Saturday, October 30, 2010

కిషన్, The S.P.L and ఒక పిల్ల దెయ్యం

ఒక వ్యక్తి తన దేశానికి తాను ప్రధాని అయితే, ఎంత గొప్పగా ఫీల్ అవుతాడో తెలియదు కాని, మా స్కూల్ కి నేను ఎస్పీయల్ (S.P.L.) అయినప్పుడు మాత్రం అంతకు పది రెట్లు ఎక్కువ గొప్పగా ఫీల్ అయ్యాను... దానికి కారణం, స్కూల్ లో మనకు హీరో ఇమేజ్ రావడంతో పాటు, పదవ తరగతి అంకుల్స్ ఉండగా తొమ్మిదో తరగతిలో ఉన్న నేను ఎస్పీయల్ కావడం.. పదవ తరగతిలో ఉన్నవాళ్ళకు అప్పటికే మీసాలు గడ్డాలు రావడంతో, తొమ్మిదో తరగతిలో ఉన్న మేము ఇంకా పాల బుగ్గల పసి మొగ్గలుగా ఉండటంతో, వాళ్ళు మాకు అంకుల్స్ గా కనపడే వాళ్ళు...

ఎస్పీయల్ గా స్కూల్ కారిడార్ లో ఠీవీగా నడిచివెళ్తుంటే, ఎదురుగా వచ్చే అంకుల్స్ అసూయ జ్వాలలు నా మీద ఎగసిపడుతుంటే, కాలర్ మెలిపెట్టి కళ్ళెగరేసి వాళ్ళకు కుళ్ళుపుట్టిస్తుంటే, పళ్ళ కింద పళ్ళు కొరుకుతూ వాళ్ళు చేసే పటపట శబ్దానికి నేను వ్యంగ్యంగా నవ్వుకుంటూ లేని మీసాన్ని గర్వంగా  మెలెయ్యడంలో ఉన్న మాంచి కిక్ ఏంటో తెలిసొచ్చింది...

మా స్కూల్ లో ఎస్పీయల్ పోస్టుకి స్టూడెంట్స్ వోటింగ్ ఉండదు, టీచర్స్ ఏకగ్రీవంగా ఒక స్టూడెంటుని ఎన్నుకుంటారు.. మా స్కూల్ ప్యూన్ నుంచి ప్రిన్సీ దాకా నేనంటే ఒక మంచి వోపీనియన్ ఉండబట్టి (అదెలాగో నాకు ఇప్పటికీ అర్థం కాదు.. ఒకవేళ నేను మరీ బుద్దిమంతుడిలా నటించాల్సిందిబోయి జీవించానేమో..), ఆ వోపీనియన్ నాకు ఎస్పీయల్ పోస్టు తెచ్చిపెట్టింది....

అప్పటిదాకా సీపీయల్(C.P.L.) గా సంతృప్తి చెందిన నేను ఎస్పీయల్ అవ్వడంతో నాలో కర్లాన్ పరుపు మీద కునుకు తీస్తున్న "ఒకేఒక్కడు" "భారతీయుడు" నిద్రలేచారు... లేచీ లేవడంతోనే మొహం కూడా కడుక్కోకుండా తమ ఆకలి తీర్చమని నన్ను పోరుపెట్టారు... ఇక నేను రెచ్చిపోయాను.. ఎస్పీయల్ అయిన రెండో రోజు నుంచే ఒకటవ క్లాస్ సీపీయల్ నుంచి తొమ్మిదవ క్లాస్ సీపీయల్ దాక రోజుకి ఒకడిని పిలిచి అత్యవసర సమావేశం నిర్వహించేవాడిని... ఆకస్మిక తనికీలు చేసేవాడిని ....

