ళలో పద్దతిగా తినేవాళ్ళు లేరని కాదు..ఆ శాతం తక్కువ.. వీళ్ళ అరవ తిండి గత మూడు ఏళ్లుగా ఈ చెన్నైలో ఉంటున్న నాకు అనుభవమే...అందుకే మనం చిన్నప్పుడు అన్నం సరిగ్గా తినకుండా అన్ని కెలికి కెలికి తింటుంటే "ఏంట్రా ఆ అరవ తిండి...సరిగ్గా తిను అంటారు..." ఆదనమాట విషయం..

కోనసీమ కుర్రాడు said...

సంతొషించాం లె ఈ మాత్రం దనికె ఇంతగా ఇదైపొవల్సిందెముంది

ఉప్మాలొ చెపలకుర కలుపుకు (మిక్స్ మాత్రం పిసుకుడె) తినె కెరళావళ్లు తగల్లెదు తమరికి

Ramakrishna Reddy Kotla said...

కోనసీమ కుర్రోడు గారు, నాకు ఆ టైంలో అది చూసే సరికి అలా అనిపించింది... ఆ మాత్రం దానికే అంతగా ఇదైపోవడం అంటే, ఎం చేస్తాం బాసు.. ఆ మిశ్రమం చూసే తట్టుకోవడం నా వల్ల కాలేదు ... మీరు చెప్పిన ఉప్మా + చాపల పులుసు కలిపే కేరళా కాంబో నాకు ఇంత వరకు తగల్లేదు .. కానీ మీరు చెప్పిన మిశ్రమం అంత దారుణంగా ఉండదేమో అనిపిస్తుంది :-).. ఎందుకంటే ఉప్మా లో దాదాపు పెరుగు తప్ప ఏమి కలిపినా పర్వాలేదు.. బాగానే ఉంటుంది ..

మంచు.పల్లకీ said...

అరటి పండు తప్ప మిగతా వన్నీ ఒకే.. ... అసలు పెరుగు లొ పప్పు కలుపుకుంటే అసలు ఆ రుచే వేరు...
అరటిపండు ఐడియా కూడా బాగనే వుంది.. రేపు ట్రై చేసి చెప్తా

Rangacharyulu said...

రామక్రిష్ణ గారూ, మీ రఛనాశైలి బాగున్నది,కానీ ,

నీ స్వార్ధం, పిండాకూడు

బదులుగా శార్ధo అని వాడితే బాగుoడేది

Ramakrishna Reddy Kotla said...

@మంచు భయ్యా: ట్రై చేస్తారా... మరెందుకు ఇంకా ఆలస్యం ...కానివ్వు.. ఎలా ఉందొ రిజల్ట్ మాత్రం మరిచిపోకుండా చెప్పండి...

@రంగాచార్యులు గారు, ధన్యవాదాలు.. తప్పిదము సరిచేశాను..

శివరంజని said...

హా హా హా ....ఇంకా నయ్యం.మీకో విషయం తెలుసా? కొన్ని పెళ్ళిళ్లలో పెళ్ళంత అయిపోయిన తరువాత పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురి చేత అరటిపళ్ళు,బూరి,జాంగీరి,సున్నుండా అన్ని వేసి బాగా పిసికించేస్తారు.ఆ పదార్ధం చూస్తే ఎంత అసహ్యం గా వుంటుందో.పైగా అదేదో గొప్ప స్వీట్ లా అందరి కి పంచి పెట్టడానికి తయారయిపోతారు.

అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కిషన్ గారు ......... పైన చెప్పిన ప్రసాదం తింటే ఏంజిల్ లాంటి అమ్మాయితో పెళ్ళవుతుందంట తెలుసా?

కౌండిన్య said...

హ హ సూపరు మీ పోస్ట్ :)
@శివరంజని గారు అర్జెంటుగా అలా పెళ్లి జరిగే అడ్రస్ ఇవ్వండి దయచేసి :)

వెంకట్ said...

బాబు గారు.. ఆ అరవ వాడు అన్నం గుప్పెడు పోసుకొని చేత్తొ పిండి తిన్నాడు కాబట్టి మీకు అంత వికారం అనిపించి ఉంటుంది, నేను గమనించిన నార్త్ ఇండియన్స్ చాలా మంది ఇలాగే తింటారు , పప్పు సాంబారు పెరుగు అన్ని కలుపుకొని , తేడా ఏంటంటే మీ అరవోడు చేత్తో తిన్నాడు వీళ్ళు స్టైల్ గా స్పూన్ తో తింటారు ఎదవలు

మంచు.పల్లకీ said...

వెంకట్ గారు

ఇది అన్యాయం... నేను అలాగే పెరుగులొ పప్పు, సాంబార్, చికెన్, అన్ని కలుపుకుని అప్పుడప్పుడూ చెత్తొ, అప్పుడప్పుడూ స్పూన్ తొ కూడా తింటూవుంటా... ఇలా మమ్మల్ని తిట్టేస్తే ఎలా...

