ఇప్పుడే "ఏమైంది ఈ వేళ" సినిమా చూశాను ... వెంటనే నాకు అనిపించింది "అసలు ఏమైంది నాకీ వేళ ..పిచ్చెక్కిందా" అని....
ఆ సినిమా చూసి మెంటల్ ఎక్కి ఈ టపా రాస్తున్నా, సో ధైర్యం ఉన్న వాళ్ళే చదవండి.
అసలు ఆ సినిమా ఏంటి ... ఆ క్యారక్టర్స్ ఏంటి??... అసలు ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్తే తలెత్తుకొని ఆ సినిమా చూడగలదా?.. టైటిల్ మాత్రం "ఏమైంది ఈ వేళ?"... సినిమా మొత్తం బూతు కావ్యం... ఎండింగ్ లో కొంచెం క్లాస్ కోటింగ్ ... చిన్న షుగర్ కోటింగ్ లాంటిది అన్నమాట ...
అసలు శేఖర్ కమ్ముల గాడ్ని పట్టుకొని తన్నాలి, ఆ తొక్కలో వరుణ్ సందేశ్ గాడ్ని హీరో చేసినందుకు ... వాడు హీరో ఎంటండి బాబూ ... ఇన్ని సినిమాలు చేసినా, అన్నిట్లో ఒకే యాక్షన్ ... వాడిది ఒక్క సినిమా చూసి, మిగతా సినిమాలు చూడక్కర్లేదు ... ఈ సినిమాలో వాడ్ని చూసి ఒక కామ పిశాచిని చూసినట్లు అనిపించింది నాకు ... థూ ఇంకా వాడిని స్క్రీన్ మీద చూడాల్సిన ఖర్మ ఏంటి మనకు ...
ఇక పోతే ఆ డైరెక్టర్ ... వాడి పేరేంటో గుర్తురావట్లేదు, నిజంగా వాడు నాకు కనిపిస్తే, వాడ్ని చంపేసి నేను జైలు కెళ్ళిపోతా హ్యాపీగా ... థూ వాడి జీవితం... ఒక సినిమాని ఎలా ఎగ్జిక్యూట్ చెయ్యాలో తెలియకపోయినా పర్వాలేదు, కానీ అసభ్యకరంగా చూపించి సినిమాని నెట్టుకురావాలనుకోవడం ఉంది చూసారూ... దానికి వాడిని ఏం చేసినా పాపం లేదు... ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో అసభ్యం లేదని నేను అనట్లేదు, కానీ దీనిలో ఆ చెత్త డైరెక్టర్ ఆ అసభ్యతని చూపడానికి ఎన్నుకున్న మార్గం నిజంగా నీచం... అమీర్పేట హాస్టల్స్ లో ఉండే అమ్మాయిల మీద ఆ బూతు జోకులు ఏంటి??... అమీర్పేట అమ్మాయిలందరూ ఆ టైపు అని తీర్మానించేశారు ఈ సినిమాలో... అమీర్పేటలో ఉండే అమ్మాయిలందరికీ తప్పనిసరిగా బాయ్ ఫ్రెండ్స్ ఉండాలంట... వాళ్ళు అర్థ రాత్రుళ్ళ దాకా ఫోనులో ముద్దులు పెట్టుకుంటూ ... ఫోన్ శృంగారం చేసుకుంటారట... రాత్రుళ్ళు బాయ్ ఫ్రెండ్స్ రూముల్లో గడిపి వస్తారట ... రాత్రుళ్ళు రోడ్ల మీద చీకటిగా ఉన్న ప్లేసుల్లో ముద్దులు ముచ్చట్లు వగైరాలు ... ఇంటర్నెట్ కేఫుల్లో సరసాలు ఆడుకుంటారట... ఇంకా ఎన్నో... హీరోయిన్ మొదటిసారిగా హాస్టల్ కి వచ్చినప్పుడు ఆ హాస్టల్ లో ఉండే అమ్మాయి ఏమంటుందో తెల్సా.. "బాయ్ ఫ్రెండ్ ఉండటం... అతనితో తిరగడం.. రాత్రుళ్ళు గడిపి ప్రొద్దున రావడం .. అర్థ రాత్రుళ్ళు గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడటం... రూమ్ లో సెక్స్ గురుంచి చీప్ గా మాట్లాడుకోవడం ... ఇవన్నీ ఒక అమ్మాయికి అమీర్పేట్ హాస్టల్ కి వచ్చేదాకా ఉండవట... వచ్చిన తర్వాత అవే ఉంటాయట ..." పైగా "ఇంత స్టాండర్డ్ స్టాట్స్ మైంటైన్ చేస్తున్నావ్ నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ లేడా" అని అడుగుతుంది హీరోయిన్ ని ... అసలు ఆ డైలాగ్ ఏ రకమైన మెసేజ్ పంపుతుంది యూత్ కి... ఆ హాస్టల్ లో ఒక అమ్మాయి ఉంటుంది "అరియో బుడ్డీ ..." అని ఎదో అటుంటుంది... దాన్ని చూస్తే నాకు గూబ పగలగొట్టబుద్దవుద్ది ..
