Friday, July 30, 2010

నేను, కాజల్ అగర్వాల్ @ ట్విట్టర్

ఆరోజు ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్ళాక, మేనేజర్ వైపు 'హాయ్' అనే స్మైలింగ్ లుక్కోటి పడేసినప్పుడు, ఆడు ఏబ్రాసి మొహం ఏస్కోని 'స్మైల్ కి ప్రతి స్మైల్.. కోల్గేట్ స్మైల్..' అనే విషయం కూడా మరచి మొహం మాడ్చి అటువైపు తిప్పెసుకుంటే, 'నీ లతుకూర్ ఫేస్ లో నా లంగర్ హౌస్...' అని తిట్టేసుకొని (తిట్టుకి అర్థం అడక్కండే ) నా డెస్క్ మీద ఓ పది నిముషాలు రిలాక్స్ అయ్యి...వెళ్లి కాఫీ సేవించి...మళ్ళీ వచ్చి మెయిల్స్ చెక్ చేసి..ట్విట్టర్ ఓపెన్ చేశాను..మహేష్ బాబు, సిదార్థ్, నాగార్జున, శ్రియా, etc..వాళ్ళ ట్వీట్లు చదువుతుండగా...ఎందుకో ఓ సారి చూద్దామని...తన ట్విట్టర్ పేజ్ ఓపెన్ చేశాను.. చేసేసింది...బ్లాక్ చేసేసింది నన్ను..కాజల్ అగర్వాల్ .. ఎందుకు నన్ను బ్లాక్ చేసింది..అందుకేనేమో??...హమ్, మనం అలా ఒక మూడు వారాలు ఫ్లాష్ బ్యాక్ కి వెళ్దాం...అందరూ సీట్ బెల్టులు కట్టుకోండి .....

*********** మూడు వారల క్రితం *****************

ట్విట్టర్ లో ట్వీటింగ్ మొదలెట్టిన దెగ్గరనుండి..దాదాపు అందరు సెలబ్రిటీస్ ని ఫాలో అయిపోతున్నాను...అది కాదు ఇక్కడ ముఖ్యం...నా డార్లింగ్ "కాజల్ అగర్వాల్"ని ఫాలో అవ్వడం ...బ్రహ్మ దేవుడు మాంచి క్రియేటివ్ మరియు రొమాంటిక్ మూడ్ లో ఉండగా సృష్టించబడ్డ అమ్మాయే...కాజల్ అగర్వాల్..పూర్వ జన్మలో నా గర్ల్ ఫ్రెండ్..ఇష్ ఇష్..ఆ అమ్మాయికి ఇంకా ఈ విష్యం తెలీదు ..నాకెలా తెల్సిందంటే, చందమామ సినిమా వంద రోజుల ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు, నేను ఫంక్షన్ హాల్లో నిల్చుని బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ చేతులు రెండూ వెనక్కి చాపినప్పుడు...నా చేతి వేళ్ళకు షాక్ కొట్టింది..తీరా ఏంట్రా ఈ షాక్ అని చూసేసరికి, అప్పుడే అటు ప్రక్కనుండి డయాస్ మీదకి వెళ్తున్న కాజల్ చెయ్యి నా చేతిని తాకింది ..వెంటనే నాకు ఏవేవో గుర్తొచ్చాయి .......

ఆ యువకుడు ఒక యుద్ధంలో దేశం కోసం పోరాడుతుండగా...ఓ రోజు అతని ప్రేయసి వచ్చి "నువ్వు యుద్ధంలో పోరాడుతుండగా నీకు ఎమన్నా అపాయం కలుగుంతుందేమో అని ఇన్ని రోజులూ ఏదో బాధతో జీవించాను...కానీ దేశం కోసం నువ్వు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే, నిన్ను చూసి అందరూ పొగుడుతుంటే..నేనెందుకు బాధ పడాలి అనిపించింది..నిన్ను చూస్తే నాకు నిజంగా గర్వంగా ఉంది..నువ్వు ఖచ్చితంగా యుద్ధంలో నీ వంతు పాత్ర పోషించి, విజయంతో తిరిగి వస్తావు...ఆ రోజు వరకూ నీకోసం వేచి ఉంటాను.." అంటూ ఆ అమ్మాయి ఆతనికి వీర తిలకం దిద్దింది ..కానీ అతను ఎప్పటికీ యుద్ధం నుంచి తిరిగి రాలేదు..అతని ప్రేయసి కూడా అతని కోసం చూసి చూసి..ప్రాణాలు విడిచింది ...ఆ జన్మలో ఆ అబ్బాయి, అమ్మాయే...ఈ జన్మలో...నేను కాజల్ అగర్వాల్ ...