"మీ క్లాస్ లో పాస్ పర్సెంటేజ్ ఎంత?" అని ఒకటో క్లాస్ సీపీయల్ ని అడిగితే, వాడు నోట్లో వేలు పెట్టుకొని బిత్తరచూపులు చూసేవాడు... "ఖాళీ పీరియడ్స్ లో ఏం చేస్తున్నారు?" అని రెండో తరగతి సీపీయల్ ని అడిగితే, "గోల చేసే వాళ్ళ నేమ్స్ రాస్తున్నా సార్.." అని వాడు అనడంతో "గుడ్... ఆ నేమ్స్ తెచ్చి నాకు చూపించు రేపటినుంచి.." అన్నాను... మరుసటి రోజు నేను క్లాస్ లో "స్కూల్ అభివృద్ధి, అందుకు అవలంభించాల్సిన పద్దతులు" అనే ఆర్టికల్ చదువుతుంటే రెండో తరగతి సీపీయల్ వచ్చి "సార్ నేమ్స్" అన్నాడు.. ఆ లిస్టులో యాభై మంది ఉన్నారు.. లేనిది ఆ సీపీయల్ గాడోక్కడే.. నాకు తిక్కరేగింది..ఆగ్రహోద్రుడినై ఆవేశంతో ఎగేసుకొని రెండో తరగతికి బైల్దేరాను..

అక్కడ సీన్ చూసి చిర్రెత్తింది నాకు.. అందరూ పిచ్చా పాటీ మాట్లాడుకుంటున్నారు.. ఒక పిల్లేమో ఇంకో పిల్ల జుట్టు పట్టుకొని పీకుద్ది...ఇదేమో దాని బుక్ లాగేసుకొని గిరాటేసి కొట్టుద్ది... ఒకడేమో పలక మీద బొమ్మేసుకుంటుంటే ఇంకొకడొచ్చి తుపుక్ మని ఆ బొమ్మ మీద ఊసి నవ్వుతాడు..వీడికి ఎక్కడో కాలి వాడి చేతి మీద కోరుకుతాడు...దాంతో వాడు సైరన్ అందుకుంటాడు.. ఒక పిల్లేమో నోట్ బుక్ అట్టమీది హీరోయిన్ బొమ్మకి మీసాలు గీస్తుంటే, ఇంకొకత్తేమో దీని జడ విప్పి మళ్ళి వెయ్యడం మొదలెడుతుంది... వాళ్ళని అలా చూసాక నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు...వెంటనే క్లాస్ లోకి దూకి, అందరినీ దాటుకుంటూ బోర్డ్ దెగ్గరికి వెళ్లి కళ్ళుమూసుకొని... సై...లె...న్స్... అని క్లాసులు పిక్కటిల్లేలా అరిచాను.. నా గాండ్రింపుకి అక్కడి గండుచీమ కూడా చలించలేదు... ఆల్రడీ నాకు వాళ్ళని చూసి పుచ్చకాయ సైజులో పిచ్చి ఎక్కి ఉండటంతో ఆవేశంగా అటూ ఇటూ చూసాను.. 

అక్కడ ఒక పిల్ల కాళ్ళు బార్లా చాపుకొని ఒక పెళ్లి కూతురి బొమ్మకి బొట్టు పెట్టి తలదువ్వుతుంది... నేను ఆ పిల్ల దెగ్గరికి వెళ్లి ఆ బొమ్మ లాక్కొని విసిరికొట్టి హిహ్హిహ్హి అని వికటాట్టహాసం చేసాను.. ఆ పిల్ల మిడిగుడ్లేసుకొని నన్నే చూస్తూ ఎవరో స్విచ్ వేసినట్లుగా సునామీ సిస్టర్ లాంటి సైరన్ అందుకుంది...అక్కడి పిల్లలందరూ ఆ అమ్మాయి సైరన్ విని ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.. ఒక్క చర్యతో అందరి నోళ్ళూ మూయించినందుకు నా మీద నాకే గర్వం కలిగింది 'నీ దుంపతెగ నిన్ను మించిన యస్పీయల్ ఏ స్కూల్లోనూ ఉండడెహే..' అనుకుంటుండగా.. ఆ సీపీయల్ గాడు నా దెగ్గరకి వచ్చాడు.. ఆ పిల్ల ఇంకా సైరన్ ఆఫ్ చెయ్యలేదు.. 'ఆ అమ్మాయి.....' అంటూ నా చెవిలో ఒక దేవరహస్యం ఊదాడు.. నాకు మొదట చెమటోచ్చింది.. ఆ తర్వాత వణుకొచ్చింది.. ఫైనల్గా భయమొచ్చింది... 