ఆ హాస్టల్ లో ఉండే ఒక అమ్మాయి ప్రొద్దునే రూమ్ కి వస్తే "నైట్ అంతా ఎక్కడున్నావ్ " అని హీరోయిన్ అడిగితే ... " నా బాయ్ ఫ్రెండ్ రూమ్ లో ఏ/సీ ఉందని అక్కడే పడుకున్నాను " అని చెప్తుంది ...అసలు ఆ సినిమా చూసాక, ఎవడైనా అమీర్పేట్ హాస్టల్ లో ఉన్న అమ్మాయి అంటే, ఎలా చూస్తాడు ... ఒక ఐటం లా చూస్తాడా లేదా?.. పైగా చివరిలో హీరో "హైదరాబాద్ లో ఉండే అమ్మాయిల్లో ఒక్కతి కూడా వర్జిన్ ఉండదు, మీ అమీర్పేట్ హాస్టల్ గురుంచి ఇంక అసలు చెప్పాల్సిన పని లేదు" అంటాడు... అప్పుడు మన హీరోయిన్" అమీర్పేట హాస్టల్ అమ్మాయిల గురుంచి చీప్ గా మాట్లాడకు ... నేను ఊరుకొను.." అంటుంది... అప్పటిదాకా అమీర్పేట హాస్టల అమ్మాయిలందరూ _____ లు అని చూపించిన దర్శకుడు, హీరోయిన్ చేత ఆ మాట అనిపించి తను ఏమీ తప్పుగా చూపించలేదు అని చెప్పలనుకున్నాడేమె...ఒక మైండ్ లెస్ డైరెక్టర్ తీసిన చీప్ సీన్స్ కి అమీర్పేట్ లో ఉండే అమ్మాయిలు ఎందుకు శిక్ష అనుభవించాలి ... అమీర్పేట్ లో ఉండే అమ్మాయిలే కావచ్చు, మరే ఇతర హాస్టల్ అమ్మాయిలు అయినా కావచ్చు, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్లది .. అందరూ అలాంటి వాళ్ళే అయ్యి ఉండాల్సిన పనిలేదు... అలాంటప్పుడు అందరినీ ఒక గాటిన కట్టేసినట్లు అమీర్పేట అమ్మాయిలందరూ అలాంటి వాళ్ళే అని ఒక సినిమాలో చూపించడం ఎంత వరకు సమంజసం... అసలు కొంచెం అయినా సామాజిక స్పృహ ఉందా ఆ దర్శకుడికి ...