గతం గుర్తొచ్చిన వెంటనే, నా డార్లింగ్ కి ఈ విష్యం చెప్పాలనిపించింది...కానీ ఎప్పుడూ కనిపించలేదు...కానీ ఈ విషయాన్ని నా స్నేహితుడికి చెప్తే, వాడు ఇదేదో కాన్సెప్ట్ బాగుంది అని,డబ్బులకి ఆశపడి రాజమౌళి వాళ్ళ నాన్న చెవులో ఊదాడు ...విజయేంద్రప్రసాద్ గారు దానికి మార్పులు చేర్పులు చేసి..మగధీర అనే కథ తయారుచెయ్యడం..మనం చూడటం జరిగిపోయాయి ...

ఇకపోతే ఇన్ని రోజులకి ట్విట్టర్ లో కాజల్ మళ్ళీ కనిపించడంతో ఫాలో అయిపోవడమే కాకుండా..ఒకేసారి ఒక పది ట్వీట్లు ఇచ్చా..రిప్లై ఇస్తుందనే ఆశ మాత్రం కలగలేదు...విచిత్రం ఒక పదినిముషాల్లోనే కాజల్ నుండి నాకు రిప్లై ..ఎగిరి గంతేసాను ..ఇక ట్వీట్ల మీద ట్వీట్లతో తూట్లు పొడిచాను..అడపాదడపా కాజల్ నుండి కూడా రిప్లయిస్ రావడం నన్ను నేలమీద కాకుండా ఒక రెండు అడుగులు గాల్లోకి నిలబడేలా చేసింది..ఓ రోజు ఇండియా పాక్ మ్యాచ్ వస్తుండగా తను స్కోర్ చెప్పవా అని అడిగితే..అరవోడి(మేనేజర్) పని పక్కన పెట్టి అరనిముషానికి ఓ సారి ఫ్రెష్ స్కోర్ తనకి ట్వీట్ చేసి "అభిమాని అంటే వీడేరా" అనిపించుకున్నాను...ఇలా క్రమం తప్పకుండా రోజుకి ఒక వంద ట్వీట్లు తగ్గకుండా ఇస్తుండేసరికి..ఓ రోజు నా అభిమానం ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసి "నువ్వే నా సిన్సియర్ అండ్ సూపర్ అభిమానివి...ఉమ్మా.." అంటూ నాకు ట్వీట్ ఇచ్చేసరికి...ఇక నేను రెక్కలు కట్టుకొని అన్ని గ్రహాలూ చుట్టేసుకొని వచ్చాను ...

డార్లింగ్  సినిమా రిలీస్ అయ్యింది..నేను వారం ముందే టికెట్స్ బుక్ చేసుకొని, మధ్యాహ్నం ఆఫీస్ ఎగ్గొట్టి సత్యం సినిమాస్ కి బైల్దేరి సినిమా చూశా...సినిమా చూస్తుండగా..తెర మీద కనిపించే కాజలే రోజూ నేను ట్విట్టర్ లో మాట్లాడే కాజల్ అన్న ఊహ వచ్చినప్పుడల్లా ఏదో మనసులో మధురమైన పులకరింత ...ఇక ఉండబట్టలేక హాల్లోనే నా మొబైల్ తీసి కాజల్ కి ట్వీట్స్ పంపాను..సినిమా సూపర్, అంత కన్నా సూపర్ నువ్వు, నీ అందం, నీ యాక్టింగ్...చాలా క్యూట్ గా ఉన్నావు అది ఇదీ అని పంపా...తరువాత ప్రతి పదినిముషాలకి ఓ సారి మొబైల్ తీసి ఏమన్నా రిప్లయ్ వచ్చిందా అని చూడటం..లేకపోయేసరికి పాపం షూటింగ్ లో బిజీగా ఉంటుందేమో అనుకొని, మళ్ళీ ఎక్కడ స్క్రీన్ మీది కాజల్ ని మిస్ అయిపోతానో అని తెరవైపు అటుచూడటం....ఇలా సినిమా చూసేసి రూమ్ కి వచ్చాక నా ట్వీట్ కి రిప్లయ్ ఉంది ..."థాంక్ యు మై గ్రేట్ అడ్మయిరర్"అని...నేను వెంటనే ..."ఇంకా ఎదో...ఇంకా ఏదో..ఇధైపోతావే ఇష్టాలే తెలిపేందుకు....సంకెళ్ళతో బంధించకు ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు..." అంటూ సాంగ్ వేసుకున్నాను ....