ఎవరి పేరు చెబితే స్టూడెంట్స్ గుండెల్లో గూడ్స్ పరిగెడుతుందో... ఎవరు భోదిస్తే బయాలజీకే భయమేస్తుందో .. ఎవరి వస్తే తుఫాను వస్తుందో.. ఎవరి రాస్తే బోర్డ్ ఏడుస్తుందో.. ఆ ఫలానా టీచర్ కూతురు ఆ పిల్ల అని చెప్పాడు ... అప్పటికప్పుడు ఆ సునామీ పిల్ల నుంచి నన్ను నేను కాపాడుకోవాలి అనుకున్నాను.. వెంటనే విసిరేసిన బొమ్మ తీసుకొచ్చి ఆ పిలకిచ్చి బుగ్గలు పట్టుకొని లాగి వదిలాను.. అంటే, ఆ పిల్ల నాకు ముద్దోచ్చింది అని నేను అనుకోవాలి.. నాకు బుద్దొచ్చింది అని ఆ పిల్ల అనుకోవాలి... కాని ఆ పిల్ల అలా అనుకోలేదు .. నేను దాని కాళ్ళ బేరానికి రాక తప్పలేదు.. 

"నా చిచ్చి కదూ.. నా బూచి కాదూ.. నా కుచ్చి కదూ.."
"కాదు...పొ ... మా అమ్మకి చెప్తా నీ మీదా ....నన్ను కొట్టాడు, గిచ్చాడు, కొరికాడు అని చెప్తా ... ఆ ..వావావా  ..."
'కొరికానా...గిచ్చానా ...ఓసి రాక్షసి.. ఎలా కనిపిస్తున్నానే' అనుకొని "వద్దు స్వీటీ అమ్మకి చెప్పకు... రేపు నీకు చాక్లెట్ తీసుకొస్తా సరేనా?"
"ఆ చాక్లెట్....అమ్మా చాక్లెట్.... నాకు ఇప్పుడే కావాలి చాక్లెట్...పొడుగు డైరీ మిల్క్ చాక్లేట్...నాకు ఇప్పుడే కావాలి...ఆ ...వావావా..."
'ఇప్పుడు చాక్లెట్ ఎక్కడనుంచి తీసుకురానే పిల్ల రాక్షసి' అనుకొని "ఇప్పుడు బయట ఎక్కడ ఉంటాయి బుజ్జి చాక్లెట్స్... రేపు ష్యూర్ గా తీసుకొస్తా...సరేనా ..." అని మాట పూర్తయ్యేలోపే "పక్కనే చిట్టి కొట్టు ఉంటుంది ...అక్కడ ఉంటాయి...పోయి తీసుకురా ..." అంటూ కిందపడి కొట్టుకొంటూ ఏడవడం మొదలెట్టింది...
'ఇదేక్కడ గోలరా దేవుడా... జేబులో డబ్బులు లేవు ఇప్పుడు చాక్లెట్ ఎలా తీసుకురావాలి ...' అనుకొని ..."సరే..తీసుకొస్తా...ఒక పది నిముషాల్లో వస్తా.." అని వెళ్లబోతుంటే .. నా వెనకాలే వస్తుంది ఆ పిల్ల కూడా.. "నువ్వు నా వెనుకాల ఎందుకు అట్టి కుట్టీ... నేను తీసుకువస్తాలే ..." అన్నాను పళ్ళు పటపటా కొరుకుతూ... "అమ్మా...నువ్వు అటునుంచి అటే వెళ్ళిపోతే ఎలాగా... నువ్ నాకు చాక్లెట్ కొనిచ్చే దాకా నేను నీతోనే వస్తాను .." అంది... 'ఒసినీ...నా తోడంత లేవు నేకెన్ని తెలివితేటలే.. నువ్వు ఫ్యూచర్ లో ఎంత మందిని ముంచుతావో..' అనుకొని .."సరే బంగారం...నీ ఇష్టం.." అన్నాను...