ఇకమిగతా విషయానికి వస్తే హీరోయిన్.. ఎంత దరిద్రంగా ఆమె క్యారక్టర్ డిసైన్ చెయ్యాలో అంత దరిద్రంగా చేశాడు ... ఒకసారి కాఫీకి కలుస్తారు హీరో హీరోయిన్లు ... అంతే వాళ్ళ ఫ్రెండ్షిప్ డవలప్ అయిద్ది ... ఇక్కడ నోట్ చెయ్యాల్సిన పాయింట్ .. ఫ్రెండ్షిప్ ... ఆ ఫ్రెండ్షిప్ గొడుగు కింద ...వాళ్ళిద్దరూ అర్థ రాత్రుళ్ళ దాక ఫోన్లు ... లేట్ నైట్ కలిసి రోడ్డు మీద తిరగడాలు ... హీరో అర్థ రాత్రి హీరోయిన్ హాస్టల్ కి వచ్చి ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు .. ఆమె ఆనందంగా వెళ్తుంది ... తర్వాత ఓ రోజు ఇంటర్నెట్ కేఫ్ లో ఆమె శరీరాన్ని పలు రకాలుగా ఆస్వాదిస్తాడు ... ఆమె ఆడ్డు కూడా చెప్పదు ... ఇంకో రోజు, కార్ లో ఎక్కడికో తీసుకెళ్ళి ... ఇరవై రెండేళ్లు ఆగాను, ఇక ఆగలేను అని ఆమెకి ముద్దు పెడతాడు ... ఆ తర్వాత పైత్యం ఇంకాస్త ముదిరి, వాడి రూమ్ మేట్ తో అంటాడు "నువ్వు ఆ రోజు రూమ్ కి తెచ్చుకున్న అమ్మాయికి ఫోన్ చెయ్యి, ఇక నా వల్ల కాదు నేను అర్జెంటుగా పాడాయిపోవాలి..." అని ... మరో రోజు హీరోయిన్ తో అంటాడు "ఇన్ని చేసాక, నేను తట్టుకోలేకపోతున్నాను... నాలో ఏవో రసాయనాలు ప్రవహిస్తున్నాయి ... మనం తప్పు చేసేద్దామా.. మా రూమ్ కి వస్తావా?" అంటాడు ... ఇక్కడ హీరోయిన్ వెంటనే "ఎస్ డార్లింగ్ చేసేద్దాం" అంటే హీరోయిన్ని మరీ ____ అనుకుంటారేమో అనుకున్నాడేమో డైరెక్టర్, ఆమెకి తర్వాత రోజు మార్నింగ్ దాక టైం ఇచ్చాడు ... ఆ తర్వాత రోజు మార్నింగ్ హీరోయిన్ హీరోకి కాల్ చేసి.. "సరే... ప్రేగ్నేసి ఏమీ రాదు కదా... " అంటుంది .. ఇక మన వాడు ఊరుకుంటాడా ... "అసలు అలంటి భయాలు నీకు అవసరం లేదు.." అన్నట్లు మాట్లాడి ... ఆమెని తన రూమ్ కి రప్పించుకొని ... ఆ తప్పు ఎదో చేసేస్తాడు .. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే, హీరో హీరోయిన్ అప్పటిదాకా ప్రేమించుకోలేదు ... కనీసం లవ్ అనే టాపిక్ కూడా వాళ్ళ మధ్య రాలేదు... జస్ట్ ఫ్రెండ్స్ అనమాట ... కాని అన్ని పనులు కానిచ్చేసారు ... అంటే ఏంటి, ఫ్రెండ్షిప్ ముసుగులో ఎలాంటి పనులు అయినా చేసెయ్యొచ్చు అన్నమాట ... అది ఇక్కడ మన గ్రేట్ డైరెక్టర్ గారు చెప్పదలచుకున్న విషయం ... ఒక ఫ్రెండ్షిప్ ని ఇంత కన్నా నీచంగా చూపించడం మీరు చూసారా?.. విచిత్రం ఏమిటంటే పని పూర్తయ్యాక ... హీరో గారు హీరోయిన్ కి ప్రపోస్ చేస్తారు ... ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటి ఉందా... అప్పటివరకు ఆమెతో ఎంజాయ్ చెయ్యాలనే మోటివ్ తో ఉన్న వాడు, పని పూర్తయ్యాక పెళ్లి చేసుకోమని ప్రపోస్ చేస్తాడుట.... ఈ సీన్ లో తెలిసిపోతుంది అసలు ఆ డైరెక్టర్ గారి ప్రతిభ ఏంటో??.. సమాజంలో సవాలక్ష జరగొచ్చు, కానీ స్క్రీన్ మీద రియల్ లైఫ్ ని ప్రోజెక్ట్ చేసేప్పుడు కొంచెం సామాజిక స్పృహ కూడా ఉండాలి ...