Ramakrishna Reddy Kotla said...

రంజని: నిజమా నాకు ఈ విషయం ఇప్పటిదాకా తెలియదు సుమీ.. ఈ సరి ఏ పెళ్లిలోనైన అలా చేస్తే కళ్ళు ముసుకొని ఆ మిశ్రమం తినేస్తా..తరువాత ఏమయినా సరే..నాకు ఎంజెల్ అవసరం..ఈష్టు గోదావరి అమ్మాయి చాలు .. :-)

కౌండిన్య: థాంక్స్ అండి..రంజని గారి అడ్రెస్స్ చెప్పగానే మనిద్దరం వెళ్లి ఆ పదార్దం తినేసి వద్దాం..ఏమంటారు??

Ramakrishna Reddy Kotla said...

వెంకట్: హి హి హి...నిజమే కావచ్చు...కానీ అరవోల్లు మరీ క్రేయటివ్ గా తింటారు లెండి.. తట్టుకోలేని క్రియేటివిటీ అనమాట :-)

మంచు భయ్య: మీరు అలాగే కానియ్యండి.. వెంకట్ గారి నార్త్ ఇండియన్స్ ని మాత్రమే అన్నారు లెండి.. వెంకట్ గారు అంతే కదా.. పాపం మంచి భయ్య లైట్ గా ఫీల్ అయ్యారు :-)

మంచు.పల్లకీ said...

ఈ బ్లాగ్ లొ " అన్నయ్యా కాంబినేషనా " అన్న పొస్ట్ చదవండి :-))

http://aithesare.blogspot.com/

వెంకట్ said...

oh.. manchu gaaru sorry for dat

"ఎదవది" అన్నది నా ఊతపదం చాలా ఎక్కువగా వాడుతుంటా ఏదో అలా టంగు స్లిప్ అయ్యింది.ఏమి అనుకోకండి.

"వెంకట్ గారు అంతే కదా" కిషన్ జి ఇది అర్థం కాలా!!!

మంచు.పల్లకీ said...

భలేవాడివే వెంకట్.. అంతలేదు.. మనలొమనకి సారీలెందుకు.. :-)) కిషన్ చెప్పినట్టు ఈరొజు ఎగ్ , అరటిపండు, పెరుగు వేసుకుని తిన్నా... సూపర్...

sowmya said...

పెరుగు అరటిపండు నిజంగానే మచి కాంబినేషన్.....అరటిపండు ముక్కలుగా కోసుకుని అవి పెరుగన్నంలో కలిపేసుకుని తింటే బావుంటుంది...ఎప్పుడైనా ట్రై చెయ్యండి కావాలంటే. అలాగే పెరుగన్నంలో మామిడిపండు పిసుక్కుని తిన్నా బావుంటుంది.

nagarjuna said...

హ హ హ్హహ్హ..పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు
esp ఆ సాల్తిని తిట్టిన పార్టు కేకో కేక...

శ్రీశైలం డాములో నీళ్లు కూడా చల్లార్చని కోపాన్ని ఉఫు ఉఫు అని చల్లార్చావా..కెవ్
పాహిమామ్ పాహిమామ్

కవిత said...

కిషన్ గారు, మన కష్టాలు ఇలా అందరికి చెప్పి వాళ్ళని కూడా బాధ పెట్టడం అవసరమంటారా???ఇడ్లి కి చాపల కూర నంజుకుంటారు అని వినే....చాలాసేపు ఏడ్చాను...మీరు మరి ఇలా ఎన్ని అయిటంస్ ,ఎలా కలిపారో కూడా కళ్ళకు కట్టినట్లు చెపుతుంటే ....ఇంకా ఎం చెప్పమంటారు చెప్పండి...అది మన ఆంద్ర మెస్సు లో "అరవ వాని" అఘాయిత్యాలు ....ఎంతటి ఘోరం. అందుకే నేను చెన్నై లో హోటల్స్ కి వెళ్ళడంమానేస....

@శివరంజని ,మరి వీళ్ళకి అద్ద్రుస్స్ ఇస్తున్నారా ?లేదా?

@మంచు గారు,రంగు,రుచి అన్ని బాగున్నాయి అంటారు అంతే న???

Ramakrishna Reddy Kotla said...

మంచు భయ్య: చదివాను ఆ టపా.. హా హా ఫన్నీ గా ఉంది..ఎన్ని కాంబినేషన్లో.. ఎగ్గు, అరటిపండు, పెరుగు వేసుకోమని నేను చెప్పానా :O...

వెంకట్: అంతే కదా- అంటే, మీరు నార్త్ ఇండియన్స్, ఇంకా ఈ అరవోల్లనే అన్నారు కదా అని ఆ సందర్భంలో అన్నాను..అంతే.. :-)..

Ramakrishna Reddy Kotla said...

