Tuesday, August 10, 2010

నిన్ను చూడగా గుండెలో...

ప:    నిన్ను చూడగా గుండెలో ఎన్నెన్నో రాగాలు...
        మనసునిండుగా మ్రోగెనులే ఏవేవో తాళాలు..
        తనువంతా సంగీతం...తపనలతో సావాసం...
        ఊహలలో ప్రయాణం...మేఘాల్లో సరాగం..
        పరిచెయమయ్యెను కొత్త భాష..అనుభవమయ్యెను తీపి ఘోష..

చ1:  నిన్ను చేరే సమయాన..పెదవే దాటని మాటలమూటలు విప్పి కళ్ళతో ఎన్నోఊసులు చెప్పెయ్యనా..
        నిన్ను తలచే విరహాన.. కొంటె ఆశలు కలవరపెడితే నిజమంటి కలగా కలలో నిజమై దరిచేరనా..
        ఆకాశం అందనంత దూరంలో లేదులే...జాబిల్లిలా నాముందే నువ్వుంటే..
        వెన్నెల్లో హాయి పగలైనా చేరునులే..నాగమల్లిలా నువ్వు నవ్వుతుంటే...

చ1:  గుండె వేగం తగ్గేనా..ఓ నిముషం పాటు నీ ఓరచూపే నా తనువుని తడిమీ కన్నుగీటుతుంటే..
        కలకంటున్నాననుకున్నా.. నువ్వు కళ్ళముందున్నా పోల్చలేకున్నా నిజమే కలలాగున్నదే..
        గుండెలోనే గువ్వలా దాగున్నావే...అయినా నీకోసం ఎక్కడో వెదుకులాట..
        చెప్పవే మనసా నువ్వైనా నా కళ్ళకి...నీలోనే దాగున్న నాచెలి చిరునామాని...
      
                                                                                                 -- కోట్ల రామకృష్ణా రెడ్డి 

[ఈ రోజు ఆఫీసులో పెద్దగా పనిలేక, ఏదో ఇలా ఓ పాట రాయడానికి ప్రయత్నించాను... దీనికి ట్యూన్ కూడా కట్టాలి అనుకుంటున్నా..అలా ట్యూన్ కట్టాక ఒక పోడ్-కాస్ట్ గా రిలీజ్ చేస్తా..]

17 comments:

కొత్త పాళీ said...

Quite good, I say!
You don't need Java skills to impress girls! :)

చంద్రశేఖర్ కాటుబోయిన said...

chalaa baga raashavu nesthama...you have talent man..keep it up..chandra

భాస్కర రామి రెడ్డి said...

ఏంటి తమ్ముడూ ఏంటి సంగతీ ;)

నేస్తం said...

హూం..అంతా సరేగాని ఇంతకూ ఆ అమ్మాయికి ఇది చూపించావా లేదా? :)

శివరంజని said...

బాప్ రే!!! ఇది ఏ సినిమాలో సాంగ్ అయ్యి ఉంటుంది? అనుకుంటున్నా ...మీరు own గా రాసారా ..

సస్పెన్స్ స్టొరీ రైటర్ గారేనేమో అనుకున్నా ఇన్నాల్లు పాటల రచయిత కూడానన్నమాట..

చాలా చాలా బాగ రాసారు .. ఆగొద్దస్సలు.... రాసెయ్యండి ఇలా ....wish you all the best

మనసు పలికే said...

lyrics చాలా చాలా బాగున్నాయి కిషన్ గారు.. మీకు సంగీతం వచ్చా..??

కవిత said...

Wowwwwww...Simply superb.Enti babu ee sudden surprise....chala chala bagundi..

మందాకిని said...

బాగా రాశారు!
అభినందనలు.

Sai Praveen said...

కిషెన్,
ఇన్ని surprise లా మాకు? సస్పెన్స్ తరువాత కామెడి రాయడమే అనుకుంటే ఇది ఇంకా పెద్ద surprise :)
చాలా బాగుంది. ఇంతకి కిట్టి గాడి కథ ఎంత వరకు కదిలింది?

Sathish said...

Wow Nice Song kishen. Tune it and i wish it turns out to be a soothing one.

Ramakrishna Reddy Kotla said...

కొత్తపాళీ: ధన్యవాదాలు :-)... అయినా నాకు జావా స్కిల్స్ లేవు లెండి :-)

చంద్ర: థాంక్స్ :-)

భా.రా.రె: అన్నయా ఎంత కాలానికి నా బ్లాగుకి వచ్చి పావనం చేసారు...సంగతి ఏమిటంటే మీకు సపరేట్ గా ఆన్-లైన్ లో చెప్తా లెండి ;-)

నేస్తం: ఏ అమ్మాయికీ :-O

Ramakrishna Reddy Kotla said...

రంజని: నీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుడిని :-)

అపర్ణ: థాంక్స్ అండి...నాకా?..సంగీతమా??..అంత లేదండీ ..ఏదో ఉన్న హాఫ్ నాలెడ్జ్ తో ట్రై చేస్తాను అంతే :-)

కవిత: థాంక్స్ :-)

Ramakrishna Reddy Kotla said...

మందాకిని: ధన్యవాదాలు అండి. :-).. మీ బ్లాగు చూసాను...మీరు చెప్పే విషయాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి.

ప్రవీణ్: థాంక్స్ ఏ లాట్...కిట్టిగాడి కథకు మరొక రెండు వారాలు విరామం...వచ్చే నెలలో దాని కొనసాగింపు ఉంటుంది.

సతీష్: థాంక్స్ :-)

వేణూ శ్రీకాంత్ said...

ప్రొఫెషనల్ ఫీల్ తెప్పించారు చాలా బాగుందండీ...

మనసు పలికే said...

అవునా.. అయితే OK. టపా చూడగానే, నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నాను ట్యూన్ కట్టడానికి. మళ్లీ భయం వేసింది, మీరు ఏమైనా సంగీతంలో కూడా దిట్ట ఏమో అని. ఇపుడు నేను కూడా ట్రై చెయ్యొచ్చు అన్నమాట.

Ramakrishna Reddy Kotla said...

వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలు..ఏదో అలా ట్రై చేశా...ఈ సారి కాస్త శ్రద్ధగా ట్రై చేస్తా ఇంకో పాటకి :)

అపర్ణ: సంగీతంలో దిట్ట కాదు కదా బుట్ట కూడా కాదు..హ హ..మీరు ట్యూన్ కట్టడానికి ట్రై చేస్తా అంటే, అంతకన్నా ఏం కావలి...ఇంకెందుకు ఆలస్యం ట్యూన్ కట్టి మాతో పంచుకోండి :)

చంద్రశేఖర్ కాటుబోయిన said...

థాంక్స్ మిత్రమా..నేను ఓ పాట రాసాను నీకు వీలుంటే నా బ్లొగ్ లొ ఓ సారి చూడు..నాకు కొద్దిగా నీ సలహాలు కూడా కావలి.తప్పులుంటే కాస్తా చెప్పు సొదరా ..