అసలు ఈ సినిమా మొదటి నుంచి చివరి దాకా ఇలా చీప్ సీన్స్ తో నడిపించాడు ఆ దర్శకుడు .... బాబు నువ్వెవరో గాని నీకు శతకోటి దండాలు ... ఇంకెప్పుడు సినిమాలు తియ్యకు ... తీసినా కొంచెం చూసే జనాలని కూడా దృష్టిలో పెట్టుకో ... ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఈ కళాఖండం చూస్తున్నారు అనుకోండి, వాళ్ళ మధ్య ఉన్న అమ్మాయి ఖర్మకాలి అదే అమీర్పేట హాస్టల్ లో చదువుతుంది అనుకొండి... అమీర్పేట కాకపోతే అంబరుపేట.. ఏదో ఒక హాస్టల్ లో చదువుతుంది అనుకోండి... ఆ సినిమా చూస్తున్నప్పుడు వచ్చే సీన్స్ ని చూసి ఆ తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయి గురుంచి ఏమనుకుంటారు ... ఎలా కంగారు పడతారు?? ..ఇక ఈ అమ్మాయి సిగ్గుతో ముఖం ఎక్కడపెట్టుకోవాలి??... అసలు ఈ సినిమా చూసాక అబ్బాయిల దృష్టిలో అమీర్పేట హాస్టల్ అమ్మాయిలు అంటే వాళ్ళు ఎంత చీప్ గా చూస్తారో మీ విజ్ఞతకె వదిలేస్తున్నా... అసలు అవి నిజంగా జరుగుతూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు... కానీ అవి అలా శక్తివంతమైన సినిమా మాధ్యమం ద్వారా చూపించడం ఎంత వరకు సమజసం... అది ఎలాంటి ప్రభావాన్ని యువతపై చూపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి ... అసలు ఈ సినిమాలో ఒక్క అమ్మాయికి కూడా క్యారక్టర్ ఉన్నట్లు చూపించలేదు ఆ దర్శకుడు, ఇక మీరు అర్థం చేసుకోవచ్చు ఆ సదరు దర్శకుడి చీప్ మెంటాలిటీ ...
నాకు నచ్చిన ఒకే ఒక్క విషయం ఈ సినిమా ఆవుట్ లైన్ స్టోరీ ... బట్ స్టోరీని ఎదో మొదటిలో చివరిలో టచ్ చేసి మిగతా మొత్తం ఈ బూతుతో నడిపించాడు ఆ గొప్ప దర్శకుడు... పెళ్లి చేసుకొని పరస్పర ఈగోల వల్ల విడిపోయిన జంట, తరువాత తమ కొత్త పార్టనర్స్ ని సెలెక్ట్ చేసుకునే క్రమంలో తమ మధ్య దాగి ఉన్న తమ ప్రేమని గుర్తించి, మళ్ళీ కలుసుకుంటారు ఇదీ స్తూలంగా కథ... ఇదే కథని ఏంతో అందంగా, సరయిన భావోద్వేగాలతో తెరకెక్కిస్తే ఒక గొప్ప సినిమా అవుతుంది... బహుసా అది ఆ దర్శకుడికి చేతకాలేదేమో, ఈ కథని నడిపించడానికి ఏవేవో చీప్ ట్రిక్స్... చీప్ సీన్స్ ... చీప్ క్యారెక్టర్స్ ని పెట్టాడు ... చివరికి సినిమా చూసిన వాళ్ళకి ఒక అసభ్యకరమయిన సినిమా చూసిన ఫీలింగ్ కలగకమానదు... ఈ సినిమా చూసిన చిరాకు...తిక్క...మైండ్ బ్లాక్.... మెంటల్ లాంటి వివిధ వివిధ ఫీలింగ్స్ మధ్య ఈ పోస్ట్ రాశాను ... మీకు చదవడానికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తే సారీ.... బట్ నాకు చెప్పాలనిపించింది ... చెప్పాను ....