ఇద్దరం కల్సి మా క్లాస్ దాకా వచ్చాం... నేను, నా సెకండ్ క్లాస్ గర్ల్ ఫ్రెండ్ మిస్ పిల్ల రాక్షసి...
"చూడు బంగారం... నువ్విక్కడే ఉండు, నేను నా బ్యాగ్ లో డబ్బులు తీసుకొని ఇప్పుడే వస్తా... ఆ తర్వాత ఇద్దరం కల్సి జాం జాం అంటూ చిట్టి కొట్టుకి వెళ్దాం ...సరేనా?"
"నువ్ లోపలికి వెళ్లి రాకపోతే ..?"
'పెద్దయ్యాక నిన్ను ఎవడు చేసుకుంటాడో కాని సర్వనాశనం ...' అనుకొని "అప్పుడు లోపలి రావడానికి నువ్వున్నావ్ గా ..." అంటూ లోపలికి వెళ్లాను ...

"సురేష్ గా ...ఓ పది రూపాయలు ఉంటే ఇవ్వరా ...రేపిస్తా .." అన్నాను క్లాస్ లోపలికి వెళ్తూనే సురేష్ గాడితో ...
"పది రూపాయలా... అంత డబ్బు ఎందుకురా?"
"అదిగో బయట నిల్చుందే... ఆ అమ్మాయికి చాక్లెట్ కొనాలి..."
"ఆ దెయ్యం పిల్లకి చాక్లెట్ కొనడానికి నన్ను పది రూపాయలు అడుగుతావా? .."
"ప్లీజ్ రా... అది మన బయాలజీ మేడం పుత్రికారత్నం అని తెలియక దానితో పెట్టుకున్నాను...దానికి ఇప్పుడు చాక్లెట్ కొనివ్వకపోతే, రేపు ఆ మహంకాళికి నన్ను మేతగా వేస్తుంది... ప్లీజ్ రా ..."
"ఆహా... నా దెగ్గర లేవురా ... ఇందాకే నోట్స్ కొన్నాను .. "
"నీ తింగరి మొహంలో నా బొంగరం... ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా... ఇంత హిస్టరీ నీకు అవసరమా ..." అన్నాను తిక్కరేగి... అమ్మాయిల్లో కొంచెం మంచి అమ్మాయిలా కటింగ్ ఇచ్చే అరుణ దెగ్గరికి వెళ్లి "అరుణా ...అరుణా...మరే ...నాకు ఒక పది రూపాయలు ఇవ్వవా ..." అన్నాను బెంచ్ మీద గోరుతో గీకుతూ ...
"అర్జెంటా ... సరే మరి నాకు రేపు ఇచ్చేస్తావా ..."
"ఖచ్చితంగా... అంతగా దొరక్కపోతే ఆ కనపడే దెయ్యం పిల్లని సంతలో అమ్మేసి అయినా సరే పది రూపాయలు నీకు ఇచ్చేస్తాను రేపు ..." అని మొత్తానికి పది రూపాయలు సాధించేసి బయటకి వచ్చి ఆ దెయ్యం పిల్ల వైపు చూశా "ఇక వెళ్దామా.." అన్నట్లు ...
"సరే ... రా .." అన్నట్లు ఓ లుక్కిచ్చి ముందుకు కదిలింది ...
"నీ పేరేంటి బంగారం ..."
"పేరు చెప్తే కాని చాక్లెట్ కొనిపెట్టవా ..."
'దీనికి ఈ ఏజ్ లోనే ఇంత ఎటకారం ఉంటే... నా ఏజ్ కొస్తే ఓ రేంజ్ లో ఆడుకుంటది జనాల్ని ... ఆ బయాలజీ మహంకాళి నోట్లోంచి ఊడిపడింది పిల్ల దెయ్యం ...' అనుకుంటూ "రోజుకి ఎన్ని చాక్లేటు తింటావ్ బుజ్జీ ... మరీ ఎక్కువ తినకు .. పళ్ళు పుచ్చిపోతాయి ..ఇప్పుడున్న సైజుకి డబల్ అవుతావ్ .." అన్నాను...
"టెన్ రూపీస్ చాక్లెట్ కి ఇంత బిల్డప్పా... " అని ఆ పిల్ల పిశాచం అనడంతో దెబ్బకి షాక్ తగిలి షేక్ అయ్యాను ... ముస్కోని దాన్ని ఫాలో అయ్యాను ...

