Wednesday, December 22, 2010

ఓ రోజు రాత్రి రైల్లో...

నడికుడి స్టేషన్ వచ్చింది ....
ట్రైన్ దిగాను .... బద్ధకంగా వళ్ళు విరుచుకొని, ఆ రాత్రి జరిగిన సంఘటన గుర్తుకువచ్చి కంపార్టుమెంటు బయట అతికించిన చార్ట్ చూశాను .. ఆశ్చర్యం వేసింది ... మళ్ళీ చూశాను మొత్తం ... భయం వేసింది ... మళ్ళీ చూశాను ... లేదు .. చార్ట్ లో నా పేరు లేదు ... నాకు సర్రున వెన్నులో వణుకు మొదలైంది రాత్రి జరిగింది తలుచుకోగానే .. లక్ నా పక్కన ఉండకపోతే ఎలా బుక్ అయ్యేవాడినో తలచుకోగానే ...........

                              ****** పన్నెండు గంటల క్రితం ******

శబరి ఎక్సుప్రెస్ మరికొద్ది సేపట్లో ప్లాటుఫారం మీదకి రానున్నదనే అనౌన్సుమెంటు విని బ్యాగ్ భుజానికి తగిలించుకొని రెడీగా ఉన్నాను ....
ట్రైన్ వచ్చాక ఎక్కి, నా బెర్త్ ఎక్కడుందో చూసుకుంటూ వెళ్తున్నాను ... అది అర్థరాత్రి కావడంతో నంబర్లు సరిగ్గా కనిపించడం లేదు, అందరూ మంచి నిద్రలో ఉన్నారు ...
నేను సెల్ లైట్ తో నంబర్లు చూసుకుంటూ వెళ్తుంటే నా నంబర్ కనిపించింది ... కానీ ఆ బెర్త్ లో ఒకావిడ పడుకొని ఉంది ... అది నా బెర్తేనా అని మళ్ళీ చూసుకున్నాను నా టికెట్ లో ... అవును అది నా బెర్తే అని రూడీ చేసుకున్నాక, ఇక ఆమెని లేపక తప్పదు అని .. మెల్లిగా తట్టి లేపాను .... ఆమె నిద్రలో ముఖం అదోలా పెట్టి వింతగా చూసింది నా వైపు ...
"ఈ బెర్తు నాది?" అన్నాను
"కాదు ఇది మాదే... " అని మళ్ళీ పడుకుంది ...
ఈవిడెంట్రా బాబూ అనుకొని మళ్ళీ లేపి, నా టికెట్ చూపించి "ఇదిగో చూడండి... ఇది నాకు అలాట్ చేసిన బెర్త్ ..." అన్నాను.
"నువ్వేంటయ్యా బాబూ ... ఇది మా బెర్తు ... ఒకసారి నీ టికెటే చెక్ చేస్కో ..." అని ఆవులిస్తూ చెప్పి పడుకుంది ...
ఇదెక్కడి గోలరా బాబూ అనుకొని .. ఇక లాభం లేదనుకొని "మీ టికెట్ చూపించండి .." అన్నాను ఆమెని మళ్ళీ లేపి ..
"ఏంటయ్యా బాబూ నీ గోల అర్థ రాత్రి ..." అంది చిరాగ్గా
"అప్పనంగా నా బెర్తు మీద పడుకోడమే కాకుండా నాది గోల అంటావా ... చూపించు టికెట్ .." అన్నాను నాకు తిక్కరేగి ..
"టికెట్ నా దెగ్గర లేదు ... మా ఆయన దెగ్గర ఉంది ..." అంది
"ఎక్కడున్నాడు మీ ఆయన ... " అన్నాను చుట్టూ చూస్తూ ..
"వేరే కంపార్టుమెంటులో ... " అంది ...
"అలాగా ... అయితే వెళ్లి టికెట్ తీసుకురా .. అప్పటిదాకా నేను ఈ బెర్తు మీదే కూర్చుంటా .."  అని ఆ బెర్తు మీద కూర్చున్నాను ...
ఆమె అసహనంగా నావైపు చూసింది ... నేను మటం వేసుకొని మరీ కూర్చున్నా ఆమె బెర్తు మీద ... ఇక తప్పదని లేచి వెళ్ళింది వాళ్ళ ఆయన దెగ్గరకు ... నాకు ఒక వైపు నిద్ర ముంచుకు వస్తుంది .. 'ఈ ఎదవ గోల ఏంట్రా బాబూ' అనుకున్నాను ...