---- మీ రామకృష్ణ
24 comments:
baa raasavu guroo...i understand your agony and i feel sorry for you being a victim of this movie
ఇంతోటి సినిమాని చివరిదాకా చూశారా? నేనైతే మొదట్లోనే వాకౌట్ చేద్దును.
Agreed.. వరుణ్ సందేశ్ సినిమాలు, ఈ సినిమా చూశాక మీకు వచ్చిన అసహ్యం.. Totally agreed with your views
హ్హహ్హ...హ్హా. మీ పోస్టు బిగినింగ్ బాగుంది. ఆ వరుణ్ సందేశ్ గాడ్ని చూస్తే నాకూ అంతే భలే చిరాకు. వాడూ, వాడి డైలాగ్ డెలివరీ. తన్నాలనిపిస్తుంది.
నేనీ సినిమా చూడలేదు కానీ మీ సమీక్ష చదువుతూంటే మీకు కలిగిన ఆవేశమే నాకు కలుగుతోంది.మరీ ఇంత ఘోరంగా కూడా తీస్తున్నారా సినిమాలు.ఇక నయాపైసా ఆక్టింగ్ రాని వరుణ్‌సందేశ్ గురుంచి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది
I just read your post. I firmly decided not to see this movie...ever.
Thanks for going through the pain of watching this junk movie and warning us in advance.
~Sasidhar Sangaraju
www.sasidharsangaraju.blogspot.com
అజ్ఞాత: థాంక్స్... ఇలాంటి చీప్ సినిమాలు చేసి సొమ్ము చేసుకోవాలనే మెంటాలిటీ ఎప్పటికి మారుతుందో ..
మినర్వా: అదృష్టవంతులు ... నేను ఎంత చెత్త సినిమా అయినా చివరి దాకా చూస్తాను .. అసలు ఆ చెత్త కూడా ఎంత చెత్తగా తీసారో తెలుసుకోవాలి కదా .
కృష్ణప్రియ: థాంక్స్ ... ఇక వాడిని మనం భరించలేము .. we have reached the saturation point.
తేజస్వీ: హా హా నిజమే ... థాంక్స్ :-)
శ్రీకాంత్: ఏం చేస్తాం ఇలాంటి సినిమాలు చూడాల్సి రావడం మన దౌర్భాగ్యం.. ఇలాంటి సినిమాలు సమాజం మీత ఎంత చెడు ప్రభావం చూపిస్తుంది అసలు .. ఆమాత్రం సామాజిక స్పృహ లేకపోతే ఎలా?
శశిధర్: థాంక్స్ .. ఈ సినిమా చూడకుండా ఉండలనుకోవడం చాలా మంచి నిర్ణయం.
ఆ వరుణ్ సందేశ్ గాడ్ని చూస్తే నాకూ అంతే భలే చిరాకు. వాడూ, వాడి డైలాగ్ డెలివరీ. తన్నాలనిపిస్తుంది. good analasis kihan ji ...how r u
సినిమా బాలేదా కిషన్ గారు .. ఎంతైనా హీరోయిన్ మీ కాజల్ డార్లింగ్ చెల్లెలు కదా అందుకే చివరిదాకా చూసి ఉంటారు
కిషన్
మీ బాధ అర్ధం అయ్యింది. నేను అయితే ఎలాంటి సినిమాని ౩౦ నిముషాలు కన్నా ఎక్కువ భరించలేను.
అయినా డైరెక్టర్ ఒక్కడే కాకుండా, మాటలు, కథ రాసిన వాళ్ళని కూడా , తీసిన నిర్మాతని కూడా వెలి వెయ్యాలి. ఇలాంటి సినిమాల్లో సెన్సార్ వాళ్ళు ఏమి ఏడుపు ఏడుస్తారో.