ఆ చిట్టి కొట్టు దెగ్గరికి వచ్చాం ...
"డైరీ మిల్క్ బార్ ఇవ్వవా..." అడిగింది పిల్ల దెయ్యం ...
"డైరీ మిల్క్ అయిపోయ్యాయి ... ఫైవ్ స్టార్ ఇవ్వనా .." అంది చిట్టి కొట్టు చిట్టి ...
"వద్దు ... పోనీ కిట్ క్యాట్ ఉందా ... " ఛాయిస్ మార్చింది పిల్ల దెయ్యం ఈ సారి ...
"ఆ ఉంది ..." అంటూ కిట్ క్యాట్ ఇచ్చి "పది హేను రూపాయలు .." అంది ...
నేను ఖంగుతిని "పదిహేనా ...నా దెగ్గర పది రూపాయలే ఉన్నాయి ... వేరే ఏమైనా తీసుకో పది రూపాయల్లో" అన్నాను
"నాకు తెలీదు... నాకు కిట్ క్యాట్ కావాలీ... నాకు కిట్ క్యాటే కావాలీ...ఆ ...అమ్మా ...వావావా ..." మళ్ళ్లీ సైరెన్ మొదలెట్టింది ...
"నా దెగ్గర పది రూపాయలే ఉన్నాయి బుజ్జి కానీ అది పదిహేను అని చెప్పింది కదా ఆవిడ... మరి ఏం చెయ్యను ..."
"అదా ... ఒక పని చెయ్యి ... చిట్టికి మిగతా అయిదు రూపాయలు రేపు ఇస్తా అని చెప్పు ..." అంది ..
"అలా ఇవ్వరు బుజ్జీ ... మనల్ని అలా నమ్మి ఎలా ఇస్తారు ..నేను ఆమెకి తెలియదు కదా .." అన్నాను ..
"మరి నమ్మాలంటే ఏం చెయ్యాలి .."
"జనరల్ గా అయితే మన దెగ్గర ఉన్న విలువైన వస్తువు ఏదన్నా వాళ్ళ దెగ్గర పెడితే అప్పుడు నమ్మి ఇస్తారు ..." అన్నాను ఆ పిల్లకి గొప్ప విషయాన్ని బోధిస్తున్నట్లు ఫీల్ అయిపోయి ... మామూలు పిల్లలు అయితే విని ఓహో అంటారు ...కానీ ఇది పిల్ల పిశాచం కదా అందుకే .."అయితే నీ వాచ్ చిట్టి కొట్టులో పెట్టి కిట్ క్యాట్ తీసుకుందాం ...రేపు నువ్ ఫైవ్ రుపీస్ ఇచ్చేసి నీ వాచ్ తీసుకో ..." అంది ... ఒక్కసారిగా నా మట్టి బుర్రలో కూడా విధ్యుతాఘాతం జరిగింది ... సర్క్యూట్లు అన్ని పేలిపోయాయి ... ఎక్కడి కనెక్షన్లు అక్కడే తెగి అవతల పడ్డాయి .... ఒక్క రెండు నిముషాలు నేను ఈ ప్రపంచానికి చెందిన వాడిని అనే విషయం మర్చిపోయాను ....తెలివి వచ్చిన వెంటనే అది చెప్పిన విషయం గుర్తొచ్చి సర్ ర్  ర్ మని వచ్చిన కోపానికి సలసల మరిగింది నా రక్తం...