ఒక పదినిముషాలు అయ్యాక వాళ్ళ ఆయనతో వచ్చింది ...
"ఇదిగోనండీ ఈ అబ్బాయే .. " అని నా వైపు చూపించింది ...
"చూడు బాబూ ... ఈ సీట్ మాదే .. ఇదుగో టికెట్ .." అని చూపించాడు ... నాకు మైండ్ బ్లాక్ అయ్యింది ... సేం సీట్ .. సేం కోచ్ ... హౌ .. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ...
"అదేంటి... ఇద్దరికీ ఒకే సీట్ ఎలా ఇచ్చారు .. " అన్నాను ఆశ్చర్యపోతూ ...
"మీ టికెట్ చూపించండి .." అన్నాడు వాళ్ళ ఆయన ... నేను చూపించాను .. తను కూడా చూసి, అవును నిజమే అని కాసేపు ఆశ్చర్యపోయాడు ...
"చూడు బాబూ ... తనకి వంట్లో కూడా బాలేదు .. తనని ఈ బెర్తులోనే పడుకోనివ్వు ... మీరు టీసీని వెళ్లి కలిసి చెప్పండి.. ఆయన మీకు ఇంకో బెర్తు అరేంజ్ చేస్తాడు .." అని ఒక ఉచిత సలహా పడేసి వెళ్ళిపోయాడు ...
నాకు మెంటలెక్కింది ... ఆ ఆంటీ ఏమో హాయిగా బెర్త్ ఎక్కి కునుకు తియ్యడం స్టార్ట్ చేసింది ...

నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు ... ట్రైన్ వేగంగా పరిగెడుతుంది.. లోపలా అంతా చీకటి ... ఇప్పుడు ఆ టీసీ గాడిని ఎక్కడ పట్టుకోవాలి ...
టీసీ గాడికోసం  వెదకడం మొదలెట్టాను... వాడు ఎక్కడా కనిపించలేదు ... నాకు ఓ వైపు నిద్ర... రెండో వైపు అసహనం ... మూడో వైపు కోపం .. నాలుగో వైపు నా మీద నాకే "థూ దీనెమ్మ జీవితం .." అనే ఫీలింగ్ కలగలిపి వచ్చాయి .. రైల్వే నాకోడుకులని బండ బూతులు తిట్టుకున్నాను  .... లల్లూ గాడి బొజ్జ భళ్లు మని పగిలిపోవాలి అని ఇష్టదైవాన్ని కోరుకున్నాను ...

ఏం చెయ్యాలో వెన్నపోక (పాలు ... పెరుగు .. ఇంతకముందే అయోపోయాయి .. సారీ), డబ్బులు పెట్టి సీట్ రిజర్వ్ చేసుకొని దిక్కులేని వాడిలా అటూ ఇటూ తోరుగుతున్న నా మీద నాకే ఓ క్షణం జాలి కలిగింది ... నాకే కాదు అక్కడ ఉన్న ఒక అబ్బాయికి కూడా జాలి కలిగింది అనుకుంటా .. "హలో ..." అన్నాడు ... ఆడు ఇంకా పడుకోలేదు అనుకుంటా 
"హాయ్ ..." అన్నాను 
"ఇందాక అక్కడ మీ కాన్వర్సేషన్ విన్నాను.. ఇద్దరికీ ఒకే సీట్ ఎలా ఇచ్చారో ఈ రైల్వే వాళ్ళు .. కంప్యూటర్లు కూడా తప్పులు చేస్తుంటే మనం ఏం చెయ్యగలం చెప్పు బాస్ .. " అన్నాడు
"నిజమే ... " అన్నాను
"మీరేమి కంగారు పడకండి ... పాపం మీకు బాగా నిద్ర వస్తున్నట్లుంది... మా దెగ్గర ఓ బెర్త్ ఖాళీగా ఉంది ... మేము నలుగురం రిజర్వ్ చేయించుకున్నాం .. కానీ మా ఫ్రెండ్ ఒకడు ట్రైన్ మిస్ అయ్యాడు .. సో మీరు ఆ బెర్త్ తీసుకోండి .." అన్నాడు
"అవునా ... చాలా థాంక్స్ బాసు ..." అన్నాను కృతజ్ఞతాపూర్వకంగా.. అప్పుడు వాడు నాకు అభయమిచ్చే ఆపత్భాందవుడిలా అనిపించాడు...
ఇక వాడు చూపించిన బెర్తులో పడుకొని ... ప్రొద్దున నడికుడి స్టేషన్ వచ్చాక దిగాను .. మధ్యలో టీసీ నాకొడుకు వస్తాడేమో నాలుగు కడిగేద్దాం అని చూసాను ... వాడు రాలేదు ...