సౌమ్య: పెరుగు, అరటిపండు కాంబినేషన్ మంచిదే సౌమ్య గారు..అది నేను చిన్నపాటినుంచి చూస్తున్న కాంబినేషనే...కానీ నేను చెప్పిన కేవలం అవే కాదు..పెట్టిన పదహారు రకాలు..కస బిసా కలిపి..అదోరకంగా తిన్నాడు లెండి..మీరు ఆ టైంలో చూసి ఉంటే, సేం నా ఫీలింగే వచ్చేసి :-)

కవిత: మీకు పెళ్లైంది సో మీకు హోటల్స్ కి పెళ్ళే పనేంటి చెప్పండి...మరి నాలాంటి వారి పరిస్థితి వేరు కదా...

చారిగారు: హా హా ..థాంక్స్ అండి ..:-)

శివరంజని said...

@కవిత గారు:ఈ సీక్రెట్ మనిద్దరి మద్యనే ఉండాలి) అలాంటి పదార్ధాన్ని మీరే తయారు చేసి పెళ్ళి లో పెట్టారు ప్రసాదం అని కిషన్ గారికి పెట్టేయండీ.. సరేనా)

కిషన్ గారు ఆ అరవతిండి చూసే చిరాకు పడ్డారు కదా. అంత కన్నా భయంకరమైనా ఈ పదార్ధాన్ని కిషన్ గారి చేత ఎలాగైనా తినిపించేయాలని ఏంజిల్ ని వంక పెట్టాను.అదన్నమాట నా ప్లాన్ :)
పాపం కౌండిన్య గారికి ఆ విషయం తెలియక రెడీ అయిపోయారు:):)

seeta said...

hello andi....em cheparandi...meeru titina titly assalu ataniki pattavu lendi...endukantara???? atanu tamilian kada...mana telugu titlu vadiki chevina padav...padinavi po...brain ki ekkav...ekkinavi po... artam kaavu...artaminavi po... yeerninchuko ledu....endukantara...okati language problem..marokati anta tinnavadiki eka titlu em geeninchukuntadu lendi...eka danto vadileyandi esari...single seat unnadi chusi mare kurchodi...elanti vaadu mundu unnadu kaadu mukyam...mana kadupu nindinda leda anna de mukyam ante kadandi mari....

శ్రీనివాసరాజు said...

రామకృష్ణగారు..
అరవకామెడీతో.. చితక్కొట్టేసారు.. :-)

నాకు జరిగిన అనుభవంవొకటి.. చెబుతా
నా కొలీగ్ ఒకడు (మరాఠీవాడు).. మాటల ప్రస్థావనలో అడిగాడు.. మీరు సాయత్రం ఎప్పుడూ రైసే తింటారా అని.. నేను అవును అన్నాను.., ఎందుకంటే వాళ్ళు చపాతి రోటీ తప్ప ఏదీ తినరనుకోండి అది వేరేవిషయం..

అయితే ఎలా తింటారు రైస్ అని అడిగాడు.., చిరాగ్గా.. కాస్త ఆశ్చర్యంగా చూసావాడివైపు.. అంటే స్పూనా లేక చేత్తోనా అన్నట్టుగా.. అన్నాడు. నేను ఆలోచించకుండా చేత్తో అన్నాను.. వో.. చీ.. అయితే.. చెయ్యంతా ఇలా ప్లేటులో పెట్టేసి, చేయి నాక్కుంటూ.. తింటారె అలానేనా.. నేనొక మద్రాసీ తినటం చూసా అన్నాడు.. నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు..

అలా అతననుకున్నట్టు ఒక్క మెతుకుచూసి అన్నవుడికింది అన్న కాస్సెప్టు అన్ని చోట్లా అప్లయ్ అవదు.. ఏమంటారు ?? :-)
అరవోడు మన తెలుగు చదవలేడుకాబట్టి.. కుమ్మేయండి.. ఏమవదు.. ;-)

Ramakrishna Reddy Kotla said...

సీత గారు ధన్యవాదాలు :-).. ఈ సారినుండి మీరు చెప్పినట్లే చేస్తానండి

శ్రీనివాసరాజు గారు, మీ బ్లాగ్ లో అన్ని టపాలు చదివి చాలా నవ్వుకున్ననండీ.. నిజమే మెతుకు చూసి అన్నం మొత్తం ఉడికింది అనే కాన్సెప్ట్ అన్ని చోట్లా పనిచెయ్యదు..నేను ఊరికే సరదాగా అలా..అంతే :-)...మీ కమెంటుకి ధన్యవాదాలు :-)

Anonymous said...

:)

Ramakrishna Reddy Kotla said...

Anonymous: Thanks :-)

Anonymous said...

Super Chepparu....

Ramakrishna Reddy Kotla said...

అజ్ఞాత గారు ..థాంక్స్ :-)

Anonymous said...

Good narration. :)

Ramakrishna Reddy Kotla said...

Thanks a lot 4paisa :-)