"ఏంటే...నీ చాక్లెట్ కోసం నేను నా వాచ్ తాకట్టు పెట్టాలా ... పిల్ల కొరివి దెయ్యమా ... నువ్ ఏం చేసుకుంటావో చేసుకో ... నేను నీకు కనీసం న్యూట్రిన్ ఆశ చాక్లెట్ కూడా కొనిపెట్టను పోవే " అన్నాను ఆవేశంగా ...
అది మళ్ళీ రాగం మొదలెట్టింది ... నేను ఆ రాగానికి తాళం వేశాను తప్పితే తగ్గలేదు ...
ఇక ఏమనుకుందో అదే కాళ్ళ బేరానికి వచ్చింది ... " సరేలే ...ఫైవ్ స్టార్ కొనిపెట్టు .." అంది ...
'ఏం కళలున్నాయే నీ దెగ్గర ... అందితే తల లేకపోతే తోక ..' అనుకొని ఫైవ్ స్టార్ కొని దాని మొహాన కొట్టి ...చకచకా నడుచుకుంటూ స్కూల్ ప్రాంగణంలోకి వచ్చాను ....బయాలజీ మహంకాళి ఎవరినో వంగోబెట్టి బాదుతుంది ... "ఈ రోజు వీడు అయిపోయాడు ....రేపు ఎవడో ?" అనుకుంటూ క్లాస్ కెళ్ళాను ...

                                                                **** మరుసటి రోజు *****

"ఏరా మా అమ్మాయిని కొట్టావంట... దాని బొమ్మని పగలగొట్టావంట... మాట్లడకుండా సైలెంట్ గా చదువుకుంటుంటే వచ్చి అరిచావంట... వళ్లెలా ఉంది.." అంది బయాలజీ మేడం నన్ను చూడగానే నా దెగ్గరికి వచ్చి ...
నాకు వాల్యుమ్ లేదు... 'అదేంటి ఈ పిల్లకి పది రూపాయల చాక్లెట్ కొనిపెట్టినా ఈ మహంకాళికి అడ్డమైనవన్నీ చెప్పేసిందనమాట.. కొరివి దెయ్యమా అయిపోయావే..' అనుకొని "అయ్యో అదేం లేదు మేడం ... నేను అలా ఎందుకు చేస్తాను ... పాప కొంచెం చిలిపి... అందుకే అలా చెప్పింది .." అన్నాను ...
"పాప చిలిపో... నేను చిలిపో రేపు బయాలజీ ఎగ్జాం రిజల్ట్స్ లో తెలుస్తుంది నీకు .... దానికోసమే దుడ్డు కర్ర రెడీ చేశా ..." అంది నా వైపు అమ్మోరికి బలిచ్చే మేకను చూసినట్టు ...

నాకు మహంకాళి చెప్పిన మాటలకు భయం కన్నా ఆ పిల్ల పిశాచం చేసిన మోసమే నాలోని ఎస్పీయల్ ని ఉస్కో అని లేపింది ... యుద్ధ రంగంలోకి దూకినట్లు ఆ పిల్ల పిశాచం ఉండే సెకండ్ క్లాస్ వైపు లంఘించాను... క్లాస్ లో అడుగెట్టి చుట్టూ చూశాను .. ఆ పిల్ల చాక్లెట్ తింటూ బొమ్మకి వాటర్ బాటిల్ లోని నీళ్ళు గుమ్మరించి స్నానం చేయిస్తుంది ... నాకు తిక్కరేగి దాని దెగ్గరికి వెళ్లి .. "ఏమే పిల్ల పిశాచమా ... నిన్న పది రూపాయల చాక్లెట్ కొనిపెట్టినా కూడా మీ అమ్మకి నా మీద లేనిపోనివి చెప్తావా ... ఏమనుకున్నావే నా గురుంచి .."
"నువ్వేమనుకున్నావ్ ... నాకు కిట్ క్యాట్ కొనకుండా ఫైవ్ స్టార్ కొంటావా ...పైగా నన్నుదెయ్యం పిశాచం అంటావా ... అందుకే అమ్మకి చెప్పా ..." అంది నా వైపు కూడా చూడకుండా ...
నాకు బీపీ రైజ్ అయ్యి ఆ పిల్ల బొమ్మని మళ్ళీ లాక్కొని ఈ సారి నేరుగా కిటికీ గుండా విసిరి అవతలికి వేసాను .. అంటే, కిటికీ అవతలికి వెయ్యాలనుకోలేదు ...కానీ నా కోపం అది ఇంధనంగా చేసుకొని అలా వెళ్ళిపోయింది అనమాట ... అప్పుడు సడన్ గా తెలిసొచ్చింది నేను చేసిన తప్పు... ఈ పిల్ల పిశాచం కింద పడి దొర్లి దొర్లి ఎడుస్తుంది... నాకు మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయ్యింది .. ఈ లోపు ఆ క్లాస్ సీపియాల్ గాడు "సార్ నేమ్స్.." అంటూ నా చేతిలో ఒక కాగితం పెట్టాడు ... అది మడిచి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకొని మా క్లాస్ అరుణ దెగ్గరికి వెళ్లాను ....ఈ సారి పదిహేను రూపాయలు అడగడానికి....