BTW, నాకు వరుణ్ సందేశ్ తో బాధ లేదు, ఎందుకంటే తనవి మొదటి సినిమా తప్ప ఇంకేమి చూడ లేదు. :-) మా పాప 6 ఏళ్ళు, తనకి చాలా ఇష్టం, ఎందుకంటె హ్యాపీ డేస్ వల్ల.
పద్మవల్లి
శివ: మీకు కూడా నాలాగేనా ... థాంక్స్ :-)
రంజనీ: బాగాలేదనే కదా రాసాను ... మళ్ళీ బాలేదా అని అడిగితే, సినిమా మొత్తం చూసి హీరోకి హీరోయిన్ ఏమవుద్ది అని అడిగిందట ఆవిడెవరో ;-)
పద్మవల్లి: నిజమే ఈ సినిమా ఇలా తయారవ్వడానికి అందరూ బాధ్యులే ... సెన్సార్ వాళ్ళు ఉన్నారా లేరా అనే డౌట్ వస్తుంటుంది ఇలాంటి సినిమాలు చూస్తుంటే ..
బాగా కడిగేసారు. నేను సినిమా చూడలేదుగానీ అలా అమీర్పేట అమ్మాయిల గురించి ఏదో అసభ్యంగా వాగించారని విన్నాను....దరిద్రులు. సామాజిక స్పృహ అంటూ మీరు పెద్ద పదాన్ని వాడేసారు. ఆ పదానికి వాళ్ళకి అర్థం తెలిస్తేగా. అసలు నిజంగా ఆ పదానికి అర్థం తెలుసుకుంటే తెలుగులో సగానికి పైగా సినిమాలు తీయకుండా ఉండాలి.
వరుణ్ సందేశ్ విషయంలో నేను మీ అందరితో ఏకీభవిస్తున్నా. వాడు, వాడి డైలాగ్ డెలివరీ, మేనరిజంస్...యాక్ యాక్. నవ్వుతున్నడో, ఏడుస్తున్నాడో కూడా తెలీదు....నిజంగా వాడో పెద్ద చెత్త.
I completely agree with you.
అసలు ఆ దర్శకుడి ఉద్దేశం ఏంటి? ఇవన్నీ మామూలే అనా? అందరూ ఇలానే ఉంటారనా? ఈ సినిమా చూసిన వాళ్ళలో కొంతమందికైనా ఇలా అనిపించదా? ఇలాంటి అభిప్రాయాలతో వాళ్ళు కూడా తప్పుదోవ పట్టే అవకాశం ఉంది కదా.
సినిమా తేసేటప్పుడు కొంచెం కూడా ఆలోచించారు సమాజం మీద అది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో. సెన్సార్ వాళ్ళు మాత్రం ఏమి చేస్తారు? డైరక్టుగా బూతు పదాలు, దృశ్యాలు ఏమి చూపించరు. సో అడ్డు చెప్పే అవకాశం ఉండదు.
I can understand ur feelings and y u used such harsh language.
ఒక సారి నేను కూడా పూరి జగన్నాథ్ మీద చిరాకులో చాలా రాసేసాను.
ఒక ప్రాబ్లమ్. సినిమా చూడక బ్రతికిపోయిన వాళ్ళు కూడా ఈ పోస్టు చూసి బలైపోతున్నారే అని!
సినిమాలో చెప్పాడు సరే, చాలా మందికి తెలుసు సరే, ఐనా తెలీని నా లాంటి వారికి కూడా ఫలానా ప్రాంతం అనీ, ఫలానా రకంగా అసభ్యత చూపించారనీ ఇప్పుడు తెలిసిందే!
మీకు నచ్చలేదు కాబట్టి frustration expect చేశాను కానీ చదివే వారికి సినిమా చూపిస్తారనుకోలేదు :(
ఏమిటో, సినిమాలను ఏకి పారేస్తుంటే రివ్యూలను, రివ్యూయర్లను ఏకి పారేస్తున్న వారింకొందరు.
హారంలో వ్యాఖ్యలు చూడాలంటే భయంగా ఉంది.