                                                                   ***********
చార్టులో నా పేరు ఎందుకో లేదో బుర్ర బద్దలు కొట్టుకున్నా నాకు అర్థం కాలేదు...
రిజర్వ్ చేయించుకుంటే చార్ట్ లో ఉండాలి కదా ... ఎందుకు లేదు ... 
ఆ ప్రక్క ఊరిలో ఉండే మా మామయ్య వాళ్ళ అబ్బాయి పెళ్ళికి వెళ్తున్నాను అప్పుడు ... వాళ్ళ ఇంటికి వెళ్లానే కానీ నాకు ఇదే ఆలోచన ...
మా అన్నయ్య రైల్వే లో స్టేషన్ మాస్టర్ గా పని చేస్తున్నాడు .. ఆయన కూడా పెళ్ళికి వచ్చాడు .. ఆయన దెగ్గరికి వెళ్లి అడిగాను .. ఇలా నేను రిజర్వ్ చేసుకుంటే, నా పేరు చార్ట్ లో లేదు ... అదే సీట్ వేరే వాళ్ళకి అలాట్ చేసారు .. ఇలా ఎందుకు జరిగింది అని అడిగాను ...
"అలా జరగదు, ఏది నీ టికెట్ చూపించు .." అన్నాడు 
నేను చూపించాను ... ఆయన చాలా పరిశీలనగా చూసి బాగా ఆలోచించాడు ...
"నువ్వు ట్రావాల్ చేసింది నిన్న రాత్రి కదా .." అన్నాడు
"అవును.. కావాలంటే డేట్ చూడండి పదమూడు ఫిబ్రవరీ ..." అన్నాను 
"అవును ... కానీ నువ్వు ఇక్క ఒక పాయింట్ మిస్ అయ్యావ్ .." అన్నాడు
"ఏంటది .." అన్నాను
"నిన్న పదమూడే ... కానీ నీ ట్రైన్ తిరుపతిలో డిపార్చర్ అర్థరాత్రి పన్నెండు గంటల అయిదు నిముషాలకి .. అంటే ట్రావల్ డేట్ పద్నాలుగు అవుతుంది ... కానీ నువ్వు పదమూడుకి చేయించావ్ .. ఒక్క అయిదు నిముషాల గ్యాప్ లో డేట్ మారిపోయింది .. అది నువ్ గమనించలేదు .. చాలామంది ఇలాంటి తప్పులు చేస్తుంటారు ...రాత్రి ప్రయాణం అనగానే ఆ రోజు డేట్ కే రిజర్వ్ చేస్తుంటారు .. కానీ టైం కూడా గమనించాలి ... పన్నెండు దాటితే మరుసటి రోజు కింద లెక్కే కదా ... సో ఈ ఈవిధంగా నిన్న నువ్వు టికెట్ లెస్ ట్రావెల్ చేసావ్ .. టీసీ చూడలేదు కాబట్టి బతికిపోయావ్ లేకపోతే వాడు నీకు బాగా ఫైన్ వేసేవాడు తెల్సా .." అన్నాడు 
నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది ... మరొక్కసారి నా టికెట్ చూసుకొని ... ఆ ఆంటీ ని తలచుకొని "థూ దీనెమ్మ జీవితం.." అనుకున్నాను ..23 comments:

భాను said...

hahahah gud post:)

లత said...

భలే ఉందండీ మీ పోస్ట్
పాపం ఆ ఆంటీ

అమ్మాయి కళలు said...

హే కిషన్, ఇన్ని రోజులు పట్టింది పోస్ట్ రాయడానికి.. చాల బాగున్నది ని పోస్ట్. అప్పుడప్పుడు అల జరుగుతూ వుంటాయి. మనం ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్న. పాపం అ అంటి వాళ్ళ అయన నిన్ను ఎంత తిట్టుకున్నారో నిద్ర లేపినదుకు. నాకు కూడా ఇలానే జరిగింది. గోదావరి ఎక్కితే ఖమ్మం లో ఎవరో లేపారు ఇలానే నన్ను. పిచ్చ కోపం తో పచ్చి బూతులు తిట్టాలి అనుకున్న కానీ లేపింది సీనియర్ సిటిజెన్స్.
టికెట్ చూసి, తప్పు బోగి ఎక్కారు తాతగారు రండి మీ బెర్తులు చూపిస్తాను అని ఒక బాగ్ తీసుకోని ఒక 2 బొగిస్ దాటి వాళ్ళ బెర్తులు చూపించి వచ్చాను.
"ఏం చెయ్యాలో వెన్నపోక" నెక్స్ట్ ఏంటి నెయ్యి పోక, తరువాత కోవాపోక నా... మరిచి పోయాను మజ్జిగ ఒకటి వుంది.