See you all soon, have a great day ------------------------------- Ramakrishna Reddy Kotla

24 comments:

naren said...

chala bagundhi

కృష్ణప్రియ said...

పదో క్లాస్ వాళ్ళతో పెట్టుకున్నా తప్పులేదు కానీ..టీచర్ల పిల్లలతో పెట్టుకోకూడదని గుణపాఠం నేర్చుకున్నారన్నమాట.. :)) Hilarious as usual

Sasidhar said...

Brother,

The way you wrote the whole thing is awesome. I read your earlier posts too...you do have a punch in your writings...keep it up.

~Sasidhar Sangaraju
www.sasidharsangaraju.blogspot.com

Indian Minerva said...

అన్న నిజంగా మీ ఇస్కూలులో ఎస్. పి. యల్ కు అంత సీనుంటుందా? ఇస్టోరీ అదిరింది భయ్...

3g said...

హ్హ హ్హ హ్హ.......
ఐతే మీర యస్.పి.యల్లా స్కూల్లో....

sunita said...

hahaha!Hilarious eppaTilaane.

మనసు పలికే said...

హహ్హహ్హా.. కిషన్.. నేనైతే పడీ పడీ నవ్వాను నీ S.P.L. కష్టాలు చూసి.. ఓర్నాయనోయ్.. ఓరి దేవుడోయ్.. ఆ పిల్ల పిశాచాన్ని నువ్వు అన్ని కష్టాలు పెట్టావా.?;) కేకో కేక.. ఇక నీ శైలి ఉంది చూశావూ... అద్భుతం..:) ఇక నవ్వలేను బాబూ.. నాకు కడుపు నొప్పి వచ్చేస్తుంది..:)))))

Anandakiran said...

super

ఆ.సౌమ్య said...

హ హ హ బావుంది,

"ఆ పిల్ల నాకు ముద్దోచ్చింది అని నేను అనుకోవాలి.. నాకు బుద్దొచ్చింది అని ఆ పిల్ల అనుకోవాలి."...త్రివిక్రం డైలాగులా ఉన్నాది. :D

Sai Praveen said...

పిల్ల దయ్యం సూపర్ :)
ఎప్పటిలాగానే పంచ్ లు పేలాయి :)

వేణూ శ్రీకాంత్ said...

హ హ బాగుంది :-)

అమ్మాయి కళలు said...

హే కిషన్ నేను కూడా SPL మా స్కూల్ లో, కాకా పొతే 7th & 10th క్లాసు లో వోటింగ్ లో గెలిచాను. నాకు ని లాంటి కష్టాలు రాలేదు కానీ, నావల్ల మా వాలికి కష్టాలు అన్ని వచాయి. 10th క్లాసు లో అ ఇయర్ మొత్తం నేను 3 టైమ్స్ ప్రయెర్ చేయించాను. ఎప్పటివరకు నాదే స్కూల్ రికార్డు. త్వరలో నా SPL కబుర్లు అన్ని రాస్తాను... చదవడానికి రెడీ గా వుండు.

ఇందు said...

చిన్నపిల్లలు ముద్దొస్తారు కాని ముదుర్లండీ బాబూ..అందుకే నేను చిన్నపిల్లల జోలికి పోను..:D

>>దీనికి ఈ ఏజ్ లోనే ఇంత ఎటకారం ఉంటే... నా ఏజ్ కొస్తే ఓ రేంజ్ లో ఆడుకుంటది జనాల్ని
హ్హహ్హహ్హా!!
పైన ఆ.సౌమ్యగారు చెప్పినట్లు త్రివిక్రం డైలాగ్సే గుర్తొచ్చాయ్....బాగ వ్రాసారు కిషన్ గారు.