ఇలా నేను కాజల్ తో ట్విట్టర్ లో పీకలలోతు అదేదో దాంట్లో మునిగి పోయి ఉండగా ...ఇక లేట్ చెయ్యకుండా...తనకి పూర్వ జన్మ జ్ఞాపకాలు గుర్తుచెయ్యాలి అని డిసైడ్ అయ్యాను ...సరిగ్గా అప్పుడే...అదే జరిగింది ...ఎప్పుడైతే మనం కలలో మాత్రమే జరుగుతుంది అనుకున్నది నిజంగానే జరిగితే, పైనున్న వాడికి కన్నుకుడుతుందేమో... వెంటనే అటువంటి  దాన్ని మళ్ళీ కలగానే మిగుల్చుతాడు..అవును ఆ రోజు అలాగే జరిగింది ...నేను ఆ రోజు కూడా యధాప్రకారమే కాజల్ కి ట్వీట్ల స్వీట్లు ఇచ్చి ఆఫీస్ నుంచి రూమ్ కి వచ్చి..టీ.వీ ఆన్ చేసి పేపర్ చూస్తున్నాను...ఇంతలో ఎదో తెలిసిన గొంతు టీవీలో మాట్లాడుతుంటే యధాలాపంగా చూస్తే ...ఇంకెవరు...డార్లింగ్ కాజల్...పేపర్ పక్కన పడేసి, చెవులు, కళ్ళు టీవీ వైపు పడేశాను...

యాంకర్: మీ డార్లింగ్ సినిమా రిలీజ్ అయ్యి విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది...కంగ్రాట్స్
కాజల్: Thanks...... and my sincere thanks to everyone who made this film a grand success..love you all....
(ఆ చివరి ముక్క ఎందుకో నన్ను ఉద్దేశించి అన్నట్లు అనిపించింది )
యాంకర్: మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ?
కాజల్: I've signed one with Ram Charan again and two more scripts are in consideration...let you know all soon....
(అమ్మనీ....ఈ ముక్క నాకు కాజల్ ట్విట్టర్ లో చెప్పలేదే...నేను అలిగేసాను అంతే...అని మూతి ముడుచుకున్నాను ...)
యాంకర్: చాలా మంది టాలీవుడ్ స్టార్స్ ఇప్పటికే ట్విట్టర్ లో జాయిన్ అయ్యి...తమ అభిమానులకి చేరువ అయ్యారు...మరి మీరు కూడా జాయిన్ అయ్యారా?
(...నా మైండ్ బ్లాక్ అయ్యే...గుండెలో అగ్ని పర్వతాలు బద్దలయ్యే సమాధానం ఇప్పుడు వచ్చింది ...)
కాజల్: Yep, i knew that...but i didn't join in twitter yet...didn't find much time for myself to do that..well, dunno..i may join soon in future..I came to know that a fake ID imitating me is doing rounds in twitter...guys, be aware, i don't have a twitter ID yet...don't fall in trap with fake imitators...

ఆ సమాధానం విన్న నాకు కాసేపు ఏమీ అర్థం కాలేదు...ఆ వంటనే, ఆకాశంలో నేను కట్టుకున్న ఆశల సౌధం కూలిపోతున్న దృశ్యం నాకు కనిపించింది...నాకు బాధ,కోపం,ఏడుపు,చిరాకు అని ఒకేసారి వచ్చాయి
...వెంటనే లాపీ ఓపెన్ చేసి...ఫేక్ కాజల్ అగర్వాల్ కి ట్వీట్ కొట్టాను.."నువ్వు ఫేక్ కాజల్ అని నాకు ఈ రోజు తెల్సింది..ఎందుకు ఇంత మోసం చేశావు..నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను...నిన్ను ఎంతాగా అడ్మైర్ చేశాను...ఓ ఫేక్ కాజల్ నీకు నా శాపం తప్పక తగులుతుంది..." అని ట్వీట్ ఇచ్చేసి ...నాలాగా ఈ ఫేక్ కాజల్ బారిన పడ్డ వాళ్ళని కాపాడాలి అని చెప్పి, అప్పటికే ఉన్న వెయ్యి మంది ఫాలోవర్స్ లో ఒక 500 మందికి 'ఇది ఫేక్ కాజల్...అసలు కాజల్ కి ఇంకా ట్విట్టర్ లేదు..' అంటూ ట్వీట్స్ పెట్టాను...మిగతా 500 మందికి తరువాత రోజు త్వీట్ పెడదాం అనుకున్నాను....