మొత్తానికి ఏదో ఒక విధంగా చండాలానికి బలి కావలసి వస్తోంది :(
మీ పోస్ట్ చదివాను..చాలా చిరాకేసింది..బాధేసింది కూడా...అమీర్పేట అమ్మాయిల గురించి ఏం తెలుసంట ఆ దర్శకమహాశయులవారికి? ఎక్కడో ఏదో జరిగితే...దానికి అందరినీ భాద్యులు చేస్తారా? ఇంకా ఆ వరుణ్ ఒకడు!నాకు హాపీడేస్లోనే వాడి ఆక్టింగ్ చూసి వాంతి వచ్చింది.వాడు ఒక హీరో!కనీస ఇంగితం కూడ లేని ఇంకో పిచ్చోడు డైరెక్టర్!!వహ్!ఏం సినిమా అండీ...చూసి భరించిన మీ ఓర్పుకి జేజేలు :)
సౌమ్య: బాగా చెప్పారు .. ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి, కానీ ఈ సినిమాలో మరీ explicit గా చూపించాడు, ప్లస్ ఒక ఏరియా వాళ్ళు అంటూ categorize చేసి అసభ్యాన్ని చూపించడం మరీ చెండాలం..
ప్రవీణ్: కరెక్ట్ గా చెప్పారు ... థాంక్స్
లలిత గారు మీ బాధ నేను అర్థం చేసుకోగలను .. నేను కూడా అంత explicit గా రాసి ఉండకూడదేమో, కానీ ఆ సినిమా చూసిన frustration లో అసలు ఇంత దారుణంగా సినిమా తీసాడు అని చెప్పడానికి నా పోస్ట్ లో సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ చెప్పడం జరిగింది .. అంతే కానీ వేరే ఉద్దేశ్యం ఏమీ లేదు, మీకు బాధ కలిగిస్తే క్షమించగలరు ..
ఇందు: ఏం చేస్తాం ఖర్మ కాలి ఆ సినిమాకి వెళ్ళాం :-(
నాకు ఏమైందీ ఈ వేళ. మీ బ్లాగ్ కి తొలిసారిగా వచ్చి ఈ రివ్యూ చదివి కళ్ళు బైర్లుకమ్మాయి.ఇలాంటి సినిమాలు చూడటం మీకు ఇదే మొదలు కాబోలు. చాలా ఆవేశం తెచ్చుకున్నారు. మా జీవితం లో ఇలాంటివి చాలా చాలా చూసి ఆవేశం కూడా అణిగిపోయింది.
హీరోయిన్ కారెక్టర్ గురించి చెపుతూ మీరు దాని కారెక్టర్ అని రాశారు. కాస్త అదొక్కటి సరి చేద్దూరు..మీ ఉద్దేశం మంచిదే అని నాకు తెలుసు. చెప్పాలనిపించి చెప్తున్నాను.
Avunu kishan,Just TV lo chupinche trailers chusthene a Movie entha ghoranga undo artham avuthundi.
chaala baaga raasaarandi..
naa karma kaali engagement ayyaka maa would be tho ee movie chuudalsi vacchindi.. chuusthunnantha sepu entha chandaalamga anipinchindoo cheppalenu...
hostel lo vunde ammailantha alaage vuntaarani cheppadaaniki valleavaru?
BTW aa director dorikithe naaku kooda cheppandi...
Indira.
anduke kishan gaaru trailers chusina tarvata chuse dhairyam cheyaledu
Em raasav boss, Chaala bagundi. Film makers ku kachitam ga social responciblity undaali.
ivvale choosa mee blog ni.. baagunnai posts.. ee post lo mee baadha antha kanipinchindi... meeru bayataki cheppagaligaaru papam entho mandi cheppe medium leka bharinchi untaaru papam... ilaane meeru marinni chetta cinemalu choosi janaalaki reviews ichi kaastha samaaja seva cheyyalani aasisthunna..... :D
gud luck
agreed with lalitag...
మీ post కదా అని చదివితే cinema లో వున్న చెత్త అంతా చెత్త అంటూనే మళ్ళీ రాయటం ఎందుకండీ
Post a Comment