Ramakrishna Reddy Kotla said...

నరేన్: థాంక్స్ :-)

కృష్ణప్రియ: అవునండీ ఆ విధంగా అలా నేర్చుకున్నాను :-)... థాంక్స్ :-)

శశిధర్: ధన్యవాదాలు :-)

Ramakrishna Reddy Kotla said...

మీనర్వా: అంత సీన్ మీకు ఏమి కనిపించింది అన్నా... థాంక్స్ :-)

త్రీజీ: అవును ఎస్పీయాల్ నే .. :-)

సునీత: ధన్యవాదాలు ... నా బ్లాగ్స్ కి మీరు చాలా రెగ్యులర్ రీడర్ .. అందుకు ధన్యవాదాలు :-)

Ramakrishna Reddy Kotla said...

అపర్ణ: "ఆ పిల్ల పిశాచాన్ని నువ్వు అన్ని కష్టాలు పెట్టావా.?;)"

ఆ పిల్ల పిశాచాన్ని నేను కష్టాలు పెట్టలేదు ...అదే నాకు కష్టాలు పెట్టింది కదా .. థాంక్స్ :-))

ఆనంద్: థాంక్స్ :-)

ఆ.సౌమ్య: హా హా ధన్యవాదాలు

Ramakrishna Reddy Kotla said...

ప్రవీణ్: థాంక్స్ :-)

వేణూ: థాంక్స్ :-)

నాగమోహన్: మీరు కూడా ఎస్పీయల్ ఎ నా ... గుడ్.. అయితే త్వరగా రాయండి మీ అనుభవాలు మా కోసం :-)

ఇందు: నిజమే చిన్నపిల్లు చాలా ముదుర్లు నువ్వన్నట్లు.. మీ అభిమానానికి థాంక్స్ :-)

నేస్తం said...

హుం..కిషన్ నేను కూడా చిన్నపుడు స్కూల్ లో SPL హోదా వెలగబెట్టాను.. కాని ఒక్కళ్ళూ నన్ను పట్టించుకునేవాళ్ళు కాదనుకో అది వేరే విషయం..బాగారాసావ్ :)

..nagarjuna.. said...

S= school. L= leader....మరి P= whatu ?

ఐనా రెండో క్లాసులోనే దయ్యంగారికి అన్ని తెలివితేటలా...ప్చ్ జనరేషన్ గ్యాపు....

జేబి - JB said...

అదే మరి, ముందే ప్రమోషన్లు ఇస్తే ఇలాగే వుంటాయి :-)
మీకు మీసాలుంటే ఎంత టీచరుపాప అయినా భయపడేది కదా!

బాగా రాశారు.

మనసు పలికే said...

కిషన్ గారు, మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు..:)

శివరంజని said...

బాబోయ్ ఈ పోస్ట్ ఏమిటో????? ఇలాంటి పోస్ట్ లు చదివినవారికి నా పోస్ట్ ఎక్కుతుందా అంట????????

రాసే టప్పుడు కొంచెం ముందు వెనక ఆలోచించి రాయాలి .. వెనకాల నా లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమి రాయలేరు వాళ్ళకి కూడా అవకాశమిద్దాం అన్న ఆలోచనేలేదేమిటి మీకు????

ఉదయాన్నే బాగా నవ్వించారు కిషన్ గారు.... రోజు రోజుకి మీ రైటింగ్ స్కిల్స్ బాగా డెవలప్ చేస్తున్నారు...keep rocking

Ramakrishna Reddy Kotla said...

నేస్తం, మీరు కూడా ఎస్పీయల్లా... సూపరు... సేం పించ్.. :-)

చారి గారు, మరేం నిజమే... గానరేశాను గ్యాపు మరి... P stands for "Pupil"

జేబీ గారు, అంతే అంటారా.. అంతే ఏమోలే :-)

Ramakrishna Reddy Kotla said...

అపర్ణ: థాంక్స్ :-)

రంజని: రంజనీ ఆ మాట నేను అనాలి .. :-).. చాలా థాంక్స్ నీ కాంప్లిమెంటుకి :-)