********* ఆ తరువాత రోజు....అనగా మూడు వారాల ఫ్లాష్ బాక్ అయోపోయిన తర్వాతి రోజు ******

 అలా తరువాత రోజు ఆఫీస్ కి వచ్చి ఫేక్ కాజల్ ట్విట్టర్ పేజ్ ఓపెన్ చేసేసరికి...ఇంకేముంది...బ్లాక్ చేసి పడేసింది...నాకు కసీ కోపం రెండూ కలగలిపి వచ్చేసి నేను కూడా తనని బ్లాక్ చేసి పడేశాను...ఇప్పుడు ఆ ఫేక్ కాజల్ కి దాదాపు పదివేల మంది ఫాలోవర్స్..ఫేక్ కాబట్టి పదివేలు మాత్రమే ఉన్నారు...రియల్ ఐ.డీ అయ్యుంటే, ఈ పాటికి లక్ష ఫాలోవర్స్ దాటేవళ్ళే...త్రిషకి జాయిన్ అయిన వారంలోనే ముప్పై వేల మంది ఫాలోవర్స్ వస్తే, మా కాజల్ కి ఏంత మంది రావాలి? అయినా ఫేక్ ఐ.డీ పెట్టుకోవడం ఏం ఆనందమో నాకు అర్థం కాలేదు ,...

హమ్ అలా...నా అభిమానం వేష్ట్ అయిపొయింది ఫేక్ కాజల్ మీద... ...త్వరలో రియల్ కాజల్ ట్విట్టర్ లో జాయిన్ అవుతుంది అని ఆశాభావంతో ఉన్నాను  ..

22 comments:

Krishnapriya said...

:) cute..

శిశిర said...

అయ్యో.. అలా జరిగిందా? మీ ఆశలు అడియాశలయ్యాయా? Better luck next time.. :)

కవిత said...

హి హి హి ...బాగాయింది.నేను నీకు ఈ విషయం ఎప్పుడో చెప్పను కదా...కాజల్ ఏంటి??నీకు త్విట్టేర్ లో రిప్లై ఇవ్వడం ఏంటి అని....చెపితే వినలేకద...బాగాయింది.మరి పార్టీ ఎప్పుడు ఇస్తున్నావ్???

Indian Minerva said...

అంతమాత్రం తెలికపోతే ఎలాగండీ... అది నిజం కాజల్ అయ్యొంటే ట్వీటు ట్వీటుకీ కొట్టుండేది కదా షాకు :)

శివరంజని said...

అయ్యయ్యో!!!! ఎంత పని జరిగిందండి .....మీకెప్పుడు కంగారెక్కువ అనుకుంటా... నిన్న స్వాతి(యాహూ లో).... నేడు కాజల్ .... సరేలేండీ పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు.(పార్టీ ఇస్తే పెద్దమనసుతో దీవించిపెడతాము).....పోనీలేండీ పార్టీ ఇవ్వకపోయినా దీవించేస్తాను
శీఘ్రమేవ కాజల్ ప్రాప్తిరస్తు (ట్విట్టర్ లో)

ఆ.సౌమ్య said...

హహహహ అయ్యో పాపం....ఎరక్కపోయి ట్వీటాను ఇరుక్కుపోయాను అని పాడుకోండి :P

seeta said...

ayyo.papam....entati ghoram....intati papaniki tanu kudukuntundani assalu anukoledandi....sarelendi...yeedi jarigina mana manchike antaru....dont worry you wil really hav a very good time with ur girlfriend soon... may ur long journey prolongs 4 many many yrs....kotha twiter lo join ayyaka eka meeku eka biti prapanchame erugaremo....sare nandi esarina kasta jagrathaga id gurtinchandi lekapote malli kastam suma....waiting 4 new blog....

బద్రి said...