కవిత said...

HE he he he.Baagayindi baagayindi.Ledante every week tingu ranga ani ooru velthava?Undu nee meda "maa" laalu uncle ki complaint istha.

Ayina chennai lo untu paalu,perugu poka antaventi..enchakka "sambar"poka no leka "rasam"pokano anali kaani.

మేధ said...

Hmm.. It happens...

మేధ said...

Hmm.. It happens...

sivaprasad said...

boss ippudu laluprasad kada railway minister, mamatha benarajee kada,

kavya said...

హ హ .. నీకు బాగా అయ్యిందిలే ;) ఈ సరి టికెట్ బుక్ చేయిన్చుకునేదపుడు నా లాంటి మేధావి సలహా తీస్కో .. ఫ్రీ ఫ్రీ ఫ్రీ :p

కొత్త పాళీ said...

సూర్యోదయం నించీ మళ్ళి సూర్యోదయందాకా ఒక రోజు అని లెక్కపెట్టుకునే భారతీయులు, అర్ధంపర్ధం లేని అర్ధరాత్రినించి కొత్తరోజుని లెక్కేసుకునే అంతర్జాతీయ ప్రమాణాలని ఫాలో అవాల్సి వస్తే మరి ఇలాగే జరుగుతుంది.

ఇందు said...

హ్హహ్హహ్హా..అయ్యో పాపం కిషన్...హెన్ని కష్టాలూ! నేను ఎప్పుడూ అందుకే జాగ్రత్తగా చూసుకుంటాగా టైమింగ్స్....ఇంకా నయం ఆ అబ్బయేవరో కనిపించి తన సీట్ ఇచ్చాడు...నువ్వుగానీ టీసీని వెతుక్కుంటూ వెళ్ళుంటే...దురదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళినట్టే! హ్మ్!నీ టైం బాగుండి...కరెక్ట్ టైమింగ్ కి టికెట్ బుక్ చేసుకోకపోయినా..బ్రతికిపోయావ్ :)) [చాలా కష్టపడి...'నువ్వు ' అనడానికి ట్రై చేసా కిషన్.మీరు అంటే ఇంక కొట్టేస్తావేమో అని :P]

శివరంజని said...

హహహహ కిషన్ గారు ...మీరు స్వాతి కి వెంకట్ సార్ కే తేడా గుర్థించలేదు ...

అయ్యా మీకు నాకు లా హడావిడి ఎక్కువనుకుంటా ...

టి.సి కి దొరికుంటే ప్చ్...... మంచి పంచ్ మిస్స్ అయిపోయామే

Anonymous said...

please watch & subscribe
http://bookofstaterecords.com/
for the greatness of our telugu people.

Kishen Reddy said...

భాను: థాంక్స్ :-)

లత: అవును పాపం అంటీ, అనోసరంగా ఆమెని లేపాను ..తర్వాత నిజంగానే ఫీల్ అయ్యాను

మోహన్: నిజమే ఆవిడ ఎన్ని తిట్టుకుందో .. మీరు తాత గారికి అలా హెల్ప్ చేసారా.. కీప్ ఇట్ అప్ ...

Kishen Reddy said...

కవిత: మీకు ఎందుకు అంట కుళ్ళు :( .. ఈ సారి సాంబార్ పోక ట్రై చేస్తాలె ..

మేధ: నిజమే ..

శివ: బాస్ ఇప్పుడు మమతానే, ఈ సంఘటన జరిగినప్పుడు లాలు .. అందుకే వాడిని తిట్టుకున్నా .. ఇప్పుడు వాడి ప్లేస్ లో మమత వచ్చిందని, తిట్లు ఈమెకి బదిలీ చెయ్యలేను కదా :-)

కావ్య: అలాగే మేడం .. ఈ సారి తమరి సలహా తీసుకుంటాను .. :)

Kishen Reddy said...

కొత్తపాళీ: హా హా భేషూగ్గా చెప్పారు .. నిజమే

ఇందు: హమ్మయా మొత్తానికి నువ్వు అంటున్నావ్ కష్టపడి అయినా .. ఇలాగే కంటిన్యు అయిపో అంతే .. నిజమే ఆ రోజు నా లక్ బాగుంది, లేకపోతే బుక్కే..

రంజని: నువ్వు మధ్యలో స్వాతీని లాగకు అంతే ... ఆయ్.. నీకు పంచ్ కావాలా?.. ఇస్తాను ఇస్తాను .. ఖచ్చితంగా ఇస్తా .. డోంట్ వర్రీ ..

అజ్ఞాత: అలాగే :)

ఆ.సౌమ్య said...

హహ మా ఫ్రెండుకి అచ్చు ఇలాగే జరిగింది, మీ పోస్ట్ మొదటి పేరా చదవగానే నాకు అర్థమయిపోయింది మీరు చెప్పబోయేదేమిటో...చిత్రంగా తన అనుభవం కూడా శబరి లోనే జరిగింది. కాకపోతే నేను చెప్పే కథలో తప్పు తనదేలెండి. నాకు ఇది చదివి బలే థ్రిల్లింగ్ గా అనిపించింది.

తను త్రివేండ్రం నుండి హైదరాబాద్ రావడానికి శబరిలో 11 వ తారీఖుకి టికెట్ చేయించుకుందామనుకున్నాడు, కానీ 11 కి దొరకక 10 కి చేయించుకున్నాడు. కాని మొదటినుండీ 11 అనుకోవడంతో అదే మైండ్ లో ఉండిపోయింది. గురుడు హాయిగా 11 ఉదయం లేచి (త్రివేండ్రం లో ఉదయం 6.00 కి బయలుదేరుతుంది) ట్రైన్ ఎక్కేసాడు. చార్టులో పేరు లేదేమిటా అని తనూ హాశ్చర్యపోయాడు. రైల్ ఎక్కేసి బెర్త్ దగ్గరకెళ్ళి మీలాగే తగవు కూడా ఆడాడు. ఈ గొడవంతా విన్న పెద్దాయన "బాబూ ఏదీ నీ టికెట్ ఒకసారి చూడనీ" అని చూసి నీది నిన్నటి ట్రైన్...అది వెళ్ళిపోయింది కాబట్టి రైల్ దిగు అన్నాడట. మా వాడు తెల్లమొహం వేసేసి టిసి దగ్గరకి పరుగెత్తాడు. ఆయనకి ఒక 500 సమర్పించుకుని బెర్త్ కంఫర్మ్ చేసుకుని హైదరాబాదు చేరుకున్నాడు. మాకేమో కంగారు...10 న బయలుదేరి 11 కి వస్తానన్నాడు, రాలేదు. ఓ పదేళ్ల కిందట సెల్ ఫోన్లు లేవు. ఏమి చెయ్యలో తోచక తను ఉండే చోటులో landline కి ఫోన్ కొట్టాం 11న. తను బయలుదేరిపోయాడండీ అని జవాబు. ఇక మాకు కాళ్ళు చేతులు ఆడలేదు. టెన్షన్ గా ఒకరోజంతా గడిపాం. మర్నాడు మధ్యాన్నం అంటే 12న మా వాడు రైల్ దిగి స్టేషన్ నుండే ఫోన్ చేసాడు...కంగారు పడకండి నేను వచ్చేసాను అని. తను వచ్చాక్ విషయం చెబితే మేమంతా ముందర బాగా తిట్టి తరువాత హాయిగా నవ్వుకున్నాం. :)

Kishen Reddy said...

హ హ సౌమ్యా.. పాపం మీ ఫ్రెండు కూడా నాలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు అనమాట ... ఇలాంటివి అపుడపుడు జరిగితేనే రెండో సారి వళ్ళు దేగ్గరపెట్టుకొని డేట్ గట్రా చూస్కొని ట్రైన్ ఎక్కుతాం .. వివరంగా మీ ఫ్రెండుకి జరిగిన సంఘటన రాసినందుకు ధన్యవాదాలు ...

Anonymous said...

Post chala bagundhi.Kastha thondhara ga post chesthu undanadi.Miss u chanti.

Radha said...

hello kishan garu.. happy new year to u... enti ika christmas / new year holidays avvaleda?

Kishen Reddy said...

Anony: :) Miss you too :)

Radha: Same to you :). Holidays ayipoyai, ee roju nunche malli back to office and back to blogs :)

Sirisha said...

oh time chala bagundi anukokunda tittukovadam enduku..between good info :)

స్ఫురిత said...

హ హ హ Good post
వెన్న పోలేదు...హ హ హ

sriharsha said...

వావ్ చాలా బావుంది మీ పోస్ట్ ..........