ఇలాంటి ఇబ్బంది లేకుండా పనిలేని అల్లు శిరీష్ కి, సౌత్ స్కోప్ కి పది పది ట్వీట్స్ పెడితే వాళ్ళే ఆ ప్రొఫైల్ కాజల్ అవునో కాదో చెప్పేటోల్లు కదా.

కొత్త పాళీ said...

హయ్యో పాపం!

అరుణాంక్ said...

very nice narration.enjoyed reading your post.
All those those days you were in cloud nine and enjoyed.
Be positive .Dont worry for coming to know about fake kajal.
Look for some one else

అరుణాంక్ said...

very nice narration.enjoyed reading your post.
All those those days you were in cloud nine and enjoyed.
Be positive .Dont worry for coming to know about fake kajal.
Look for some one else

శేఖర్ పెద్దగోపు said...

అయ్యో..ఎంత పని అయ్యింది....మీ భాదను నేను అర్ధం చేసుకోగలను.....అసలు మీకు కలిగిన భాధకు, మీ ఆశల సౌధం కుప్పకూలినందుకు కాజల్ వ్యక్తిగతంగా మీకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా....:)

sunita said...

hmmm..Better luck next time.

మనసు పలికే said...

హిహ్హిహ్హీ.. నేను కూడా శేఖర్ గారితో ఏకీభవిస్తున్నా.. ఈ విషయం మీద మనం ఒక స్ట్రాంగ్ డెసిషన్ కి వస్తే వెంటనే స్కెచ్ గీసేసి ఏ నిరాహార దీక్షో, లేదా భారత్ బందో నిర్వహించేద్దాం. ఏమంటారు..?

Sathish said...

ha ha nice one. Yes,kajal dont have a twitter account yet. :-)

Ramakrishna Reddy Kotla said...

@కృష్ణప్రియ: థాంక్స్ అండి :-)

@శిశిర: అవునండీ అలా అడియాసలు అయ్యాయి...థాంక్స్ :-)

@కవిత: ఇంతలా కేరింతలు కొట్టడం ఏం బాగోలేదు :-((...పార్టీ దేనికి మేడం ... :-ఓ

@మినర్వా: నిజమేనండీ..ఏంటో తెలిసి చావలేదు :-)

Ramakrishna Reddy Kotla said...

రంజనీ: థాంక్స్...నీదెంత విశాల హృదయం :-)

సౌమ్య: ఆల్రడీ అలా పాడేసుకున్నాను లెండి ..థాంక్స్ :-)

సీత: అవునండీ ఏది జరిగినా మన మంచికే..మీ అభిమానానికి థాంక్స్ :-)

బద్రి: శిరీష్ గాడిని, సిద్దర్ద్ కూడా ఓ సారి...వాళ్ళు రిప్లై ఇచ్చి చావలా..అయినా ఆవిడ నిజంగానే కాజల్ అనే భ్రమలో ఉన్నాలెండి :-)

Ramakrishna Reddy Kotla said...

కొత్తపాళీ: :-((...ఏం చేస్తాం..

అరునాంక్: పాజిటివ్ గానే ఉన్నాలెండి..థాంక్స్ :-)

శేఖర్: మీ అభిమానానికి థాంక్స్ అండి...ఇంకొంచెం గట్టిగా డిమాండ్ చెయ్యండి :-))

Ramakrishna Reddy Kotla said...

సునీత: థాంక్స్ అండి :-)

అపర్ణ: మీరు కూడా శేఖర్ గారితో ఎకీభవిస్తున్నారా... థాంక్స్ అండి..భారత్ బంద్ బెస్ట్ ఏమో.. :-))

సతీష్: ధన్యవాదాలు :-)

మనసు పలికే said...

కిషన్ గారు, మరి ఇక ఆలస్యం ఎందుకు..? మొదలెట్టేద్దాం మంచి ముహూర్తం చూసి..:) మంచి పనులకి ముహూర్తం ఎందుకు, ఎప్పుడు మొదలు పెడితే అప్పుడే ముహూర్తం అంటారా..? ఐతే ఇప్పుడే మొదలెట్టేద్దాం..

Ramakrishna Reddy Kotla said...

అపర్ణ గారు మొదలెట్టేసారా మరి..మీరు భారత్ బంద్ చేస్తే పాపం కాజల్ డార్లింగ్ కి షూటింగ్ వెళ్ళడానికి ఇబ్బంది కలుగుతుందేమో...చూసారా నాదెంత విశాల హృదయమో ;-)

sairamnithin said...

awesone